Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
వైరల్ : అదిరిపోయే స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చిన పెళ్లికూతురు... ఆమె డ్యాన్స్ ఎలా ఉందో మీరే చూడండి...
అయితే కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పులలో ప్రస్తుతం బంధువులు లేదా స్నేహితులు బలవంతం చేస్తే పెళ్లి కొడుకు కొన్ని స్టెప్పులు వేయడం వంటివి మనం చూస్తున్నాం.
మన దేశంలో పెళ్లి అనే తతంగానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఈ అవకాశాన్ని జీవితాంతం మధుర క్షణంలా నిలిచిపోయేలా చేసుకోవాలనుకుంటున్నారు.

సాధారణంగా పెళ్లి అంటే భాజభజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. బంధువులు.. స్నేహితులు.. కుటుంబ సభ్యులతో పెళ్లి వేదిక అంతా తెగ హడావుడిగా ఉంటుంది. అయితే ఇలా రోటిన్ గా జరుపుకుంటే కిక్ ఏముంటుంది అని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు.

అవి చాలా ఫన్నీగా అనిపిస్తాయి కూడా. ఇటీవలే ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో పెళ్లిళ్లలో ఉల్లిగడ్డలను బహుమతులుగా ఇవ్వడం.. ఉల్లిగడ్డలను దండలుగా మార్చుకోవడం వంటివి మనం చేశారు. అయితే తాజాగా కేరళలోని ఓ పెళ్లికూతురు పెళ్లి మండపంలో వెరైటీగా ఎంట్రీ ఇచ్చింది.

అది చూసి పెళ్లికుమారుడు ఆశ్చర్యపోయాడట.. అయితే ఎంట్రీకి సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. పెళ్లి కుమారుడు ఎందుకు ఆశ్చర్యపోయాడు. ఈ వీడియోలో తెలుసుకోండి...

పెళ్లిలో డ్యాన్సులు..
మన దేశంలో పెళ్లి తర్వాత లేదా పెళ్లికి ముందు వధువు లేదా వరుడిని కలిపి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ సమయంలో డిజెలు లేదా మంగళ వాయిద్యాలు.. డప్పులతో తెగ హడావుడి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వధువు లేదా వరుడి బంధువులు లేదా స్నేహితులు డ్యాన్సులు వేయడం కామనే..

కొన్నిసార్లు జంటగా..
అయితే కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పులలో ప్రస్తుతం బంధువులు లేదా స్నేహితులు బలవంతం చేస్తే పెళ్లి కొడుకు కొన్ని స్టెప్పులు వేయడం వంటివి మనం చూస్తున్నాం. కొన్నిసార్లు జంటగా కలిసి కూడా డ్యాన్స్ చేస్తుంటారు.
పెళ్లికి ముందే..
అయితే తాజాగా పెళ్లి కాక ముందే కేరళలోని అంజలి అనే పెళ్లికూతురు పెళ్లి మండపంలోకి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది. అయితే అకస్మాత్తుగా ఇలా ఎంట్రీ ఇచ్చేసరికి పెళ్లికొడుకు షాకయ్యాడట.

పెళ్లికూతురుతో పాటు..
అయితే తను సింగిల్ గా కాకుండా.. చాలా మంది అమ్మాయిలతో కలిసి అందరూ కలిసి ఒకే రకంగా డ్యాన్స్ చేస్తూ.. పెళ్లి కూతురు ముందుగా నిల్చొని డ్యాన్స్ చేస్తూ వివాహ వేదికలోకి ఎంట్రీ ఇవ్వడంతో అతిథులందరూ ఆశ్చర్యపోయారు.

సోషల్ మీడియాలో..
ఈ డ్యాన్స్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురి వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త బాగా వైరల్ అయిపోయింది. ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే వేలాది మంది లైకులు.. కామెంట్లు.. షేర్ లు చేయడం మొదలెట్టారు.

తమదైన శైలిలో..
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ సంబరపడిపోయారట.. ఈ సందర్బంగా వారు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఏమో తమకు తమ పెళ్లి రోజు గుర్తుకు వస్తుందని.. నూతన వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



Click it and Unblock the Notifications
