Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
Planets Transit in April 2022 :ఏప్రిల్ లో ఏడు గ్రహాల రవాణాతో ఈ రాశులకు శుభ ఫలితాలు...!
ఏప్రిల్ లో ఏడు గ్రహాల రవాణాతో ఈ రాశులకు శుభ ఫలితాలు కలగనున్నాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు మానవ జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ఏకంగా ఏడు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి.

వీటి ప్రభావం రాశిచక్రాలపై కచ్చితంగా పడుతుంది. కొన్ని రాశుల వారికి ఆర్థిక, మానసిక సమస్యలు ఎదురుకావొచ్చు. మరి కొందరికి శుభ ఫలితాలు రావొచ్చు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ముందుగా 7వ తేదీన కుజుడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఆ తర్వాతి రోజున అంటే ఏప్రిల్ 8న బుధుడు మేషంలోకి రవాణా చేయనున్నాడు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 12 నుండి రాహు-కేతువులు తిరోగమనంలో ప్రయాణం చేయనున్నారు. రాహావు మేష రాశిలోకి సంచారం చేయనుండగా.. కేతువు తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 13న గురుడు మీనంలోకి.. ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు మేష రాశిలో రవాణా చేయనున్నారు.

ఇదే నెలలో 27వ తేదీన బుధుడు వృషభంలోకి ప్రవేశించనున్నాడు. చివరగా ఏప్రిల్ నెలలో 29వ తేదీన కుంభరాశిలోకి శని భగవానుడు సంచారం చేయనున్నాడు. ఈ ఏడు గ్రహాల రవాణా కారణంగా ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయట. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

స్థానాలు మారే గ్రహాలివే..
2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ముందుగా 7వ తేదీన కుజుడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాతి రోజున అంటే ఏప్రిల్ 8న బుధుడు మేషంలోకి రవాణా చేయనున్నాడు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 12 నుండి రాహు-కేతువులు తిరోగమనంలో ప్రయాణం చేయనున్నారు. రాహావు మేష రాశిలోకి సంచారం చేయనుండగా.. కేతువు తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 13న గురుడు మీనంలోకి.. ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు మేష రాశిలో రవాణా చేయనున్నారు. ఇదే నెలలో 27వ తేదీన బుధుడు వృషభంలోకి ప్రవేశించనున్నాడు. చివరగా ఏప్రిల్ నెలలో 29వ తేదీన కుంభరాశిలోకి శని భగవానుడు సంచారం చేయనున్నాడు.

రాహు-కేతుల తిరోగమనం..
దాదాపు 18 నెలల తర్వాత రాహువు మేషంలోకి.. కేతువు తుల రాశిలోకి సంచారం చేయనున్నారు. ఇలా ఒకే నెలలో ఏడు గ్రహాల సంచారం.. రెండు గ్రహాల తిరోగమనం వల్ల ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ కాలంలో వ్యవసాయ రంగంలో పని చేసే వారు ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు లాభదాయకమైన ఫలితాలొస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి వారికి గ్రహాల మార్పు కారణంగా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. శని రాశి స్థానం మారడం వల్ల మిధున రాశి వారికి శని బాధ నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగ్గా ఉంటుంది. అవివాహితులకు ఏర్పడే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

కన్య రాశి..
ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏడు గ్రహాల స్థానచలనం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న బదిలీ రావొచ్చు. మీకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో శని రాశి మార్పు వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. మకరరాశిని శని భగవానుడు వదిలి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల, ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరగువుతుంది. ఇదే నెలలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. అయితే ఈ కాలంలో మీరు కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి.
2022 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ముందుగా 7వ తేదీన కుజుడు కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాతి రోజున అంటే ఏప్రిల్ 8న బుధుడు మేషంలోకి రవాణా చేయనున్నాడు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 12 నుండి రాహు-కేతువులు తిరోగమనంలో ప్రయాణం చేయనున్నారు. రాహావు మేష రాశిలోకి సంచారం చేయనుండగా.. కేతువు తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 13న గురుడు మీనంలోకి.. ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు మేష రాశిలో రవాణా చేయనున్నారు. ఇదే నెలలో 27వ తేదీన బుధుడు వృషభంలోకి ప్రవేశించనున్నాడు. చివరగా ఏప్రిల్ నెలలో 29వ తేదీన కుంభరాశిలోకి శని భగవానుడు సంచారం చేయనున్నాడు.



Click it and Unblock the Notifications
