Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
ఈ రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులవుతారట! మీ రాశి ఉందేమో చూడండి మరి..
ఈ రాశి చక్రంలో పుట్టిన వారు చాలా నిరాడంబరంగా ఉంటారు. వీరికి హడావుడి చేయడం.. దర్పం ప్రదర్శించడం అనేవి అస్సలు ఇష్టం ఉండదట.
కోటీశ్వరులు కావాలన్న కల ఎవరికి ఉండదు చెప్పండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ అందరి కన్నా ఎక్కువగా సంపాదించాలని ఎన్నెన్నో కలలు కంటుంటారు. అయితే కొందరు కష్టపడి తమ కలలను నిజం చేసుకుంటారు.

మరి కొందరు ఏ మాత్రం కష్టపడకుండా కోటీశ్వరులు అవుతుంటారు. ఇదంతా వారి రాశి చక్ర ఫలమే అని జ్యోతిషశాస్త్ర పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఎప్పటికీ పచ్చనోట్ల లోటు అనేదే ఉండదట.

వీరిలో కూడా కొందరు పుట్టుకతోనే సంపన్నులైతే.. మరి కొందరు మాత్రం తమ మేధాశక్తితో కోటీశ్వరులుగా.. బిలినీయర్లుగా మారిపోతారంట.

ఇంతకీ ఏయే రాశుల వారికి వారి జీవితంలో అసలు డబ్బుకు లోటు అనేదే ఉండదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూసేయండి మరి..

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి. నవగ్రహాల్లో కూడా సూర్యుడు చాలా ముఖ్యమైన గ్రహాధిపతి. కాబట్టి ఈ రాశి వారు కూడా ఎప్పుడూ ఎవరెస్ట్ వంటి ఎత్తులో ఉండాలని భావిస్తారట. వీరి దగ్గర అవసరాన్ని మించి ధనం ఉంటుందట. వీటితో తాము ఏమి కావాలంటే అది చేయడానికి ఆసక్తి చూపుతుంటారట. వీరికి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకూ కరెన్సీ కష్టాలే రావంట.

ఖాళీగా కూర్చోరు..
అయితే సింహ రాశి వారు మాత్రం ఎప్పటికీ ఖాళీగా కూర్చోరు. వీరు నిత్యం ఏదో పని చేయాలని చూస్తుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయట. అందుకే వీరు చిన్న వయసులోనే తమ కంటే పెద్దవారికి ఉన్నతాధికారిగా పని చేస్తారు. ఇక వీరి జీవితంలో ఏదైనా అనుకుంటే దాని కన్నా ఎక్కువ డబ్బును సంపాదిస్తారట. అంతే కాదు ఎక్కువ డబ్బును పొదుపు చేస్తారట.

వృషభ రాశి..
ఈ రాశి చక్రంలో పుట్టిన వారు చాలా నిరాడంబరంగా ఉంటారు. వీరికి హడావుడి చేయడం.. దర్పం ప్రదర్శించడం అనేవి అస్సలు ఇష్టం ఉండదట. అయితే వీరి దగ్గర ప్రతిదీ బ్రాండెండ్, ఖరీదైన వస్తువులు ఉంటాయట. ఎందుకంటే వీరు నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడరట. ఈ రాశి వారికి వారసత్వంగా ఆస్తులు వచ్చి చేరతాయి. అయితే వీరి తెలివితేటలతో కూడా ఆ ఆస్తులను మరింత పెంచే ప్రయత్నం చేస్తారట.

ఎక్కువ ఖర్చు..
అయితే వీరికి ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టమట. అంతేకాదు ఎక్కువ బయట తిరిగేందుకు ఇష్టపడతారంట. వీరు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకూ ఎంతైనా ఖర్చు పెడతారట. దానితో పాటు ఇంకా ఏ పని చేసి అయినా వీరు అనుకున్నది సాధిస్తారట.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి చాలా భావోద్వేగాలు ఉంటాయట. వీరు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం డబ్బును ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తారట. వీరి విషయంలో డబ్బు అనేది కేవలం ఆనందానికి సంబంధించిన ఒక వస్తువు మాత్రమే. వీరి జీవితంలో డబ్బు అనే లోటు అస్సలు ఉండదట. వీరు ఎప్పటికీ తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇష్టపడతారట. పెద్దల నుండి వచ్చిన ఆస్తితో పాటు తమ తెలివితేటలతో మరింత ఆదాయాన్ని సంపాదిస్తారట. వీరు సంపన్నులు అవ్వడానికి చాలా చిన్నతనం నుండే సంకేతాలు కనిపిస్తాయట.

నీళ్లలా ఖర్చు..
అయితే వీరు డబ్బును దాచిపెట్టుకోరట. తమ సంతోషాలు, తమ కుటుంబ సభ్యులు, సంతోషాల కోసం డబ్బును వీరు నీళ్లలా ఖర్చు చేస్తారు. కరెన్సీతో వచ్చే రిచ్ లైఫ్ ని తాము ఎంజాయ్ చేస్తూ.. తమ కుటుంబసభ్యులకు కూడా అలాంటి ఆనందాన్ని అందిస్తూ వీరు ఆనందాన్ని సొంతం చేసుకుంటారట.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి బ్రాండెడ్ వస్తువులంటే చాాలా ఇష్టమట. ఇతరుల కంటే తామే సంపన్నులం.. సంపన్నుల మాదిరిగా జీవిస్తున్నామని చూపించుకోవడానికి వీరు చాలా డబ్బునే ఖర్చు చేస్తారట. ఈ రాశిలో జన్మించిన చాలా మందికి తాము ఆర్జించిన దాని కంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎక్కువగా ఉంటుంది.

ఏ ఆలోచనా రాదు..
వీరు డబ్బును ఖర్చు చేయడానికి ఏ మాత్రం ఆలోచించరట. తమ డబ్బును గుడ్డిగా ఖర్చు చేసేస్తారట. ఎంతో డబ్బు ఉండే ఈ రాశి వారు తమ దగ్గర ఏదైనా డబ్బు పోయినా కూడా ఖర్చుల విషయంలో వెనుకాడరట. ఎందుకంటే ప్రతి అంశంలోనూ తాము రాయల్ గా ఉండాలని భావిస్తారట. వీరి రాజసం గురించి.. వీరి ఖర్చుల గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని భావిస్తారట. అలా విపరీతంగా ఖర్చు చేయడంతో పాటు.. అలా ఖర్చు చేయడానికి అవసరమైన డబ్బునూ సంపాదిస్తారు.



Click it and Unblock the Notifications
