Latest Updates
-
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్‌వర్డ్‌లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.!
National Youth Day 2023: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానందుని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
జనవరి 12, జాతీయ యువజన దినోత్సవం, వివేకానంద జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్వామి వివేకానంద(1863-1902) జయంతిని పురస్కరించుకుని 1985 నుండి ఏటా భారత్‌లో జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. నేషనల్ యూత్ డే సందర్భంగా యువత శక్తిని ఎలా వెలికితీయాలి, ఎలా విజయవంతంగా ముందుకుసాగాలి, వంటి అంశాలపై చర్చలు జరుపుతూ యువతలో ప్రేరణ నింపే థీమ్స్‌తో ఈ రోజును జరుపుకుంటాం. హిందూమతాన్ని మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద.

మత సహనాన్ని సమర్థించాలని, మతోన్మాదాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు వివేకానందుడు. కేవలం 39 సంవత్సరాల్లో వివేకానందుడు తన అపార జ్ఞానాన్ని దేశానికి ప్రపంచానికి పంచాడు. యువతరం ఆకాంక్షలకు రెక్కలు ఇచ్చాడు. హిందూ సాంప్రదాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేశాడు.
జనవరి 12, జాతీయ యువజన దినోత్సవం, వివేకానంద జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్వామి వివేకానంద తల్లిదండ్రులు
స్వామి వివేకానంద కలకత్తాలోని ఓ బెంగాలీ కాయస్థ వంశానికి చెందినవారు. ఆయన తండ్రి పేరు విశ్వనాథ్ దత్తా కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పని చేసేవారు. ఆయన తాత పేరు దుర్గాచరణ్ దత్తా. 25 సంవత్సరాల వయస్సులో ప్రపంచాన్ని త్యజించారు. సంస్కృత, పర్షియన్ పండితుడిగా మారారు. వివేకానంద అసలు పేరు నరేంద్ర నాథ్ దత్తా. మొత్తం 9 మంది పిల్లల్లో వివేకానందుడు ఒకరు.

2. శిక్షణ పొందిన సంగీతకారుడు వివేకానందుడు
వివేకానంద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఆయన సంగీత విధ్వాంసులు బేణి గుప్తా, అహ్మద్ ఖాన్ వద్ద సంగీతం నేర్చుకున్నారు. వివేకానంద సితార్, ధోలక్ సహా ఇతర వాయిద్యాలను కూడా వాయించగలరు.

3. చాలా వేగంగా చదవగలరు
స్వామి వివేకానంద చిన్నప్పటి నుండే చాలా వేగంగా చదివేవారు. స్థానిక లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకుని వాటిని ఒక్కరోజులో పూర్తి చేసి మరుసటి రోజు తిరిగెచ్చేసేవారు. లైబ్రేరియన్ వివేకానందుడి పఠన వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిజంగానే చదువుతున్నాడో లేదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడు. ఒక పుస్తకాన్ని ఇచ్చి దానిని చదవమని తర్వాత అందులోని నుండి ఒక ప్రశ్న అడుగుతానని చెప్పాడు. వివేకానంద పుస్తకం చదవడం పూర్తయిన తర్వాత లైబ్రేరియన్ అడిగిన ప్రశ్నను సరైన సమాధానం చెప్పడంతో లైబ్రేరియన్ అవాక్కయ్యాడు.
వివేకానంద పాశ్చాత్య తర్కం, పాశ్చాత్య తత్వశాస్త్రం, ఐరోపా చరిత్రలో ఎంతో ప్రావీణ్యం పొందారు.

4. రామకృష్ణ పరమహంసను కలుసుకున్న నరేంద్రనాథ్
నరేంద్రనాథ్ రామకృష్ణ పరమహంసను కలవడం యాదృచ్ఛికంగా జరిగింది. ట్రాన్స్ అంటే ఏమిటో తెలుసుకోవాడనికి రామకృష్ణ పరమహంసను కలుసుకోవాలని తన సాహిత్య ప్రొఫెసర్ సూచించగా.. అలా నరేంద్రనాథ్ పరమహంసను మొదటిసారి కలుసుకున్నారు.

5. స్వామి వివేకానంద పేరు ఎలా వచ్చింది
స్వామి వివేకానంద పరమహంస దగ్గర శిష్యరికం చేస్తున్న సమయంలో ఆయన జ్ఞానాన్ని చూసి మైమరిచిపోయిన అజిత్ సింగ్ అనే వ్యక్తి నరేంద్రనాథ్‌కు స్వామి వివేకానంద అనే పేరును సూచించారు. జ్ఞానం, ఆధ్యాత్మిక పరాక్రమాన్ని సూచిస్తుందని చెప్పారు. 1893 మే 31వ తేదీన నరేంద్రనాథ్ చికాగోకు వెళ్లే ముందు స్వామి వివేకానంద అనే పేరును స్వీకరించారు. అదే పేరుతో చికాగోకు వెళ్లారు. చికాగో ప్రసంగం ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. అలా వివేకానంద పేరు అందరికీ తెలిసింది.

6. మరణం గురించి ముందే తెలుసుకున్న వివేకానంద
జీవితాంతం అణగారిన వర్గాలకు స్వామి వివేకానంద సేవ చేశారు. ఇది ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 39 సంవత్సరాల వయస్సులో ఆయన మధుమేహం, ఉబ్బసం, మూత్రపిండాల సమస్యల, కాలేయ సమస్య సహా అనేక ఇతర సమస్యలతో బాధపడ్డారు. తాను 40 ఏళ్లకు మించి బతకలేనని ముందే అంచనా వేశారు స్వామి వివేకానంద.

7. వివేకానంద మరణానికి కారణం
స్వామి వివేకానంద మరణాన్ని పరిశీలించినప్పుడు ఆయన మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడమే మరణానికి కారణంగా తేలింది. ఆయన తల పైభాగంలో కొంచెం చీలిక కనిపించడంతో అది బ్రహ్మరంధ్రంగా భావించారు ఆయన శిష్యులు. ఆయన యోగి మరణాన్ని పొందాడని వారు గ్రహించారు. అది మహాసమాధి ప్రక్రియలో బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణం లేదా ఆత్మ తలపైకి వెళ్లినప్పుడు సంభవిస్తుంది. స్పృహతో ఉద్దేశపూర్వకంగా మోర్టల్ కాయిల్‌ను వదిలివేయడం అనేది గ్రహించిన యోగికి సంకేతం. ఈ ప్రక్రియను మహాసమాధి అని అంటారు.



Click it and Unblock the Notifications