Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
May Day 2022: కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
కార్మిక దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను తెలుసుకుందాం.
ఈ విశ్వమంతా ప్రతిరోజూ ప్రతి పనిని సక్రమంగా చేయాలంటే.. అందుకు కారణం కార్మికుడే. ఈ విశ్వాన్ని ముందుకు నడిపించే వాడు కార్మికుడే.

తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే 'కార్మిక దినోత్సవం'.

మే డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సందర్బంగా మే డే ఎలా వచ్చింది.. ఎనిమిది గంటల పని విధానం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

కార్మిక దినోత్సవం..
మే డేను అంతర్జాతీయ కార్మిక దినోత్సం అని కూడా పిలుస్తారు. యునైటెడ్ స్టేట్స్ లో మాత్రం మే డే నాడు ‘లాయల్టీ డే'గా పిలుస్తారు. ఈ రోజున అనేక దేశాల్లో సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశానికో.. సంఘటనకో ముడి పెట్టలేం. అయితే 1886 సంత్సరంలో అమెరికాలోని షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మే డే పుట్టుకకు పునాది వేసిందని చెబుతుంటారు.

8 గంటల పని విధానం..
కార్మికులందరికీ ఎనిమిది గంటల పని విధానం కావాలని నినాదాలు చేస్తూ 1886 మే 1వ తేదీన వేలాది మంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. దీనికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే అది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొందరు కార్మికులు మరణించారు.

ఎగిసిపడ్డ ఉద్యమం..
ఆ సంఘటన జరిగిన అనంతరం 1889 నుండి 1890 వరకు కార్మికులకు మద్దతుగా, అనేక దేశాల్లో ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలూ చోటు చేసుకున్నాయి. 1890 సంవత్సరంలో మే 1వ తేదీన బ్రిటన్లోని హైడ్ పార్కులో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. వారందరూ కేవలం 8 గంటలు మాత్రమే పని వేళలు ఉండాలన్నదే వారి ప్రధాన డిమాండ్.

మే ఒకటో తేదీన ఒప్పందం..
ఆ తర్వాత యూరోపియన్ దేశాల్లో కూడా ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. దీంతో కార్మికులు, యాజమాన్యాలు ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చారు. క్రమంగా షికాగోలో చనిపోయిన వారికి ప్రతీకగా మే ఒకటో తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం జరిగింది. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. చాలా దేశాల్లో కార్మికుల పోరాటాలూ, నిరసనలు నిరంతరం జరుగుతూ వచ్చాయి.

ఒప్పందానికి తూట్లు..
అయితే అప్పటికీ యూరపోయిన్ దేశాల్లో కొన్ని ప్రభుత్వాలు 8 గంటల పని విధానం ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంతో సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. అలా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కూడా మే డే రోజు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు కూడా చేపట్టేవారు. ఆ తర్వాత నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు.

మార్క్స్ ప్రభావం..
కార్ల్ మార్క్స్ (జర్మన్ తత్వవేత్త, జర్నలిస్ట్, సంస్కరణవాది మరియు ఆర్థికవేత్త) రాసిన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పారిశ్రామిక కార్మికులపై మరియు దానికి అంకితమైన సంస్థలపై గొప్ప ప్రభావాన్ని చూపిందని చెబుతారు. 1848 వ సంవత్సరంలో పారిశ్రామిక కార్మికులు తీవ్ర దోపిడీని ఎదుర్కొంటున్నప్పుడు ఈ మ్యానిఫెస్టో రాశారు. అయినప్పటికీ, కార్మికుల డిమాండ్లు కేవలం ఒక రోజులో నెరవేరలేదు. వాస్తవానికి, దీనికి కొన్ని సంవత్సరాలు పట్టింది. నిరసన రక్తపాతం కూడా చూసింది. ఇదిలా ఉండగా.. కార్మిక దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. అలాగే సంక్షేమ పథకాల అమలుకు మరియు నిరసన ప్రదర్శనలకు మే 1వ తేదీ వేదికగా మారింది. చాలా దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై వ్యతిరేక ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి.



Click it and Unblock the Notifications