For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 29న శని మకరంలోకి... కరోనా ప్రభావం తగ్గి.. కొన్ని రాశుల వారికి అదృష్టం...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2020, సెప్టెంబర్ 29వ తేదీన శని గ్రహం మకరరాశిలోకి ప్రవేశించబోతోంది. ఇది తన సొంత రాశిలోకి వెళ్లడం వల్ల రాహువు, కేతువులు కూడా తమ స్థానాలను మారబోతున్నాయి.

ఇలా గ్రహాలు తమ స్థానాల నుండి కదలికలు ప్రారంభించినప్పుడు, రాశిచక్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ సమయంలో కొన్ని రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేవిధంగా మరికొన్ని రాశులపై సానుకూల ప్రభావం ఉంటుంది.

అంతేకాదు శని మకరంలోకి ప్రవేశించే సమయంలో, దాని ప్రభావం కరోనా మహమ్మారిపై కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కరోనా ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ నెలలో ఆరు గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్నాయి. ఈ నెలఖారున శని గ్రహం కూడా తన సొంత స్థానం అయిన మకరరాశిలోకి 18 నెలల తర్వాత అడుగు పెడుతున్న సందర్భంలో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య వంటి విషయాల్లో చాలా ఆనందం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏయే రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో చూసేయ్యండి.

వాస్తుశాస్త్రం ప్రకారం ఆ వైపునే తిరిగి పడుకోవాలి... ఈ వైపునే తిరిగి నిద్ర లేవాలి...!

మేషరాశి..

మేషరాశి..

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి చర్మ వ్యాధి వంటి సమస్యలు ఏర్పడొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీకు ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఓ పని విషయంలో భయపడతారు. అయితే మీ తల్లిదండ్రుల నుండి మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుంది. మీరు వారితో మతపరమైన ప్రదేశానికి వెళ్లొచ్చు.

పరిహారం : శనివారం రోజున రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి కార్యాలయంలో ఎంత ఎక్కువ పని చేసినప్పటికీ ఫలితం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీరు సహనంతో పని చేయాలి. ప్రమోషన్ వంటి వాటి కోసం వేచి ఉండాలి. అలాగే సోమరితనం నుండి దూరంగా ఉండాలి. లేకపోతే కొన్ని ముఖ్యమైన పనులు పెండింగులో పడిపోతాయి.

పరిహారం : శనివారం నాడు మంచి నాణ్యత కలిగిన నీలమణి రత్నాన్ని ధరించి శని మంత్రాన్ని జపించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో మిధున రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడులన్నీ తొలగిపోతాయి. మీరు నూతన వాహనం కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంది. శని సంచారం వల్ల మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీకు మంచి వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది.

పరిహారం : శనివారం రోజున శనిగ్రహాన్ని పూజించండి.

వాస్తుశాస్త్రం ప్రకారం ఈ వస్తువులను ఇతరులకు ఇస్తే మీరు కోరి కోరి దురదృష్టాన్ని తెచ్చుకున్నట్టే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. శని మకరంలోకి ప్రవేశించే సమయంలో కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీరు జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అనారోగ్యంతో ఉండే వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు మునుపటి కంటే ఎక్కువ ఏకాగ్రతతో అధ్యయనాలను పూర్తి చేస్తారు.

పరిహారం : ప్రతి శనివారం ఆవాలు నూనెను ఓ మట్టికుండలో నింపి, మీ ముఖాన్ని చూసిన తర్వాత, ఆ కుండను దానం చేయాలి. అలాగే వీలైనంత మేరకు పేదలకు దానం చేయాలి.

సింహరాశి..

సింహరాశి..

గ్రహాల కదలిక సమయంలో ఈ రాశి వారు చాలా బిజీగా ఉటారు. మీరు భూమి వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే, చాలా తెలివిగా పని చేయాలి. లేకపోతే మీరు మోసపోవచ్చు. మరోవైపు ఉద్యోగులు సంయమనంతో వ్యవహరిస్తే, మీకు పదోన్నతి కూడా లభిస్తుంది. మీకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి కొంత ఇబ్బంది ఉండొచ్చు.

పరిహారం : శనివారం రోజున ఏదైనా వస్తువులను దానం చేయండి మరియు రావి చెట్టు కింద సాయంత్రం వేళ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

కన్య రాశి..

కన్య రాశి..

గ్రహాల కదలిక వల్ల ఈ రాశి వారికి శుభప్రదమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారులకు చాలా మెరుగ్గా ఉంటుంది. మీరు మీ పాత పనులన్నింటినీ ప్రారంభించే అవకాశం దక్కుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ సంబంధంలో పరస్పర సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. మీరు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

పరిహారం : శనివారం రోజున ఆవ నూనె దీపం వెలిగించి, అందులో ఐదు ధాన్యాలను ఉంచి పూజ చేయాలి.

అలాంటి సమయాల్లో మీకు భయమేస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్దగా ఆలోచించకూడదు. ఈ సెప్టెంబర్ నెల తర్వాత మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. చిన్నప్రయాణాల వల్ల ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

పరిహారం : ఉత్తమ నాణ్యత కలిగి నీలమణి రత్నాన్ని ధరించాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

గ్రహాల కదలిక వల్ల ఈ రాశి వారికి అక్టోబరు నెలలో కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలను నిర్వహించడానికి అవకాశముంటుంది. మీరు మీ ఆస్తిని పొందుతారు. అంతేకాదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా పొందుతారు. మీరు మొదలుపెట్టిన పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా, వాటిని పూర్తి చేసి తీరుతారు. మీ పిల్లల నుండి కూడా మీకు శుభవార్తలు వినిపిస్తాయి.

పరిహారం : శనివారం చీమలకు పిండిని వేసి, ఏదైనా మత ప్రదేశాన్ని శుభ్రపరిచే పనిని చేయండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి అకస్మాత్తుగా ధన లాభం వస్తుంది. ఆస్తికి సంబంధించిన విషయాలలో మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీ బంధువుల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. మీ ప్రయాణం ప్రయోజనకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటుంది. మీ కెరీర్ మరియు వైవాహిక జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ స్నేహితుల నుండి కూడా ప్రయోజనం పొందుతారు.

పరిహారం : శనివారం రోజున నల్లదారం ధరించండి. అలాగే ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది.

మకర రాశి..

మకర రాశి..

తన సొంత రాశిలోకి శని గ్రహం అడుగు పెడుతున్నందున మకర రాశి వారికి మానసిక ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రేరణ లభిస్తుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల మెరుగుదలతో, మీరు విదేశాలకు వెళ్లాలనే మీ కలను కూడా నెరవేర్చగలుగుతారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : శనివారం రోజున తెల్లని వస్త్రాలను ధరించండి. మీ చేయి లేదా మెడలో కుట్టిన నల్లని వస్త్రాలను ధరించాలి. శని దేవుడిని ఆరాధించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి గ్రహాల కదలిక సమయంలో సానుకూలంగా ఉంటుంది. మీరు చాలా సంబంధాలకు దగ్గరవుతాయి. మీ పనిలో మీ సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారం విషయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు, సరైన ఆలోచనతో ముందుకు సాగండి.

పరిహారం : శనివారం రోజున క్రమం తప్పకుండా శనిదేవుని యొక్క మంత్రాలను జపించండి. అలాగే వికలాంగులకు ఆహారాన్ని అందించండి.

మీన రాశి..

మీన రాశి..

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు అనేక కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. మీరు ముందుకు సాగేందుకు అవకాశం లభిస్తుంది. మీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య పరంగా మంచిగానే ఉంటుంది. ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మీకు సహాయం కూడా చేస్తారు.

పరిహారం : శనివారం రోజున పేదలకు మందులు పంపిణీ చేయాలి.

English summary

Shani Transit in September 2020: Shani Margi in Capricorn on Sep 29 Effects on All Zodiac Signs in Telugu

Saturn Transit September 2020 effects: Saturn changing Margi in September 29. Check out the effects on all zodiac signs in telugu.