For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బాడీలోని ఈ 8 భాగాలలో మచ్చలుంటే మీ చేతిలో డబ్బే నిలబడదంట... అవెక్కడో చూసెయ్యండి...

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ బాగా డబ్బు సంపాదించాలని, ఆనందంగా జీవించాలని ఆశ ఉంటుంది. అయితే కొందరు కష్టపడి పైకి వస్తారు. కానీ కొందరు మాత్రం ఎంత కష్టపడినా వారు ఆశించిన ఫలితం అస్సలు దక్కదు.

అంతేకాదు అనవసరపు ఖర్చులు చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆశించినా.. పరిస్థితి వారి చేయి దాటిపోతూ ఉంటుంది. అయితే దీనికి కారణం మీ అలవాటు మాత్రమే కాదు. మీ తలరాత లేదా విధి వల్లనే అని నిపుణులు చెబుతున్నారు.

మీకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా.. మీరు ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన సొమ్ము వచ్చినట్టే ఖర్చయిపోతుంటే, అందుకు మీ పుట్టుమచ్చలు కూడా ఒక కారణం కావచ్చు. పుట్టుమచ్చలకు, డబ్బులకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మన పూర్వీకులు మరియు గ్రంథాలు మన బాడీలోని కొన్ని సంకేతాల ఆధారంగా మన భవిష్యత్తు ఆధారపడి పడి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ కింద ఉన్న భాగాల్లో మీకు మచ్చలు ఉన్నాయేమో చూసుకోండి మరి...

జూన్ 5 తర్వాత ఈ 5 రాశుల వారు బిలీనియర్లు అయ్యే అవకాశముందట...

సాముద్రిక శాస్త్రం...

సాముద్రిక శాస్త్రం...

సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలోని నిర్దిష్ట భాగాలలో మచ్చలు ఉన్నవారు ఆడవారైనా, మగవారైన అనివార్యంగా డబ్బులను ఖర్చులు పెడుతూ బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఇలాంటి వారు కోరుకున్న సంపదను ఎప్పటికీ పొందలేరు. వీరి చేతిలో డబ్బు అనేది అస్సలు నిలబడదు. ఈ పుట్టుమచ్చల వల్ల వయసుతో పాటు అలవాట్లు, ఆలోచనలు కూడా మారుతాయట. వీరి జీవిత కాలంలో కష్టాలు పడుతూనే ఉంటారు. ఇక విషయానికొస్తే మన బాడీలోని ఈ 8 ప్రాంతాల్లో ఉంటే పుట్టుమచ్చల కారణంగా సంపాదనపై తీవ్ర ప్రభావం ఉంటుందట.

ఎడమ చెంపపై..

ఎడమ చెంపపై..

సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఎడమ చెంపపై పుట్టు మచ్చ ఉండే వారికి ఆదాయ వనరులు కావాల్సినంతగా లభిస్తాయి. కానీ వీరు ఆ సంపదను సేవ్ చేయడంలో మాత్రం తీవ్రంగా విఫలమవుతారు. మీ ఆదాయం ఎక్కువగా ఖర్చయిపోతుంది.

పెదాల కింద..

పెదాల కింద..

పెదాల పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే సంపదకు ఎలాంటి లోటు ఉండదట. కానీ పెదాల కింద పుట్టుమచ్చ ఉంటే మాత్రం డబ్బు కోసం నానా కష్టాలు పడాల్సి వస్తుందట. వీరు తరచుగా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటారు.

ఈ వారం మీ రాశి ఫలాలు 7 నుండి జూన్ 13వ తేదీ వరకు...

అరచేతి మధ్యలో..

అరచేతి మధ్యలో..

అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే యవ్వనంలోకి వచ్చేసరికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీరికి డబ్బుకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. కానీ వీరు ఖర్చులను మాత్రం నియంత్రించలేరు.

ఎడమ కాలి మీద..

ఎడమ కాలి మీద..

ఎడమ కాలి మీద పుట్టుమచ్చ ఉంటే, మీరు సంపాదించిన సంపదనంతా మీకు తెలియకుండానే ఖర్చు చేస్తారు. మీరు మీ సొమ్మును దాచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అంతే మొత్తంలో ఖర్చు అవుతుంది తప్ప.. ఫలితం మాత్రం ఉండదు.

చూపుడు వేలిపై..

చూపుడు వేలిపై..

చూపుడు వేలిపై లేదా బొటనవేలికి మధ్య లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు జీవితాంతం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో వీరు కడుపు నిండా కూడు తినేందుకు నానా తిప్పలు పడతారంట.

జూన్ నెలలో ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి... మీ రాశి కూడా ఉందేమో చూడండి...

అక్కడ ఉంటే..

అక్కడ ఉంటే..

అరచేతికి, ఉంగరం వేలికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే క్లిష్ట సమయాల్లో డబ్బు చేతికి దొరకదు. కానీ అందరితోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తారు. కాబట్టి మీకు కష్టం కలిగినప్పుడు వీరు సహాయపడతారు. ఒకవేళ ధనిక కుటుంబంలోని స్త్రీని లేదా పురుషుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టాల కడలిలో ఈదుకుంటూ జీవితం సాగించాల్సిందే.

కనుబొమ్మల దగ్గర..

కనుబొమ్మల దగ్గర..

కనుబొమ్మల పెరుగుదల లేదా ఎడమ కంటిపాప లేదా కంటిపాప, నుదురుకు మధ్య పుట్టుమచ్చ ఉంటే మీరు లైంగిక ఆనందానికి బలహీనంగా ఉన్నారని అర్థం. దీనికి కూడా డబ్బే ప్రధాన సమస్యగా ఉంటుంది.

ఎడమ చేతి చంకలో..

ఎడమ చేతి చంకలో..

చివరిదైనా పుట్టుమచ్చల్లో ఎడమ చేతి చంకలోది ఒకటి. ఈ భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఆరోగ్య పరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వీరికి తీవ్రమైన వ్యాధులు, రోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స చేయించుకునేందుకు డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేసేస్తారు.

English summary

Moles on these body parts are inauspicious

According to the knowledge of Samudrika Shastra moles in these areas of the body indicate severe Money-Crisis. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more