Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
Mercury Transit in Cancer : ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!
ఆగస్టు 2న బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం బుధుడు ఆగస్టు 2వ తేదీన తెల్లవారుజామున 3:31 గంటల కర్కాటకంలోకి ప్రవేశించనున్నాడు. ఆగస్టు 17వ తేదీ ఉదయం 8:29 వరకు అందులోనే ఉంటాడు. కర్కాటకంలో ఇప్పటికే సూర్య భగవానుడు కూడా ఉన్నాడు. ఈ సమయంలో బుధుడు కూడా ప్రవేశించడంతో అంతా శుభ ఫలితాలే ఉంటాయని పండితులు చెబుతున్నారు.

బుధుడి సంచారం వల్ల మేధస్సు, తెలివితేటలు, బుద్ధి, వ్యాపారాల వంటి విషయాల్లో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో ఆ రాశితో పాటు ఇతర రాశులపైనా దాని ప్రభావం ఉంటుంది. ఆగస్టు 2న కర్కాటకంలోకి ప్రవేశించే బుధుడు.. ఆగస్టు 17వ తేదీన తిరోగమించనున్నాడు. ఈ సందర్భంగా 12 రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు కోరుకునే వారికి మంచి ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే మీరు ధైర్యంగా ఉండాలి. మీ కటుంబ సభ్యుల మధ్య సంబంధం మంచిగా ఉంటుంది. వారి మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే మీరు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

మిధున రాశి..
బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో మిధున రాశి వారికి ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటాయి. మీ కుటుంబంతో మీరు మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ మాటలకు ఇతరులు ఆకర్షితులవుతారు. సమాజంలో మీ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి..
ఈ రాశిలోకే బుధుడు ప్రవేశించే సమయంలో.. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడే వారికి కఠినమైన సమయంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులు మంచి ఫలితాలను పొందాలంటే చాలా కష్టపడాలి. మీ కుటుంబంలో కూడా వివాదాలు తలెత్తవచ్చు. మీరు అనవసరపు ఖర్చులను కూడా తగ్గించాలి.

సింహ రాశి..
బుధుడు కర్కాటకంలోని ప్రవేశించే సమయంలో సింహ రాశి వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా గందరగోళంగా ఉంటుంది. శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి.

కన్య రాశి..
బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ కూడా రావచ్చు. మీ కుటుంబంలో అంతా బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

తుల రాశి..
బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి చాలా లక్కీగా ఉంటుంది. మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. శత్రువులపై కూడా మీరు విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు మానసికంగా ఉపశమనం పొందుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. అయితే మీరు చేస్తున్న పనిలో మాత్రం ఏదో ఒక ఆటంకం రావచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా కొంత సమస్యగా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా మంచిగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. పోటీ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్త వినే అవకాశం ఉంది. మతపరమైన పనులపై మీ ఆసక్తి ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో విడిపోయే అవకాశం కూడా ఏర్పడొచ్చు. మీ ఇంట్లో ఇతర సభ్యులతో సమన్వయ లోపం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలహీనంగా ఉంటుంది. ఆర్థిక పరంగా నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. ఈ సమయంలో మీరు ప్రయాణాలు మానుకోవాలి.

కుంభ రాశి..
బుధుడు కర్కాటకంలోకి ప్రవేశవించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ శత్రువుపై ఆధిపత్యం కూడా చెలాయిస్తారు. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా గందరగోళానికి గురవుతారు. మీరు చేసే పనిలో లేదా వ్యాపారంలో నిర్లక్ష్యాన్ని నివారించాలి. లేకపోతే మీకు నష్టం సంభవిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications
