Mercury Transit In Virgo 2020 : కన్యరాశిలోకి బుధుడి ఎంట్రీ వల్ల ఏ రాశి వారికి లాభమంటే...!

కన్యరాశిలోకి బుధుడి సంచారం వల్ల మీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడండి...

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు అందరికీ ప్రయోజనం కలిగించే గ్రహం అని పండితులు చెబుతుంటారు. రాశిచక్రాలలో మిధునం, కన్యరాశులకు అధిపతి కూడా బుధుడే.

Mercury Transit In Virgo : Effects On Your Zodiac Sign

మన జాతకంలో బుధుడు బలంగా ఉంటే బుద్ధి, తెలివితేటలు, నైపుణ్యాలతో పాటు వ్యాపారం వంటి అనేక విషయాల్లో మనకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది.

Mercury Transit In Virgo : Effects On Your Zodiac Sign

అలాంటి బుధుడు సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12.11 గంటలకు బుధుడు సింహ రాశి నుండి కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో చాలా గ్రహాలు ప్రభావితమవుతాయి. బుధుడు ఒక రాశి నుండి మరోరాశిలోకి ప్రవేశించే సమయంలో ఆ రాశితో పాటు మిగతా రాశులపై కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది.

Mercury Transit In Virgo : Effects On Your Zodiac Sign

ఇలాంటి సమయంలో బుధుడు మీ జాతక చక్రంలో బలహీనంగా మారితే మీరు విష్ణుసహస్రనామం, విష్ణు పారాయణం, వెంకటేశ్వరస్వామి, విఘ్నేశ్వరులను ప్రార్థించాలి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంతో ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..

మేషరాశి..

బుధుడు సింహ రాశి నుండి కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో మేషరాశి వారు అనారోగ్య సమస్యల నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. మీరు చేసే పని ప్రదేశంలో కూడా మీకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో ఎలాంటి పోటీలోనైనా రాణించగలరు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా సాధారణంగా ఉంటుంది. బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో సూర్యుడు ఆరోస్థానంలో ఉంటాడు.

వృషభరాశి..

వృషభరాశి..

బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో మిధున రాశికి ఐదో స్థానంలో ఉంటాడు. ఈ సమయం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మంచి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు. అదే సమయంలో మీరు ఇల్లు లేదా కారు వంటి పెద్ద కొనుగోళ్లను చేయడానికి మంచిగా ఉంటుంది.

మిధునరాశి..

మిధునరాశి..

బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి నాలుగో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పూర్వీకుల పెట్టుబడి, ఆస్తి వంటి ప్రయోజనాలను పొందవచ్చు. మీరు మీ కుటుంబంతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం కూడా లభిస్తుంది. ఈ కాలంలో మీరు మీ తోబుట్టువులు లేదా దాయాదులతో సామరస్యాన్ని మరియు ప్రేమను పొందుతారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మూడో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి శక్తి స్థాయి, సామర్థ్యాలు పెరుగుతాయి. బుధుడు, సూర్యుడితో కలవటం వల్ల మీ శక్తి మరియు విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు చేసే ప్రయత్నాలలో విజయం ఎలా సాధించాలానే దానిపై సంపూర్ణమైన స్పష్టత వస్తుంది. అయితే మీరు కోపాన్ని ప్రదర్శించకూడదు. ఉద్యోగులు ఈ సమయంలో సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకూడదు.

సింహ రాశి..

సింహ రాశి..

బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశికి రెండో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. మీరు పూర్వీకుల ఆస్తిని లేదా పెట్టుబడి నుండి కొంత నిధులను కూడా పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు ఈ కాలంలో కొన్ని అప్పులను కూడా తిరిగి చెల్లిస్తారు. మీ సామాజిక నైపుణ్యాలతో ఈ కాలంలో మీరు ఎక్కువ మంది స్నేహితులను పొందుతారు. ఈ సమయంలో విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి..

కన్య రాశి..

బుధుడు ఈ సమయంలో ఈ రాశిలోకే ప్రవేశిస్తున్నందున ‘బుధుడికి ఆదిత్య యోగం' ఏర్పడుతుంది. దీని వల్ల కన్యరాశి వారికి చాలా సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసిన పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా పెండింగులో ఉన్న కుటుంబ యాత్రను కూడా ప్లాన్ చేయొచ్చు.

తుల రాశి..

తుల రాశి..

బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి 12వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో తులరాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో కూడా కొత్త బాధ్యతలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు దీన్ని మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు అవకాశంగా పరిగణించాలి. మరోవైపు మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. అయితే మీరు అనవసరమైన వాటికి ఖర్చు చేయకుండా ఉండాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

బుధుడు కన్యరాశిలోకి ప్రయాణించే సమయంలో ఈ రాశి వారికి 11వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీరు కొంత డబ్బును ఆదా చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ కాలంలో మీరు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇలాంటి పరిస్థితులలో మీరు తినే మరియు తాగే వాటిలో జాగ్రత్త వహించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి పదో స్థానంలో ఉంటాడు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దీనిని ‘కార్యాఖేత్ర' అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి పని చేసే ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. ఉద్యోగులకు బోనస్ లేదా ప్రమోషన్ రావొచ్చు. ఉద్యోగులు తమ బదిలీని కోరుకుంటే ఈ సమయంలో మంచి అవకాశాన్ని పొందుతారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి బుధుడు తొమ్మిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహం పెరుగుతుంది. ఈ కాలంలో మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

బుధుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఎనిమిదో స్థానంలో ఉంటారు. ఈ సమయంలో మీకు సానుకూల మరియు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. మీరు ప్రేమ వివాహం గురించి ప్లాన్ చేస్తుంటే, మీకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయితే మీరు చింతించాల్సిన పనిలేదు. మీరు కొంతసమయం వేచి ఉండండి. మీకు అవసరమైనప్పుడు స్నేహితులు మరియు కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. అప్పుడు మీరు ఊహించని ఫలితాలను పొందుతారు.

మీన రాశి

మీన రాశి

ఈ రాశి వారికి ఏడో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. వాతావరణంలో మార్పు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో ఈ సమయంలో సాధారణంగానే ఉంటుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మరికొంత సమయం వేచి ఉండాలి. ఎందుకంటే ఈ కాలం మీకు అనుకూలంగా లేదు.

Desktop Bottom Promotion