Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
Mercury Transit in Virgo on 26 August 2021:బుధుడు కన్యరాశిలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!
2021 సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీన బుధుడు కన్యరాశిలోకి ఆగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధుడిని రారాజుగా భావిస్తారు. ఎవరి జాతకంలో అయినా బుధుడి అనుగ్రహం ఉంటే.. వారికి మేధస్సు, తెలివితేటలు, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

అలాంటి బుధుడు ఆగస్టు 26వ తేదీన ఉదయం 11:18 గంటలకు తన స్థానాన్ని మారనున్నాడు. సింహ రాశిలో నుంచి కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేయనున్నాడు.

సెప్టెంబర్ 22 తర్వాత కన్యరాశి నుండి తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అయితే ఏ రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి.. ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు కలగనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
బుధుడు ఈ రాశి నుండి ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా మేష రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒత్తిడి ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల మీకు మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో మరియు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో గొడవలు రావొచ్చు. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆఫీసు పాలిటిక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో మీరు అధిక రుణ లావాదేవీలను నివారించాలి.

వృషభ రాశి..
బుధుడు ఈ రాశి నుండి ఐదో పాదం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు ఆశించిన విజయాన్ని పొందుతారు. ప్రేమ సంబంధిత విషయాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీరు ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆ సందర్భం అనుకూలంగా ఉంటుంది. పిల్లల సంబంధిత ఆందోళనల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.

మిధున రాశి..
ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం నుండి సంచరించనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు స్నేహితులు మరియు బంధువుల నుండి సహకారం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కరించబడతాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో పని చేసేవారు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ రాశి వారికి బుధుడి రవాణా కారణంగా సాధారణ ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడితే చాలా నష్టపోవాల్సి వస్తుంది. సమాజంలో మీ పట్ల ఉన్న గౌరవం కాస్త తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అలాగే కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వల్ల మీరు చాలా వరకు నష్టపోవచ్చు. మరోవైపు బుధుడి రవాణా వల్ల వ్యాపారులకు మరియు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.

సింహ రాశి..
ఈ రాశి నుండి బుధుడు రెండో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో బుధుడి ప్రభావం ఆర్థిక పరమైన అంశాలపై పడనుంది. మీరు ఆకస్మిక ధనాన్ని పొందే బలమైన అవకాశం ఉంటుంది. ఉపాధి దిశగా చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సుదీర్ఘకాలం పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో పరస్పర సామరస్యం పెరుగుతుంది. మీ స్థిరాస్థులకు సంబంధించిన విషయాలు పరిష్కరించబడతాయి. మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా నియంత్రించగలుగుతారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి..
బుధుడు ఆగస్టు 26వ తేదీన ఉదయం 11:18 గంటలకు సింహ రాశి నుండి కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీరు చేసే పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ కాలంలో ఉద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు మీ ఉద్యోగం మార్చాలనుకుంటే.. మీరు విజయం సాధిస్తారు. మీరు అవివాహితులైతే.. వివాహానికి సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి. మీ కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి నుండి బుధుడు పన్నెండో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు ఆర్థిక పరంగా నష్టం రావొచ్చు. మీరు ఈ కాలంలో ఎవరితో అయినా లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయంలోనూ అస్సలు తొందరపడొద్దు. మీరు తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటే, మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆఫీసులో ప్రత్యర్థులుగా భావించే వారితో మరింత అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది. మీ సీనియర్ కుటుంబ సభ్యులు మరియు అన్నల నుండి మద్దతు లభిస్తుంది. మీకు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కూడా పెరుగుతాయి. ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, లేదా కొత్త ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటే, ఆ అవకాశం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి ఉద్యోగులు, మరియు వ్యాపారులు కొత్త అవకాశాలను పొందే అవకాశం మెండుగా ఉంటుంది. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే.. ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు వీసా వంటి ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు. సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మకర రాశి..
ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ప్రణాళిక బద్ధంగా పని చేయాలి. ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త జంటకు పిల్లల పుట్టుక గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరంటే ఇష్టపడని వ్యక్తులు కూడా.. ఈ కాలంలో మీకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. మీ ఆరోగ్యం మంచిగానే ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు మీ హెల్త్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ సమయంలో మీకు చర్మ సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా అలర్జీ ఉండే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం చేయడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరోవైపు ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత కష్టపడినా ఫలితం మీకు ప్రతికూలంగా రావొచ్చు. ఈ సమయంలో మీరు ఎలాంటి రుణాలు ఇవ్వడం మరియు తీసుకోవడం చేయకూడదు.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఏడో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. అయితే ఇదంతా భాగస్వామ్య వ్యాపారం వల్లే సాధ్యమవుతుంది. మరోవైపు మీరు ఈ కాలంలో ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈ సమయం చాలా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఎదురుచూస్తున్న పనులు ఈ కాలంలో పూర్తవుతాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











