Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కరోనా ఎఫెక్ట్ : 45 రోజులుగా ఇంటికెళ్లని నర్సు.. తన పెళ్లిని కూడా వాయిదా వేసుకుంది...
ఓ నర్సు, తన కళ్యాణాన్ని వాయిదా వేసుకుని మరి, కోవిద్-19 వార్డులో రోగులకు సేవలందించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆమె ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. ఇక మన భారతదేశంలో అయితే ఈ సమ్మర్ లో పెళ్లిళ్ల సీజన్ ఎక్కువగా ఉండేది. అయితే కోవిద్-19 దెబ్బకు కళ్యాణం వంటి కార్యక్రమాలతో సహా అనేక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.

అయితే కొంత మంది కరోనా వైరస్ ను లెక్కచేయకుండా దేశానికి సేవ చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఐఏఎస్ ఆఫీసర్ స్రుజన కరోనా నేపథ్యంలో వైజాగ్ నగరాన్ని కాపాడేందుకు తన చంటి బిడ్డను ఎత్తుకుని మరీ విధులకు హాజరైంది. తనకు ఇంకా ఐదు నెలల వరకు సెలవులు ఉన్నప్పటికీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో తన వంతు సాయం చేస్తానని చెప్పింది. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకున్న ఓ నర్సు, తన కళ్యాణాన్ని వాయిదా వేసుకుని మరి, కోవిద్-19 వార్డులో రోగులకు సేవలందించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆమె ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రెండు వారాల డ్యూటీ తర్వాత..
కేరళలోని కొట్టాయం ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌమ్యకు ముందుగా ఏప్రిల్ 8వ తేదీన త్రిక్కారిపూర్ కు చెందిన రేజీ నారియన్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. అయితే లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.

సెలవులు కూడా
అంతకుముందు ఆ నర్సు కరోనా వైరస్ నేపథ్యంలో క్వారంటైన్ వార్డులో విధులు నిర్వహించింది. ఆ తర్వాత ఆమె వివాహ కార్యక్రమం ఉందని ఉన్నతాధికారులకు చెప్పడంతో ఆమెకు రెండు వారాలు సెలవులు కూడా మంజూరయ్యాయి.

పెళ్లి చేసేందుకు సిద్ధమైన పెద్దలు..
అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అతి కొద్ది మంది సమక్షంలో ఈ నెల 26వ తేదీన ఆమెకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే ఆమె కరోనా వైరస్ వార్డులో విధులు నిర్వహించింది. ఆమెకు సెలవులు మంజూరైనప్పటికీ, ఆమె వాటిని వద్దనుకుని, పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకుంది.

తిరిగో కోవిద్-19లోకి..
కరోనా వైరస్ లాక్ డౌన్ సంక్షోభం తన వివాహ తేదీ గురించి నిర్ణయం తీసుకుంటామని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె మరో రెండు వారాల పాటు క్వారంటైన్ వార్డులో విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి.

తమ బంధువుల మాదిరిగా..
ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బంధువుల మాదిరిగా ఉన్నారని నర్సుగా పని చేస్తున్న సౌమ్య అంటున్నారు. అంతేకాదు అదే తనకు పెద్ద ఇల్లుగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకు తాను నెలన్నరరోజులుగా ఇంటికే వెళ్లలేదని చెప్పారు.

తనతో పాటు
తనతో పాటు మరో 24 మంది నర్సులు కూడా రెయిన్ బో ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. తాను కూడా ఈ నెల 20వ తేదీన తిరిగి విధుల్లోకి చేరనున్నట్లు చెప్పారు.



Click it and Unblock the Notifications