Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
Maha Shivratri 2021:మీ రాశిని బట్టి శివుడిని ఇలా పూజిస్తే.. మీకు శుభఫలితాలు వస్తాయి...!
మహా శివరాత్రి సమయంలో మీ రాశిని బట్టి శివుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ సంవత్సరం అది మార్చి 11వ తేదీన (గురువారం) వచ్చింది. ఈరోజున పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం, ఆ భోలేనాథుడిని ఆరాధించడం చాలా సులభం. ఆ స్వామి వారికి ఈ రకమైన పూజలు చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం, శాంతి, లభించడంతో పాటు శుభఫలితాలొస్తాయి. అయితే మీ రాశి చక్రాన్ని బట్టి మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు మహా శివరాత్రి రోజున ‘మమలేశ్వరయ నమః' అనే మంత్రం జపించడంతో గులాబీ పువ్వులతో శివుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు వస్తాయి.

వృషభ రాశి..
ఈ రాశి వారు మహా శివరాత్రి పండుగ సమయంలో శివ లింగానికి పాలాభిషేకం చేసి ఏడుసార్లు ‘నాగేశ్వరయ నమః' అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి వారు మహా శివరాత్రి పర్వదినాన శివలింగానికి చెరకు రసంతో అభిషేకరం చేస్తూ.. భూతేశ్వర మంత్రాలను జపించాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు మహా శివరాత్రి పండుగ శుభ సమయంలో శివలింగానికి పంచామ్రుతంతో అభిషేకం చేయాలి.

సింహ రాశి..
ఈ రాశి వారు మహా శివరాత్రి పండుగ వేళ ఆ పరమేశ్వరునికి తేనేతో అభిషేకం చేయాలి. ‘ఓం నమ శివాయః' అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీరు కోరికలన్నీ నెరవేరుతాయి.

కన్య రాశి..
మహా శివరాత్రి పండుగ రోజున కన్య రాశి వారు ఆ మంజునాథ స్వామి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయాలి. అనంతరం శివచలిసాను పారాయాణం చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయి.

తుల రాశి..
ఈ రాశి వారు మహా శివరాత్రి పండుగ పర్వదినాన ఆ శివుడికి పెరుగుతో అభిషేకం చేసి.. శివాష్టకమ్ ను ప్రశాంతంగా పఠిస్తే మీకు శుభ ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు మహాశివరాత్రి పండుగ సమయంలో ఆ భోళా శంకరుడికి పాలు మరియు నెయ్యితో అభిషేకం చేయాలి. అనంతరం ‘అంగారేశ్వరయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు మహాశివరాత్రి పండుగ రోజున ఆ శివశంకరునికి పాలతో అభిషేకం చేసి ‘ఓం అమరనారాయణం' అనే మంత్రాన్ని జపిస్తే.. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

మకర రాశి..
ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున దానిమ్మ పండ్లతో శివుడికి అభిషేకం చేయాలి. అనంతరం ‘శివ సహశాస్త్రం' జపించాలి. ఇలా చేస్తే మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారు మహా శివరాత్రి పండుగ అయిన పవిత్ర సమయంలో శివుడికి పాలుగు, పెరుగు, చక్కెర, తేనే వేర్వేరుగా అర్పించి, ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఈ సమయంలో ‘ఓం శివాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

మీన రాశి..
ఈ రాశి వారు మహాశివరాత్రి పండుగ అయిన పర్వదినాన ఆ మంజునాథుడికి పండ్లు, స్వచ్ఛమైన నీటితో అభిషేకరం చేయాలి. అనంతరం శివుని మంత్రాలను జపించాలి.



Click it and Unblock the Notifications
