Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా? దాని వెనక ఉన్న అర్థమేంటంటే..
హిందూ సంస్కృతిలోని ప్రతి ఆచారం, సాంప్రదాయం వెనక లోతైన అర్థం, ప్రాముఖ్యత ఉంటుంది. ఏదైనా పూజ, ఆచార సమయంలో ఉపయోగించే వస్తువులు శరీరం, మనస్సు, ఆత్మ యొక్క స్వస్థత మరియు సాఫీగా నడపడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

దేవాలయాల ప్రధాన ద్వారం దగ్గర ఒక గంట ఉంచడం తెలిసిందే. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు గంట మోగిస్తారు. దాని ధ్వని మనస్సును మంత్రముగ్దులను చేస్తుంది. పూజాది కార్యక్రమాల్లో కూడా గంట మోగించడం తెలిసిందే.
గంట హిందూ ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. దేవాలయాల్లో దేవతలను ఆరాధించే ముందు లేదా ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో దేవుళ్లను ఆవాహన చేయడానికి సంకేతంగా గంటలు మోగిస్తారు. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంటను ఎందుకు మోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడిలో గంట ఎందుకు కొడతారు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవాలయాలకు వెళ్లినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించడం వల్ల దేవానుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఆలయంలోకి ప్రవేశించే సమయంలో గంటను మోగించడం ద్వారా భక్తుల సందేశం నేరుగా దేవునికి వెళ్లి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.
గంటను ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మోగిస్తే ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే శరీరంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని, మనస్సు కూడా స్వచ్ఛంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గంటను మోగించడం ఎప్పుడూ సానుకూల శక్తిని, వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది చుట్టూ మంచి వాతావరణాన్ని తీసుకువస్తుంది. మంచి ఫలితాలను ఇస్తుంది.

గుడిలో గంట మోగించడం ప్రాముఖ్యత:
గంటను మోగించడం అనేది ఆలయంలోకి ప్రవేశించడానికి దేవుని నుండి అనుమతి పొందడమని నమ్ముతారు. ఇది మనస్సు యొక్క అన్ని చక్రాలను తెరవడానికి ఒక మాధ్యమమని విశ్వాసం. గంట శబ్దం ద్వారా దేవుడు మేల్కొంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. గంట శబ్దం దేవుళ్లను ఆకర్షిస్తుందని అంటున్నారు.

గంట మోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
* గంట మోగించడం వల్ల వచ్చే పెద్ద శబ్దం శరీరంలోని ఏడు చక్రాలను సక్రియం చేస్తుంది.
* గంట శబ్దం మొదడు యొక్క కుడి, ఎడమ లోబ్ మధ్య సామరస్యాన్ని సృష్టిస్తుంది.
* గంట శబ్దం దేవతల సూత్రాన్ని సమర్థిస్తుంది.
* గంట కొట్టడం ద్వారా వచ్చే శబ్దం చెడు శక్తులను దూరం చేస్తుంది.
* ఆలయంలోకి ప్రవేశించే ముందు గంటను మోగించడం శరీరం, మనస్సును శుద్ధి చేస్తుంది.
* గుడిలోకి ప్రవేశించే ముందు స్వచ్ఛమైన ఆత్మతో భగవంతుడిని ప్రార్థించవచ్చు.



Click it and Unblock the Notifications
