Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
Rashi Parivartan 2021 : మార్చిలో మూడు గ్రహాల మార్పుతో ఈ రాశుల వారికి సానుకూల ఫలితాలు...!
మార్చి మాసంలో మూడు గ్రహాల మార్పుతో ఏ రాశుల వారికి అనుకూలమో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు మానవ జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. నవ గ్రహాలలోని మూడు గ్రహాలు మార్చి మాసంలో తమ స్థానాల నుండి మరో స్థానంలోకి అడుగు పెట్టబోతున్నాయి.

ఈ సందర్భంగా రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అందులో సూర్యుడు ప్రతి నెలా ఒకరాశి నుండి మరొక రాశిలోకి రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మార్చి మాసంలో సూర్యుడు కుంభం నుండి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.ఈ నేపథ్యంలో మీన రాశి వారికి మాల మాసం మొదలవుతుంది. దీంతో పాటు ఇదే మాసంలో సూర్యుడితో పాటు శుక్రుడు, బుధుడు కూడా తమ రాశి నుండి మరో రాశిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మూడు గ్రహాల రవాణా కారణంగా ప్రతి ఒక్క రాశిచక్రంపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల మార్పు వల్ల సానుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్లో ముందుకు సాగేందుకు ఒక గొప్ప అవకాశాన్ని పొందొచ్చు. మీ లైఫ్ లో ఆనందం ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే మీరు ఈ కాలంలో ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..
మార్చి మాసంలో మూడు గ్రహాల స్థానచలనం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులైన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసికంగా కలత చెందే అవకాశం ఉంది. స్పష్టత లేకుండా వాదనకు దిగడం మానుకోవాలి. లేదంటే మీ సమయం కచ్చితంగా వృథా అవుతుంది. ఈ కాలంలో మీరు సహనంతో ఉండాలి.

మిధున రాశి..
మూడు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఆగిపోయిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది సాధిస్తారు. మీకు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. మీ కుటుంబానికి శాంతి, సామరస్యం పెరుగుతాయి. ఈ గ్రహాల మార్పు మీ ఆర్థిక పరిస్థితిని బలంగా మారుస్తుంది. మీరు రుణాల నుండి బయటపడతారు. వ్యాపారులకు కూడా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల స్థానచలనం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. మీ ఇంటి వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది. సమాజంలో మీ తల్లి పట్ల గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది.

సింహ రాశి..
మార్చి మాసంలో మూడు గ్రహాల కదలిక వల్ల ఈ రాశి వారికి పనికి సంబంధించిన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ కొత్త జీవితం గురించి మీ భాగస్వామితో చర్చించవచ్చు. అయితే మీరు చాలా సందర్భాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కన్య రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల మార్పు వల్ల చాలా విషయాల్లో కలిసి వస్తుంది. మీ పెండింగులో ఉండే పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు చాలా జాగ్రత్త వహించాలి.

తుల రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల మార్పు వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లికాని వారికీ ఈ సమయంలో మంచి వివాహ ప్రతిపాదన ఉండొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ కెరీర్లో మంచి అవకాశాలను పొందొచ్చు. మొత్తం మీద, ఈ నెల మీకు మంచి ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల రవాణా వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు వాటిని పూర్తిగా వినియోగించుకోండి.. మీ కుటుంబసభ్యులతో ఐక్యత ఉండే వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల మార్పు వల్ల ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు మానసికంగా ఉద్రిక్తత పెరుగుతుంది. మీరు ఆకస్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

మకర రాశి..
ఈ రాశి వారు మూడు గ్రహాల కదలిక వల్ల చాలా విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఈ సమయంలో మీరు అవనసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. మీ కెరీర్ పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది.

కుంభ రాశి..
ఈ సమయం కుంభ రాశి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులలో ఐక్యతా భావం ఉంటుంది. ఈ సమయం ఉపాధి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి.

మీన రాశి..
మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇవి స్వల్ప కాలం మాత్రమే ఉంటాయి. మీరు ఈ నెలలో ఒక శుభవార్తను పొందొచ్చు. మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయాన్ని ఈ సమయంలో పొందొచ్చు.



Click it and Unblock the Notifications