Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
ప్రతి ఒక్కరి వ్యవహారంలో జోక్యం చేసుకునే రాశిచక్రాలివే..
ఈ రాశి వారు ఇతర రాశి చక్రాల వారికి సహాయం చేయాలనుకుంటున్నారు. అది ఏ మాత్రం తప్పు కాదు. కానీ వారు అవసరం అయినప్పుడు కాకుండా అనవసరం అయిన సమయంలో సహాయం చేసేందుకు ముందుకు వస్తారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జీవితంలో ఏమి జరుగుతుందో దాని గురించి మాత్రమే కాకుండా మన లక్షణాల గురించి కూడా ద్వాదశ రాశులు ప్రభావితం చేస్తాయి.

మీ రాశి చక్రం బట్టి మీ ప్రవర్తన ప్రభావితం అవుతుంది. మీరు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారో లేదో మీ రాశి చక్రం నిర్ణయించగలదని మీకు తెలుసా.. అయితే ఈ స్టోరీలో ఏయే రాశి చక్రం ఎలా వ్యవహరిస్తుందో.. ఎంత ముక్కుసూటిగా ఉంటుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.

వృషభరాశి..
ఈ రాశి వారు వారికి తెలిసిన తమ నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకోకుండా ఉండలేరు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, వారి జోక్యం సహాయకారిగా ఉందా లేదా ఇతరులకు బాధ కలిగించిందా అనే దాని గురించి వృషభరాశి వారు ఆలోచించరు. వారు ఏదైనా వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత గుడ్డిగా వెళ్లిపోతారు. తర్వాత వారు తమ తప్పును తెలుసుకుని బాధపడతారు. కానీ మంచి అనిపిస్తే మాత్రం ఎప్పటికీ వెనక్కి తగ్గరు. పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్న వాటన్నింటినీ పట్టించుకోరు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఇతర రాశి చక్రాల వారికి సహాయం చేయాలనుకుంటున్నారు. అది ఏ మాత్రం తప్పు కాదు. కానీ వారు అవసరం అయినప్పుడు కాకుండా అనవసరం అయిన సమయంలో సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. కీలక సమయాల్లో పరిస్థితిని మరింత దిగజారుస్తారు. కానీ కొన్నిసార్లు మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కానీ అవన్నీ సరైనవి కావు. అందుకే వీరి జోక్యం ఎల్లప్పుడూ సమస్యలను సృష్టిస్తుంది.

మిధున రాశి..
ఈ రాశి వారు ఏదైనా తప్పు జరిగినా లేదా అన్యాయాన్ని చూసినా తట్టుకోలేకపోతారు. వెంటనే అందులో జోక్యం చేసుకుంటారు. కొన్నిసార్లు వారి వ్యవహారంలో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని మాత్రం వారు ఇష్టపడరు. ఎందుకంటే వారి జోక్యం అసహ్యకరమైన సమస్యలను సృష్టిస్తుంది. కాని వాటిని నిరోధించలేము. పరిస్థితికి సంబంధం లేకపోయినా వారు మాట్లాడతారు. అనవసరంమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు వినాశనం చేసే వ్యక్తులు అయితే మాత్రం కాదు. అదే వినాశనాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి సమస్యలు ఉన్నప్పుడు తమ సామర్థ్యం మేరకు తాము చేయాల్సింది మాత్రం చేయరు. ఎందుకంటే ప్రతి సమస్యకు వీరి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సింహ రాశి వారు ఎవరైనా తప్పు దారిలో వెళ్తుంటే వారిని సరైన దిశలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. వీరు జోక్యం చేసుకునే నాయకుడిలా భావిస్తారు. ఇది వారికి గుర్తింపును తీసుకొస్తుంది. అలాగే వారి ఆలోచనలు ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వీరి జోక్యం చేసుకున్న ప్రతి చోటా తరచుగా సమస్యలు పరిష్కరించబడతాయి.

మేష రాశి..
ఈ రాశి వారు సహాయం అవసరం అయినప్పుడు అస్సలు స్పందించరు. పైగా పూర్తిగా చేతులెత్తేస్తారు. ఈ రాశి వారు ఇతరులకు ఇసుమంత సహాయం చేసి ఎంతో చేసినట్టు చెప్పుకుంటారు. వీరు చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా విషయంలో ఇతరుల పనికి సంబంధించిన దానిల అవనసరంగా జోక్యం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు ఈ రాశి వారు మంచి ఉద్దేశ్యాలను కలిగి ఉంటారు. నిజంగా సహాయం చేయాలనుకుంటారు. కానీ ఇతరులకు వారి సహాయం అవసరం లేదు అనే వాస్తవాన్ని ఎల్లప్పుడూ ముఖ్యమైనదిగా పరిగణించరు.



Click it and Unblock the Notifications
