Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
అక్కినేని వారి కోడలు సమంత తనకు పుట్టబోయే బేబీ డేట్, టైమ్ ఫిక్స్ చేసినట్లు చెప్పేసింది..!
అక్కినేని వారి అందాల కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు ఇటీవల ఓ ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ ఆలస్యం కావడంతో తను ఇన్ స్టాగ్రాములో వచ్చి సందడి చేసింది
మన దేశంలో ఇంటర్నెట్ సేవలు పెరిగిపోయినప్పటి నుండి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వారి అభిమానుల కోసం సమయాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని మరీ, సోషల్ మీడియాకు టైమ్ కేటాయిస్తున్నారు. అంతేకాదు చాలాసేపు లైవ్ లో వచ్చి మాట్లాడుతున్నారు.

ఇలా అభిమానులతో రోజురోజుకు ఇంటరాక్షన్ పెంచుకుంటున్నారు. వారి అభిప్రాయాలను, అలవాట్లను, అభిరుచులను పంచుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తమ కొంటె ప్రశ్నలతో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా అనేక మంది వారి పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలా అడిగి చీవాట్లు తిన్నవారు ఎందరో ఉన్నారు. తాజాగా అందాల భామ సమంతకు ఇటీవల ఓ ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని తనకు పుట్టబోయే బిడ్డ గురించి నేరుగా ఆమెను అడిగాడు. ఇందుకు స్పందించిన సమంత ఇలా సమాధానం ఇచ్చింది...

సమంత గర్భంపై పుకార్లు..
సమంత గర్భం గురించి గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తనకు నాగచైతన్యతో రెండేళ్ల క్రితమే పెళ్లి అయినప్పటి నుండి ఇలాంటి ఊహాగానాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. దీనిపై ఆమె కొన్ని నెలల క్రితం ట్విట్టర్లో కొందరిని ఉద్దేశించి ఉల్లాసంగా ఎగతాళి కూడా చేసింది. అయినా కూడా ఆమెకు దాని చుట్టూ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా మరోసారి..
అక్కినేని వారి అందాల కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు ఇటీవల ఓ ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ ఆలస్యం కావడంతో తను ఇన్ స్టాగ్రాములో వచ్చి సందడి చేసింది. తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించింది.
మీకు పిల్లలు పుడతారు?
ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లో వచ్చిన సమంత అప్పటివరకు అభిమానులందరూ నటన గురించి, ఇతర విషయాల గురించి అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓపికగా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అయితే అకస్మాత్తుగా ఓ అభిమాని మీకు పిల్లలు ఎప్పుడు పుడతారని అడిగాడు. దీంతో ఆమె కొంత చిరాకుగా ఫీలయ్యింది. అయినా కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేసింది.

2022, ఆగస్టు 7వ తేదీ..
‘నా శరీరం యొక్క నా అంతర్గత విషయాల గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ నేను సమాధానం చెబుతున్నాను. నేను 2022 ఆగస్టు 7వ తేదీ ఉదయం 7 గంటలకు నా బిడ్డకు జన్మనివ్వబోతున్నాను‘ అని సమాధానం ఇచ్చింది. అంతవరకు తాను నటనపై శ్రద్ధ చూపనున్నట్లు కూడా స్పష్టం చేసింది. ‘నేను ఇంకా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను‘ అని తెలిపింది.

గర్భధారణ ప్రణాళికల గురించి..
గర్భధారణ ప్రణాళికల గురించి సమంతా గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నేను నా బిడ్డకు ఎప్పుడు జన్మనివ్వాల్లో ఒక తేదీని అనుకుంటున్నాను. అది నిర్ణయించుకున్నాక, దాని ప్రకారం ఆ తేదీ, ఆ సమయంలో నా బిడ్డ పుడుతుంది. కానీ మనకు ఎప్పుడు బిడ్డ పుట్టాలో కాలమే నిర్ణయిస్తుంది‘ అని కూడా చెప్పింది. సమంత, నాగచైతన్యకు 2017లో వివాహం అయిన సంగతి అందరికీ తెలిసిందే.

అందం గురించి...
తను అందంగా ఉండటానికి గల రహస్యాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. చాలా మంది అభిమానులు తన సౌందర్య రహస్యానికి సంబంధించిన ప్రశ్నలే అడిగారు. వీటికి కూడా ఆమె సమాధానం ఇచ్చింది.
గతంలోనూ కొందరు సెలబ్రిటీలకు..
సమంతకు మాత్రమే కాకుండా ఇతర సెలబ్రిటీలకు కూడా గతంలో ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. టాలీవుడ్ మెగాస్టార్ కోడలు ఉపాసనకు కూడా ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఆమె ఆ సందర్భంగా చికాకుగా ఫీలయ్యింది. అలాగే ప్రియాంక చోప్రాకు కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. దీపికా పదుకొనే అయితే సోషల్ మీడియాలో ఓ చిన్నపాపను ఫొటో షేర్ చేస్తే, దీపికా తల్లి కాబోతున్నావా వంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. దీనికి దీపికా కూడా సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉండిపోయింది.



Click it and Unblock the Notifications
