For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చేతి వేళ్ల మధ్య గ్యాప్ ఏమి సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హస్తసాముద్రికం ప్రకారం చేతిలోని వివిధ రేఖలు మన జీవితంలో జరగబోయే వివాహం, సంతానం, ఉద్యోగంతో పాటు అనేక విషయాలను తెలియజేస్తాయని మనందరికీ తెలిసిన విషయమే.

Palmistry : Know the meaning of space or gaps between the fingers

అయితే ప్రతి ఒక రేఖ భవిష్యత్తును సూచించదు. కానీ మన జీవితంలోని జరిగే అనేక సంఘటనల్లో చాలా మార్పులు తీసుకొస్తుంది.

Palmistry : Know the meaning of space or gaps between the fingers

అదే విధంగా చేతి వేళ్ల మధ్య గ్యాప్ మన జీవితంలోని అనేక సంఘటనలపై చాలా ప్రభావం చూపుతుంది. పూర్వ కాలంలో చేతి రేఖలు, వాటి పరిమాణం, వాటి మధ్య గ్యాప్, వాటి పొడవులను బట్టి భవిష్యత్తును తెలుసుకోవడానికి సాముద్రిక శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు.

Palmistry : Know the meaning of space or gaps between the fingers

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అయితే జన్మరాశిని బట్టి భవిష్యత్తును అంచనా వేశారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే మన అరచేతిలో ఏర్పడిన గుర్తులు, అదే విధంగా చేతి వేళ్ల మధ్య గ్యాప్ మన స్వభావం ఎలాంటిదో తెలిపేందుకు సహాయపడతాయి. అదెలాగో ఇప్పుడే చూసెయ్యండి మరి...

ఈ వేళ్ల మధ్య దూరం...

ఈ వేళ్ల మధ్య దూరం...

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, మన చేతుల్లోని చూపుడు వేలు, బొటనవేలు మరియు మధ్య వేళ్ల మధ్య గ్యాప్ కనిపిస్తే, అలాంటి వారు లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారని అర్థం. వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు.

మధ్య, ఉంగరపు వేలు...

మధ్య, ఉంగరపు వేలు...

ఒక మనిషి యొక్క ఉంగరపు వేలు మరియు మధ్య వేళలో చాలా వరకు ఖాళీ ఉండకూడదు. ఇలా ఉన్న వారందరికీ శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఈ రెండు వేళ్ల మధ్య ఏదైనా చిన్న గ్యాప్ ఉంటే, అలాంటి వారు ఎల్లప్పుడూ అజాగ్రత్తగా ఉంటారు. వీరు కేవలం తమ గురించి, తమ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. వీరిని ఒక రకంగా స్వార్థపరులని చెప్పొచ్చు.

ఉంగరపు, చిటికిన వేలు..

ఉంగరపు, చిటికిన వేలు..

ఒక మనిషిలోని ఉంగరపు వేలు మరియు చిటికిన వేల మధ్య దూరం ఉంటే అది చెడు ఫలితాలను సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు. వారు తమ పనిని పూర్తి చేసేందుకు ఎంత దూరం అయినా వెళ్లొచ్చు. కానీ అలాంటి వారు తమ కుటుంబానికి గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

వేళ్ల మధ్య అంతరం..

వేళ్ల మధ్య అంతరం..

వేళ్ల మధ్య అంతరం లేని వారు చాలా మంది ఉంటారు. ఇలా ఉండే వ్యక్తులు ఇతరుల జీవితంలో జోక్యం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే ప్రక్రుతిని ఎక్కువగా ప్రేమిస్తారు. మరోవైపు అన్ని వేళ్ల మధ్య అంతరం ఉన్నవారికి శక్తి అనేది తక్కువగా ఉంటుంది. కానీ వీరు సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు.

ఒత్తిడికి సంబంధం..

ఒత్తిడికి సంబంధం..

మహిళల్లో చేతుల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే వారు అసంఖ్యాక ఆలోచనలకు సంబంధించనదని అని, అదే సమయంలో మగవారిలో అయితే కుటుంబం మరియు వారి జీవితంలో ఒత్తిడికి సంబంధించినది.

English summary

Palmistry : Know the meaning of space or gaps between the fingers

The spaces between the fingers give away clues to the character. Learn what each of these gaps mean.
Desktop Bottom Promotion