Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
సోషల్ మీడియాలో వైరల్ అయిన రాణు రాగం..
ఒక్కపాటతో వైరల్ అయిన రాణు అనే మహిళ.. అచ్చం లతామంగేష్కర్ లాగే ఆమె పాడుతోంది. బెంగాలీకి చెందిన ఈ గానకోకిల గురించి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో బేబి పాడిన పాట ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెను ఇంటికి పిలిచి మరీ బహుమతులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. సంగీత దర్శకులు కోఠి సైతం ఆమెకు సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చిన విషయం విదితమే. అదే తరహాలో ఇటీవల బెంగాల్ రాష్ట్రంలోని రాణా ఘాట్ అనే రైల్వేస్టేషన్లో పనిచేసే రాణు అనే మహిళ సరాదాగా పాడిన ఓ పాట వైరల్ అయ్యింది. "యే ప్యార్ కా నగ్మా హై" అంటూ ఆమె పాడిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం లతామంగేష్కర్ పాడినట్టే పాడి అందరినీ మైమరిపిస్తోంది. దీంతో చాలా మంది సోషల్ మీడియాలో ఆమె గురించి వెతకటం ప్రారంభించారు. ఇంతకీ ఆమె ఎవరు.. ఎక్కడ ఉంటారు.. ఏమి చేస్తుంటారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అది పశ్చిమ బెంగాల్ లోని ఓ రైల్వేస్టేషన్.. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా గడుపుతుంటారు. అందరిలాగే ఆమె కూడా ఆరోజు తన పనిలో నిమగ్నమయ్యింది. రైల్వేస్టేషన్లో పని చేసే ఆ మహిళ అప్పుడే పని ముగించుకుని సరాదాగా ఓ పాట పాడింది. "యే ప్యార్ కా నగ్మా హై" అంటూ పల్లవి అందుకోగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. తొలుత లతా మంగేష్కరే అక్కడికొచ్చిందేమోనని అనుకున్నారు. కాస్త తేరుకుని చూస్తే రాణు మొండల్ ఓ సాధారణ మహిళ అచ్చం గానకోకిలలా పాడుతుంటే వారంతా పరవశించిపోయారు. అంతే వెంటనే ఆమె పాడిన పాటను వీడియోలో రికార్డు చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అది అంతగా వైరల్ అవుతుందని వారు కూడా ఊహించలేదు. కానీ అది కాస్త ఎవ్వరూ ఊహించనంతగా వైరల్ అయ్యింది. అంతే ఆమె రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారిపోయారు. చాలా మంది ఆమె ఆచూకీని వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు ఆమె చిరునామా తెలుసుకున్న మీడియా వారు ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సినిమా వాళ్లు సైతం ఆమెకు అవకాశాలిస్తామని చెబుతున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇప్పటికే మీడియా ప్రతినిధులు రాణు దీదీతో ప్రత్యేక ఇంటర్వ్యూ సైతం తీసుకున్నారు. అంతేకాదు ఆమెతో సెల్ఫీలు దిగడానికి తెగ ఉత్సాహం చూపారు. ఇప్పటికీ సెల్ఫీల కోసం చాలామంది వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాణు మాట్లాడుతూ తాను సరాదాగా పాడిన ఆ పాట అంతలా వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదన్నారు. ఇప్పటికీ నాకు ఇంతలా పబ్లిసిటీ వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఆ వీడియోను అప్ లోడ్ చేసిన టీమ్ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్న చందంగా ఎవరి లోపల ఏ టాలెంట్ ఉంటుందో తెలుసుకోవడం కష్టమే. పబ్లిసిటీ కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నా.. వారికి రాని పబ్లిసిటీ రాణు, బేబీ లాంటి వారికి అమాంతం పెరిగిపోవడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆమె గొంతు అచ్చం కోకిల పాట అంత మధురంగా ఉండటంతో ఆమెకు అనుకోకుండా అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇక త్వరలోనే ఈమెకు సినిమాలో పాడే ఛాన్సులు రానున్నాయి. సో తొందర్లోనే ఆమె సినిమాలలో పాటలు పాడి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.



Click it and Unblock the Notifications
