For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జులై నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

జులై 2020 రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..! ఇలాంటి అంచనాలన్నీ వేద జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి.

|

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు జులై నెలలో ఈ విధంగా ఉన్నాయి. ఈ నెలలో కొన్ని రాశుల వారిలో ఉద్యోగులకు పని భారం చాలా తేలికగా ఉంటుంది. అంతేకాదు, మీరు ఏదైనా బదిలీ కోరుకుంటే, అది కూడా నెరవేరే అవకాశం ఉంది. మరి కొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది.

July 2020 Monthly Horosocope in Telugu

ఓ రాశి విద్యార్థులకు ఈ నెలలో అద్భుతంగా ఉంటుంది. కొన్ని రాశుల ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా జులై మాసంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో.. ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జూలై ఉపవాసాలు-పండుగలు-గ్రహణాలు, జూలైలో జన్మించిన వారి వ్యక్తిత్వాలు..!!జూలై ఉపవాసాలు-పండుగలు-గ్రహణాలు, జూలైలో జన్మించిన వారి వ్యక్తిత్వాలు..!!

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు రానున్నాయి. మీ పనులలో ఉన్న పెద్ద ఆందోళన తొలగిపోతుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ నెలలో కచ్చితమైన ఫలితాలను పొందుతారు. అయితే ఉద్యోగులకు ఈ నెలలో బాధ్యతలు పెరగొచ్చు. ఇవి మీ పురోగతికి సంకేతాలుగా కూడా పని చేస్తాయి. వ్యాపారులకు ఈ నెలలో సన్నిహితుడి సహాయంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించగలరు. ఈ కాలంలో పెద్దగా ఖర్చులు కూడా ఉండవు. మీ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆరోగ్య పరంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే అజాగ్రత్తగా ఉండకూడదు.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : మార్స్

లక్కీ నంబర్లు : 5, 10, 22, 30, 47, 58

లక్కీ డేస్ : సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం

లక్కీ కలర్స్ : ఎల్లో, గ్రీన్, వైట్, స్కై బ్లూ

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈ నెలలో నిరుపేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కాలంలో మీకు అలాంటి అవకాశం లభిస్తుంది. మీరు ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే, మీరు మీ వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందించవచ్చు. మీరు ఈ నెలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పని విషయంలో ఈ నెలలో మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే, మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. ఉద్యోగులపై ఉన్నతాధికారులు రహస్యంగా నిఘా ఉంచే బలమైన అవకాశం ఉంది. ఈ సందర్భంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంటుంది. అయితే మీ డబ్బు చాలా తేలికగా ఖర్చవుతుంది. ఆరోగ్య పరంగా ఈ నెల కొంత ఆందోళన ఉంటుంది.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : శుక్రుడు

లక్కీ నంబర్లు : 2, 8, 15, 22, 32, 40, 54

లక్కీ డేస్ : సోమవారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం

లక్కీ కలర్స్ : మెరూన్, డార్క్ బ్లూ, ఆరెంజ్, క్రీమ్

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆర్థిక పరంగా చాలా కష్టంగా ఉంటుంది. అయితే మీరు మీ కృషికి తగ్గట్టు మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది, అయితే కొన్ని పెద్ద ఖర్చుల కారణంగా మీ బడ్జెట్ అసమతుల్యంగా ఉండవచ్చు. వ్యాపారులకు ఈ నెలలో మంచిగా ఉంటుంది. మీ కెరీర్‌లో కొత్త మలుపులు తెచ్చే కొన్ని మంచి మరియు బంగారు అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు ఖచ్చితంగా పురోగతిని పొందవచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి, ఈరోజు విజయం లభిస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభించవచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : మెర్క్యూరీ

లక్కీ నంబర్లు : 2, 18, 20, 33, 48, 51

లక్కీ డేస్ : గురువారం, ఆదివారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్ : బ్రౌన్, పర్పుల్, రెడ్, పింక్

కరోనా వేళ ఈ పరిహారాలు చేస్తే కచ్చితంగా ప్రయోజనాలుంటాయట...!కరోనా వేళ ఈ పరిహారాలు చేస్తే కచ్చితంగా ప్రయోజనాలుంటాయట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారికి ఈ నెల కెరీర్ పరంగా చాలా మంచిగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ఈ నెలలో ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మీ ఆలోచనలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను ఉంచుతారు. మీ కుటుంబ జీవితంలో ప్రారంభంలో మంచిగా ఉంటుంది. అయితే మధ్యలో కొన్ని సమస్యలు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఈ నెలలో పెద్ద సమస్యలేమీ ఉండవు. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : చంద్రుడు

లక్కీ నంబర్లు : 4, 19, 27, 36, 43, 58

లక్కీ డేస్ : మంగళవారం, సోమవారం, గురువారం, ఆదివారం

లక్కీ కలర్స్ : రెడ్, వైట్, ఆరెంజ్, డార్క్ బ్లూ

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈ నెలలో వారి ప్రియమైన వారి నుండి కొన్ని విభేదాలు వస్తాయి. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. లేదంటే మీ ఇద్దరి మధ్య దూరంగా పెరగొచ్చు. అయితే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. కాబట్టి, వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఆర్థిక పరంగా ఈ నెల మంచిగా ఉంటుంది. మీ కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద పని చేయాలనుకుంటే, మీ పెద్దల అనుమతిని తీసుకోవాలి. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని వదిలి వేరే కంపెనీలో చేరొచ్చు. ఈ నిర్ణయం వల్ల మీకు మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా అన్నీ అనుకూలంగా ఉండాలంటే మీరు ప్రతిరోజూ రోజూ ధ్యానం చేయాలి.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : సూర్యుడు

లక్కీ నంబర్లు : 2, 8, 17, 31, 45, 52

లక్కీ డేస్ : శుక్రవారం, గురువారం, మంగళవారం, సోమవారం

లక్కీ కలర్స్ : లైట్ ఎల్లో, క్రీమ్, స్కై బ్లూ, గ్రీన్, మెరూన్

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈ నెలలో అద్భుతమైన ప్రారంభాన్ని పొందొచ్చు. ఈ సమయంలో మీరు దాదాపు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఒక వైపు, మీ ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీరు సీనియర్ ఆఫీసర్లతో పాటు సహోద్యోగులతో మంచి సంబంధాలు పెట్టుకోవడం చాలా ముఖ్యం. వ్యాపారులకు ఈ కాలంలో మంచి వ్యాపార ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నెలలో ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. కానీ మీకు ఆదాయం విషయంలో ఎవరితో అయినా వివాదం ఏర్పడొచ్చు. ఆరోగ్య పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : మెర్క్యూరీ

లక్కీ నంబర్లు : 5, 14, 23, 30, 49, 50

లక్కీ డేస్ : శనివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం

లక్కీ కలర్స్ : క్రీమ్, ఆరెంజ్, పర్పుల్, గ్రీన్

కుబేరుడిని ఇలా పూజిస్తే ధనవంతులు అవ్వడం ఖాయం, సుఖ సంపదలు మీ సొంతం! అప్పుడు ఈ మంత్రాలను జపించండి!కుబేరుడిని ఇలా పూజిస్తే ధనవంతులు అవ్వడం ఖాయం, సుఖ సంపదలు మీ సొంతం! అప్పుడు ఈ మంత్రాలను జపించండి!

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈ నెలలో చాలా ఓపికగా పని చేయాలి. లేదంటే మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందలేకపోవచ్చు. అయితే మీరు నిరాశకు గురికాకుండా, సానుకూల ఆలోచనలతో ఉంటే, మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు ప్రభుత్వ విభాగంలో పనిచేస్తుంటే, ఈ సమయంలో మీరు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మీరు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు బాగా ఆలోచించాలి. వ్యాపారులకు పెద్ద లాభం ఉండొచ్చు. మీరు బ్యాంకింగ్ రంగంలో పని చేస్తుంటే, మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో చిన్న సమస్యలు ఎదురవుతాయి.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : శుక్రుడు

లక్కీ నంబర్లు : 1, 7, 14, 24, 30, 45, 59

లక్కీ డేస్ : శనివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం

లక్కీ కలర్స్ : వైట్, పర్పుల్, ఎల్లో, రెడ్

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు డబ్బు గురించి చాలా ఆందోళన చెందుతారు. తక్కువ ఆదాయం మరియు అధిక ఖర్చుల కారణంగా మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు మీ వంతుగా కష్టపడాలి. మరోవైపు వ్యాపారులకు కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీరు విజయం మాత్రం సాధించి తీరుతారు. మీరు ఏదైనా క్రొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ సమయంలో భాగస్వామ్యంతో పనిచేయడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా గందరగోళంగా ఉంటుంది. మరోవైపు వివాహం చేసుకున్న వారికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : మార్స్ మరియు ఫ్లూటో

లక్కీ నంబర్లు : 6,19 28,37,44,58

లక్కీ డేస్ : సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం

లక్కీ కలర్స్ : బ్లూ, వైట్, డార్క్ గ్రీన్, రోజ్

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతికూలంగా ఉంటుంది. మీకు చాలా విషయాల్లో మిశ్రమ ఫలితాలే వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, మీకు ప్రమోషన్ యొక్క సంకేతాలు కనబడుతున్నాయి. కాబట్టి కష్టపడి పనిచేయండి. మరోవైపు, సహోద్యోగులతో జరుగుతున్న అన్ని సమస్యలను ఈ సమయంలో అధిగమించవచ్చు. వ్యాపారులు ఈ నెలలో కొన్ని చిన్న ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఆరోగ్యానికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థిక పరంగా ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆదాయం విషయంలో అంతా ప్రతికూలంగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం : అగ్ని,

రాశి చక్ర గ్రహం : గురుడు

లక్కీ నంబర్లు : 3, 5, 17, 21, 36, 48, 50

లక్కీ డేస్ : మంగళవారం, శనివారం, గురువారం, సోమవారం

లక్కీ కలర్స్ : మెరూన్, డార్క్ బ్లూ, క్రీమ్, ఆరెంజ్

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారు ఈ నెలలో పని విషయంలో అద్భుత విజయాన్ని సాధిస్తారు. ఈ కాలంలో మీరు పెద్ద పురోగతిని పొందవచ్చు. మీ ఆదాయంలో పెరుగుదల సంకేతాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఉద్యోగులు కోరుకున్న బదిలీని కూడా పొందవచ్చు. మరోవైపు, వ్యాపారులకు ఈ నెలలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. మీరు లాభాలు సంపాదించేందుకు మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : శని

లక్కీ నంబర్లు : 6, 18, 24, 36, 44, 54

లక్కీ డేస్ : సోమవారం, గురువారం, మంగళవారం, శనివారం

లక్కీ కలర్స్ : క్రీమ్, పర్పుల్, రెడ్, కుంకుమ

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ నెలలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఉన్నతాధికారులతో మీ ఇబ్బందులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి కారణంగా మీ పనితీరు కూడా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ప్రతి అడుగును చాలా ఆలోచనాత్మకంగా వేయాలి. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. త్వరలో మీకు ఫలితాలు అనుకూలంగా అనిపిస్తాయి. వ్యాపారులకు ఈ నెల నెమ్మదిగా ఉంటుంది. మీరు చిన్న లాభాలను పొందగలిగినప్పటికీ, పెద్ద లాభాలను పొందడానికి మీరు మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ నెలలో కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉండదు. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : యురేనస్, సాటర్న్

లక్కీ నంబర్లు : 9, 17, 22, 39, 46, 52

లక్కీ డేస్ : గురువారం, సోమవారం, శుక్రవారం, మంగళవారం

లక్కీ కలర్స్ : డార్క్ రెడ్, ఎల్లో, బ్లూ, గోధుమ

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ నెలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు తమ అద్భుతమైన పనితీరుకు సీనియర్ అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తద్వారా మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. మీరు రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తుంటే, ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా విషయాల్లో మీకు కలిసి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో చిన్న సమస్యలు ఉండవచ్చు, కానీ మీరు మీ సంబంధంలో ప్రేమను కొనసాగించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ సమయం వివాహితులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను వింటారు. ఆరోగ్య పరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : నెఫ్ట్యూన్, గురు

లక్కీ నంబర్లు : 4, 14, 26, 34, 45, 55

లక్కీ డేస్ : మంగళవారం, గురువారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్ : గ్రీన్, పర్పుల్, రెడ్, ఎల్లో

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

July 2020 Monthly Horosocope in Telugu

For some zodiac signs, the month of July will be auspicious and for others it will be inauspicious. However, there is only one way to find out what the stars have in store for you, that is by reading your monthly horoscope.
Desktop Bottom Promotion