For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురిటి నొప్పుల సమయంలో పూనకం వచ్చి గర్భం మాయం అయిందట...!

తాజాగా తెలంగాణలో ఓ విచిత్రం జరిగింది. ఓ నిండు గర్భిణి రెండు, మూడు రోజుల్లో డెలివరీ కావాల్సిన సమయంలో ఆమెకు అర్థరాత్రి వేళ అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి.

|

ఓ నిండు గర్భిణి మరికొన్ని గంటట్టలో డెలివరీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు అర్ధరాత్రి అకస్మాత్తుగా పురుటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని ఆసుప్రతికి తీసుకెళ్లారు.

Pregnant Woman suffers miscarriage in telangana

అయితే అక్కడ డాక్టర్ వచ్చేలోపే ఆమెకు ఎక్కడ లేని పూనకం వచ్చిందట. అంతే ఆ తర్వాత నొప్పులు ఆగిపోయాయట. అంతే తెల్లారేసరికి ఆమె గర్భం మాయమైందట. మనలో చాలా మందికి ఇది వినడానికి వింతగా అనిపించొచ్చు.

Pregnant Woman suffers miscarriage in telangana

అయితే ఇది అక్షరాల నిజమని అంటున్నారు తెలంగాణ వాసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నొప్పులు ఆగిపోవడంతో..

నొప్పులు ఆగిపోవడంతో..

ఆ గర్భిణికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు ఆగిపోవడంతో.. వారి కుటుంబ సభ్యులు ఆమెను అర్ధరాత్రి వేళ ఇంటికి తీసుకెళ్లారట. తెల్లారాక తీసుకువస్తామని చెప్పి తిరుగుబాట పట్టారట.

నమ్మశక్యంగా లేనప్పటికీ..

నమ్మశక్యంగా లేనప్పటికీ..

అయితే ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ.. తెల్లారే సరికి అక్కడ ఓ విచిత్రం చోటు చేసుకుంది. తెల్లారేసరికి ఆమె గర్భం మాయమైందట. దీంతో ఆమెను డెలివరీకి కూడా తీసుకురాలేదట.

జోగులాంబ గద్వాల జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో..

ఇదంతా తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం పెద్దపోతుల పాడు గ్రామంలో తాజాగా చోటు చేసుకుందట. ఈ విషయం గురించి తెలుసుకున్న వైద్యులు అసలేం జరిగిందో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

చాలా కాలం తర్వాత..

చాలా కాలం తర్వాత..

మంజుల అనే మహిళ వెంకటేష్ అనే వ్యక్తిని ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకుందట. పెళ్లి అయిన చాలా కాలం తర్వాత ఆమె గర్భం దాల్చడంతో తన పురుడు కోసం పుట్టింటికి వెళ్లిందట.

దేవుడు పునాడని..!

దేవుడు పునాడని..!

ఆరోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆమెకు నొప్పులు మొదలవడంతో ఆమెను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారట. అయితే అక్కడ ఆమె ఊహించని విధంగా తనకు దేవుడు పూనాడని గట్టిగా కేకలు వేసి వైద్యపరీక్షలకు నిరాకరించిందని అక్కడి వారు చెబుతున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారు.

ఉదయం లేచి చూస్తే..

ఉదయం లేచి చూస్తే..

అయితే ఆమె ఉదయం లేచి చూసేసరికి.. గర్భం మాయమైందట. ఈ విషయాన్ని అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించి మరీ ఆమెకు గర్భం లేదని తేల్చారట. దీంతో ఆమెను మరోసారి వెంటనే ఆసుపత్రికి తరలించారట. అక్కడ ఏడు నెలల పాటు మంజులకు తానే పరీక్షించానని అక్కడి డాక్టర్ చెప్పారు.

గర్భస్రావం అయ్యుండొచ్చు...

గర్భస్రావం అయ్యుండొచ్చు...

ఇందుకు సంబంధించి డాక్టర్ మాట్లాడుతూ ఆమెకు నెల క్రితం గర్భస్రావం అయి ఉండొచ్చని, ఆ విషయాన్ని దాచేందుకు మహిళ అలా నటిస్తుండవచ్చని డాక్టర్ అభిప్రాయపడ్డారు.

మతిస్థిమితం కోల్పోయిందని..

మతిస్థిమితం కోల్పోయిందని..

అయితే ఆమె అప్పటికే మతిస్థిమితం కోల్పోయిందని, అందుకే అలా మాట్లాడుతోందని, ఆమెకు సైకలాజికల్ ట్రీట్ మెంట్ చేయించాలని డాక్టర్ సూచించారు.

English summary

Pregnant Woman suffers miscarriage in telangana

Here we talking about pregnant woman suffers miscarriage in telangana. Read on
Story first published:Tuesday, May 5, 2020, 14:14 [IST]
Desktop Bottom Promotion