Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
రాహు, కేతు సంచారం 2020 : 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!
రాహు, కేతువుల సంచారం వల్ల ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు, కేతు గ్రహాల వల్ల ఈ విశ్వంలో అనేక మార్పులు జరుగుతాయి. మరి కొద్దిరోజుల్లో రాహు, కేతువు గ్రహాలు తమ స్థానాలు మారబోతున్నాయి. వీటిలో కేతు గ్రహానికి ఎలాంటి అస్థిత్వం అనేది ఉండదు. అందుకే దీనిని ''షాడో గ్రహం'' అని కూడా అంటారు.

2020 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 23వ తేదీ ఉదయం 07:38 గంటలకు ఈ మార్పు జరగనుంది. రాహువు, కేతు గ్రహాలు మళ్లీ రెండేళ్ల తర్వాత అంటే 2022 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10:36 గంటలకు మారనున్నాయి. అయితే ఈ రాహువు, కేతు గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే వీటిలో రాహువు, వృషభరాశిలోకి.. కేతు గ్రహం వృశ్చికరాశిలోకి సంచరించడం వల్ల ద్వాదశ రాశులకు లాభదాయకంగా ఉంటుందా? లేదా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
2020 ఏడాదిలో రాహు, కేతు సంచారం వల్ల మేష రాశి వారికి ఎలాంటి ప్రభావాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిరుద్యోగులు వారి లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు రాహువు రెండో స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సంబంధిత వ్యయం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, మీరు చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులుండవు. అయితే మీరు కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

వృషభరాశి..
రాహువు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కేతు సంచారం వల్ల మీ జీవితాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి. కెరీర్ మరియు వ్యాపార పరంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ కుటుంబంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. కానీ మీ వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది.

మిధున రాశి..
రాహు, కేతు గ్రహాలు 12వ స్థానం గుండా సంచరించడం వల్ల మిధునరాశి వారికి మానసిక శాంతి మరియు సంబంధంలో సామరస్యానికి కొంత ఇబ్బందిగా మారుతుంది. మీకు పని విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

కర్కాటక రాశి..
రాహువు 11వ స్థానంలో.. కేతువు ఐదో స్థానం గుండా ప్రయాణించడం వల్ల కర్కాటక రాశి వారికి పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు. అయితే మీకు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు కొత్త సవాళ్లను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ పనితీరును మెరుగుపర్చుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మీకు ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యక్తిగతంగా మీరు ఉల్లాసమైన మానసిక స్థితిలో ఉంటారు.

సింహ రాశి..
రాహువు పదో స్థానంలో.. కేతువు నాలుగో స్థానంలో ప్రయాణించే సమయంలో ఉద్యోగులు, వ్యాపారులకు కొంత సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు మరింత బాధ్యతగా పని చేయాలి. ఆర్థిక పరంగా మెరుగయ్యేందుకు మీరు అదనపు ప్రయత్నాలు చేయాలి. అయితే మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇక్కడ బాధపెడతాయి. అయితే మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మీరు ఆరోగ్య పరిస్థితిని ఆనందిస్తారు. మొత్తంగా మీరు సానుకూలంగా ఉంటారు.

కన్య రాశి..
రాహువు 9వ స్థానంలో.. కేతువు మూడో స్థానంలో సంచారం సమయంలో కన్య రాశి వారికి కొన్ని కొత్త సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే మీరు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. మీకు ఆదాయ పరంగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

తుల రాశి..
రాహువు ఎనిమిదో స్థానంలో, కేతువు రెండో స్థానంలో సంచరించేటప్పుడు తుల రాశి వారికి కొన్ని సందర్భాల్లో అసౌకర్యంగా ఉంటుంది. ఉద్యోగులకు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు మంచి లాభాదాయక ఒప్పందాలు రావాలంటే, పాత పరిచయాలను పునరుద్ధరించాలి. వ్యక్తిగతంగా కొన్ని బహిరంగ కార్యకలాపాల కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాలి.

వృశ్చికరాశి..
రాహువు ఏడో స్థానంలో, కేతువు వృశ్చికరాశిలోకి సంచరించే సమయంలో మీకు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఈరోజు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. మీరు పని సంబంధిత కార్యకలాపాలతో బిజీగా ఉండి, మీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించలేకపోతారు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఆనందంగా ఉంటుంది. అయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చాలా మందితో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకుంటారు.

ధనస్సు రాశి..
రాహువు ఆరో స్థానంలో.. కేతువు 12వ స్థానంలో సంచరించే సమయంలో ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే వ్యాపారులు తమ రంగంలో పోటీ గురించి కొంత ఆందోళన చెందుతారు. భవిష్యత్తులో మీకు ప్రోత్సాహకరమైన అవకాశాలు రావొచ్చు. ఆర్థిక పరంగా మెరుగయ్యేందుకు మీరు చాలా కష్టపడాలి. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి సమయంలో వైద్యుల సూచనలు పాటించాలి.

మకర రాశి..
రాహువు ఐదో స్థానంలో.. కేతువు పదకొండో స్థానంలోకి వెళ్లే సమయంలో ఆ గ్రహాల ప్రభావాలు మకరరాశిపై ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ సమయంలో మీరు ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయంలో మీకు బలంగా ఉంటుంది. మీరు, మీ కుటుంబంతో ఆహ్లాదకరమైన మరియు ఆనందకరమైన సమయం గడపాలి.

కుంభ రాశి..
రాహువు నాలుగో స్థానంలో.. కేతు గ్రహాలు పదో స్థానంలో సంచరించే సమయంలో కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అకస్మాత్తుగా మార్పులొస్తాయి. మీ వ్యాపారంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు మాత్రం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం బలంగా ఉంటుంది. మీరు చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు. కుటుంబంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య పరంగా అంతా సాధారణంగా ఉంటుంది.

మీన రాశి..
రాహువు మూడో స్థానంలో.. కేతు గ్రహం తొమ్మిదో స్థానం గుండా కదులుతుంది. ఈ సమయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సమర్థవంతంగా పనిని చేయడంలో సఫలమవుతారు. మీరు రోటిన్ మరియు కుటుంబ సంబంధిత ఖర్చులను హాయిగా నిర్వహించగలరు. రాహు, కేతు గ్రహాల సంచార సమయంలో మీకు పెద్ద ఖర్చులు అనేవి ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా మంచి స్థితిలో ఉంటారు.



Click it and Unblock the Notifications











