Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మకర సంక్రాంతి 2020 : ఈ రాశుల వారికి సంపద పెరిగిపోతుందట...!
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సమయంలో అన్ని రాశి చక్రాలు సూర్యుని ప్రభావానికి గురవుతాయి.
ఈ సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది. ఆ రోజున సూర్యుడు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజు. అందుకే ఆ రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. హిందువులకు ఈ పండుగ చాలా ముఖ్యమైనది.

అలాగే ఈ పండుగలోపు రైతులందరికీ పంట చేతికి వచ్చి ఉంటుంది. అందుకే ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సమయంలో అన్ని రాశి చక్రాలు సూర్యుని ప్రభావానికి గురవుతాయి. ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుడి పరివర్తన అన్ని రాశి చక్ర గుర్తులను ఏయే విధంగా ప్రభావితం చేస్తుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి...
Rashi Phalalu 2020 : ఈ సంవత్సరం ఈ రాశుల వారికి చాలా విషయాల్లో కలిసి వస్తుందట...!

మేష రాశి..
ఈ రాశి వారికి మకర సంక్రాంతి వారికి చాలా పవిత్రంగా ఉంటుంది. ఆ రోజున మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగా బలపడుతుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా మీ వృత్తి జీవితంలో పురోగతిని మీరు చూస్తారు. మీరు జీవితంలో ఉన్న విభేదాల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అన్ని విషయాల్లో మీకు విజయం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మిధున రాశి..
మకర సంక్రాంతి సందర్భంగా ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన పనితీరు కోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా తమ జీవితంలో కొంత పురోగతిని పొందే అవకాశం ఉంది. ఇక మీ వృత్తి జీవితం ఎప్పటిలాగే ఉంటుంది, మీరు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు శాంతంగా ఉండాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి మకర సంక్రాంతి సందర్భంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వీరి ఆస్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మీరు భక్తి భావాలు కలిగి ఉంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారికి మకర సంక్రాంతి సందర్భంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మరింత కష్టపడి పని చేయాలి. దీని వల్ల మీరు అప్పుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారు ఈరోజు కొన్ని లాభాలను పొందుతారు. వీరి పనిలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఏవైనా కోరికలు కోరుకుంటే అవి అన్ని నెరవేరుతాయి.

వృశ్చిక రాశి..
మకర సంక్రాంతి సందర్భంగా ఈ రాశి వారికి సంపద పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పనిలో ఉన్న సీనియర్లు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి మకర సంక్రాంతి సందర్భంగా వారి పనిలో అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా విద్య పట్ల ఆసక్తి చూపుతారు. సూర్య దేవునికి నీటిని సమర్పించండి. కార్యాలయంలో మీకు ఎవరితో అయినా విభేదాలు ఉంటే వాటిని విస్మరించడానికి ప్రయత్నించండి.

మకర రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా మరింత కష్టపడాల్సి ఉంటుంది. పనికి సంబంధించి విదేశీ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. మీకు మానసిక శాంతి ఉండకపోవచ్చు. అందుకే మీరు సూర్య భగవానుడికి నీటిని అర్పించండి.

కుంభ రాశి..
ఈ రాశి వారు మకర సంక్రాంతి సందర్భంగా పనిలో లాభాలను చూస్తారు. అయితే కార్యాలయంలో ఉండే వారు మీ సీనియర్లతో కొంత విభేదాలు కలిగి ఉండాల్సి రావచ్చు. అలాంటి వాటిని మీరు నివారించాలి. అలాగే మీ సంపద పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

మీన రాశి..
మకర సంక్రాంతి సందర్భంగా ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. శత్రువులు బలహీనంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
