Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే!
2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!
ప్రేమ, ప్యార్, ఇష్క్ అనే ఈ రెండు అక్షరాలకు అపరిమితమైన శక్తులు ఉన్నాయి. ఈ ప్రేమ కోసం ఎందరో మహానుభావులు.. ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి ప్రేమ ఎప్పుడు పుడుతుందో.. ఎవ్వరి మీద పుడుతుందో అస్సలు తెలియదు. అయితే జ్యోతిష్యశాస్త్రం మాత్రం మీ రాశిని బట్టి మీరు ఎప్పుడు ప్రేమలో పడతారు?

మీరు ఎవరిని జీవిత భాగస్వామిగా చేసుకుంటారో తెలియజేస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అలాగే 2020 సంవత్సరంలో మీ రాశి చక్రాల ప్రకారం మీ జీవిత భాగస్వామితో మీకు మూడు ముళ్లు ఎప్పుడు పడతాయి? మీకు వారి నుండి లక్కీ కలసి వస్తుందా? అనే విషయాలతో పాటు 2020 సంవత్సరంలో మీ రాశికి సరైన జోడి ఏదో తెలుసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే ఆలుమగల అనుబంధం చాలా ప్రత్యేకమైనది...

అంచనాలు మాత్రమే..
ప్రేమకు, జ్యోతిష్యశాస్త్రానికి సంబంధం లేదని కొందరు చెబుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం జ్యోతిష్యశాస్త్రంలో విషయాలు శాస్త్రీయంగా ఉంటున్నాయని చెబుతున్నారు. అయితే రాశి చక్రాల ఆధారంగా ప్రేమ విషయంలో అన్ని నిజం కాకపోవచ్చు. అయితే వీటి వల్ల ఒక వ్యక్తి గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి సహాయపడుతుందని కొందరు నమ్ముతున్నారు.

మేష, కుంభ రాశులు..
ఈ రెండు రాశుల వారికి 2020 సంవత్సరంలో విభిన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటే అగ్నికి సంకేతంగా.. మరొకటి గాలికి సంకేతంగా పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే.. వీరు ఈ సంవత్సరం ఊహించిన దాని కంటే అనుకూలంగా అస్సలు ఉండలేరు. అయితే వీరి మధ్య సంబంధం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే ఈ రెండు రాశుల వారు సాహసం వంటి నిర్ణయాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ప్రతి క్షణం వీరిద్దరూ కలిసి కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆరాటపడుతుంటారు.

వృషభ, కర్కాటక రాశులు..
ఈ రాశుల వారికి 2020 సంవత్సరంలో అనుకూలమైన సంకేతాలే కనబడుతున్నాయి. ఈ ఏడాది వీరు శారీరకంగా మరియు మానసికంగా ప్రత్యేకమైన వాటిని పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి మధ్య అనుబంధం ఈ సంవత్సరం మరింత పెరుగుతుంది. వీరి బంధం ద్వారా మెరుగైన జీవితానికి బాటలు వేసుకోవాలనుకుంటారు.

మిథున, కుంభ రాశులు..
ఈ సంవత్సరంలో ఈ రాశుల వారికి సంబంధం విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఈ రాశుల వారు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటివి తరచూగా చేస్తుంటారు. అలాగే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. దీని వల్ల వీరిద్దరూ కలిసి ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. వీరిద్దరూ స్వతంత్య్ర ఆలోచనలను కలిగి ఉంటారు.

మకర, వృషభ రాశులు
ఈ రాశుల వారికి భూమి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి జీవించడాన్ని ఆనందిస్తారు. వీరి మధ్య బలం చాలా బలంగా ఉంటుంది.

తుల, మిధున రాశులు..
ఈ రాశుల వారికి ఇద్దరికీ గాలి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వీరిద్దరూ అంత త్వరగా అర్థం కారు. అయితే వీరిద్దరూ ఒకటే సంకేతాలు కాబట్టి, ఒకరిని వదిలి మరొకరు అస్సలు ఉండలేరు.

సింహ, ధనస్సు రాశులు..
ఈ రాశి వారిలో ఇద్దరు చాలా సాహసవంతంగా ఉంటారు. ఇద్దరూ మంచి ధైర్యవంతులు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు చాలా నమ్మకంగా ఉంటారు. కాబట్టి వీరిద్దరూ సంతోషంగా కలిసి జీవించగలరు.

తుల, మిధున రాశులు..
ఈ రాశుల వారికి ఇద్దరికీ గాలి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వీరిద్దరూ అంత త్వరగా అర్థం కారు. అయితే వీరిద్దరూ ఒకటే సంకేతాలు కాబట్టి, ఒకరిని వదిలి మరొకరు అస్సలు ఉండలేరు.

ధనస్సు, మేష రాశులు..
ఈ రాశుల వారికి అగ్ని సంకేతాలుగా కనిపిస్తున్నాయి. వీరి గర్వం మరియు అభిరుచుల వల్ల వీరి ప్రేమ బంధం కష్టంగా ఉంటుంది. అయితే వీరిద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. వీరిద్దరూ కలిసి 2020 సంవత్సరంలో కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఇష్టపడతారు. వీరిద్దరూ మొండి పట్టుదల స్వభావం గలవారు.

కర్కాటక, మీన రాశులు..
ఈ రాశుల వారు సహజంగానే కలిసి బతకడానికి ఇష్టపడతారు. కర్కాటక రాశి వారికి వారి కుటుంబం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. వీరు మీన రాశి వారితో ప్రేమతో మరికొన్ని విషయాల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు.



Click it and Unblock the Notifications