Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
Mithuna Rasi Ugadi Rasi Phalalu 2022:'శుభకృత' ఏడాదిలో మిధున రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...
తెలుగు నూతన సంవత్సరంలో మిధున రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృత' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా మిధున రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-11, వ్యయం-05
‘శుభకృత' నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఆదాయ పరంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి గురు గ్రహం అనుగ్రహం వల్ల కొత్త ఏడాదిలో శుభకరమైన ఫలితాలొస్తాయి. విద్యార్థులకు విద్యారంగంలో మంచిగా ఉంటుంది. కాంట్రాక్టులకు భారీ ఒప్పందాలు కుదరొచ్చు. ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

రాజపూజ్యం-2, అవమానం-02
మిధున రాశి వారికి కొత్త ఏడాదిలో శని గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడొచ్చు. రాహు గ్రహం ప్రభావంతో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరొచ్చు. కొత్త దంపతులకు సంతానం గురించి శుభవార్త వినిపించొచ్చు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు.

కొత్త ఏడాదిలో..
తెలుగు నూతన సంవత్సరంలో కేతువు వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సరం మధ్యలో మహిళలకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు మీరు కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది.

కొన్ని సమస్యలు..
తెలుగు సంవత్సరం కొత్త ఏడాది ప్రారంభంలో మీ కుటుంబ జీవితంలో ప్రోత్సాహాకరంగా ఉంటుంది. మీ అభిరుచికి తగిన విధంగా ఇంట్లో మార్పులు చేయొచ్చు. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ఆగస్టు నుండి..
మిధున రాశి వారు ఆగస్టు మాసం నుండి మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ప్రణాళికలన్నీ కార్యరూపం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల మీ ఖర్చులు పెరగొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీకు కొన్ని ఆకస్మిక ఆర్థిక సమస్యలు కూడా రావొచ్చు.

2023లో..
ఇక 2023 సంవత్సరంలోని జనవరి, ఫిబ్రవరి నెలలో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు తమ ఉద్యోగం మార్పు కావాలంటే మంచి కాలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గొచ్చు. విద్యార్థులు ఈ కాలంలో విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాల వల్ల శుభప్రదంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications