Latest Updates
-
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు..
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే!
హైదరాబాద్ బిర్యానీ అనగానే భోజనప్రియులకు టక్కున గుర్తొచ్చే పేర్లలో షా గౌస్ (Shah Ghouse) తప్పకుండా ఉంటుంది. ఆ పేరు వినగానే గుమగుమలాడే మసాలాల సువాసన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే మృదువైన చికెన్ ముక్కలు కళ్ల ముందు మెదలాడుతాయి. అలాంటి అద్భుతమైన షా గౌస్ రెస్టారెంట్ రుచిని, అదే స్థాయిలో మనం ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

షా గౌస్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
మ్యారినేషన్ కోసం
కల్లుప్పు- రుచికి సరిపడా
లవంగాలు - 4 లేదా 5
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
షాజీరా - 1 టీస్పూన్
యాలకుల పొడి - 1 టీస్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
ఫ్రైడ్ ఆనియన్స్ - పావు కప్పు
మెంతికూర ఆకులు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - పావు కప్పు
కుంకుమపువ్వు నానబెట్టిన నీళ్లు - పావు కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
చికెన్ - సరిపడా (పెద్ద ముక్కలు)
నిమ్మరసం - సగం బద్ద
చిక్కటి పెరుగు - 1 కప్పు
బియ్యం ఉడుకుతున్న నీళ్లు - అర కప్పు
బియ్యం ఉడికించడానికి కావలసినవి
-కల్లు ఉప్పు
-లవంగాలు
-షాజీరా
-దాల్చిన చెక్క
-యాలకుల పొడి
-కొత్తిమీర
-బాస్మతి బియ్యం.
లేయరింగ్ (దమ్) కోసం
-కుంకుమపువ్వు నానబెట్టిన నీళ్లు
షా గౌస్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం
-ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను వేయాలి. వీటికి కల్లుప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా జతచేయాలి. ఆ తర్వాత కారం, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టించాలి. మంచి సువాసన కోసం యాలకుల పొడి, మెంతికూర, కొత్తిమీర, కరకరలాడే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో సగం నిమ్మకాయ రసం, ఒక కప్పు పెరుగు, కమ్మటి నెయ్యి, కొద్దిగా కుంకుమపువ్వు నీళ్లు పోసి అన్నీ చికెన్ కు అద్దినట్లుగా బాగా కలుపుకోవాలి. చివరగా సగం కప్పు బియ్యం ఉడుకుతున్న నీళ్లు పోసి, కనీసం గంట పాటు చికెన్ ను పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మసాలాలన్నీ ముక్కకు పట్టి లోపలి వరకు జ్యూసీగా మారుతుంది.
-మరొక వెడల్పాటి గిన్నెలో ఎసరు కోసం నీళ్లు మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో కల్లుప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకుల పొడి, కొద్దిగా కొత్తిమీర వేయాలి. నీళ్లు బాగా మరుగుతున్న సమయంలో అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి. బియ్యం సుమారు 70 శాతం (పలుకు మీద) ఉడికే వరకు చూసుకుని, స్టవ్ ఆఫ్ చేసి నీటిని వంచేయాలి.
-ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న బిర్యానీ పాత్ర తీసుకుని, అడుగున మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక పొరలా సమానంగా పరచుకోవాలి. ఆ పైన సగం ఉడికిన బాస్మతి బియ్యాన్ని వేడివేడిగా ఉండగానే రెండో పొరలా వేయాలి. చివరగా మంచి రంగు, రాజసం ఉట్టిపడే సువాసన కోసం కుంకుమపువ్వు నానబెట్టిన నీళ్లను పైన చల్లుకోవాలి. గిన్నెపై మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా గోధుమపిండితో సీల్ చేయాలి. దీన్ని మొదట 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో, ఆ తర్వాత 15-20 నిమిషాల పాటు అత్యంత సన్నటి మంటపై దమ్ చేయాలి.
-అంతే మూత తీయగానే ఇల్లంతా ఘుమఘుమలాడిపోయే వేడివేడి షా గౌస్ స్టైల్ బిర్యానీ రెడీ. చల్లటి రైతాతో కలిపి వడ్డిస్తే, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా లాగించేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications