Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
సూర్య గ్రహణం 2020 : జూన్ 21న చేయాల్సిన, చేయకూడని పనులేంటో చూడండి...
జూన్ 21వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను, మానవులను కంపింపచేసే ఏకైక శక్తి ఉన్న వ్యక్తి సూర్యుడు. వెయ్యికిరణాలు కలిగిన భానుడు ఒక్కరోజు రాకపోతే ఆ లోకమంతా చీకటి మయంగా మారిపోతుంది. అలాంటి సూర్యుడిని రాహువు మింగేస్తాడు. ఆ సమయాన్నే సూర్యగ్రహణం అంటారు. అలాంటి ఘట్టం 2020 సంవత్సరంలో జూన్ 21వ తేదీ జరగబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కేవలం అమావాస్య రోజు మాత్రమే వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సూర్యగ్రహణం అనేది ఏర్పడదు.

ఈ సూర్యగ్రహణం ఈసారి కూడా అమావాస్య రోజున అదీ ఆదివారం నాడు జరుగుతుంది. పూర్వకాలంలో ఈ గ్రహణాలను ప్రతికూల ఫలితాలకు సంకేతంగా భావించేవారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వీటిని నమ్ముతున్నారు. అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు ఏర్పడితే, చాలా భయపడుతూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఈ గ్రహణం సందర్భంగా ద్వాదశ రాశులలో నాలుగు రాశుల వారికి మేష, మకర, సింహ, కన్య రాశుల వారికి కనకవర్షం కురవబోతోందని చెబుతున్నారు పండితులు.

మరో నాలుగు రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయని, మిగిలిన నాలుగు రాశుల వారికి మాత్రం అశుభ ఫలితాలుంటాయని చెబుతున్నారు. ఆ వివరాలన్నీ మనం ఇంతకుముందు ఆర్టికల్ లోనే తెలుసుకున్నాం కదా..

మరి ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోయే ఆదివారం నాడు ఎలాంటి పనులు చేయకూడదు.. ఏయే పనులు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. అసలు గర్భిణులపై గ్రహణం ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గ్రహణ కాలంలో..
హిందూ ధర్మం ప్రకారం సూర్య గ్రహణానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించాలి. నది తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతారు. అలాగే గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి, పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

గర్భిణులకు సూచనలు..
ఈ సూర్యగ్రహణ ప్రభావం గర్భిణులపై చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇది మూఢనమ్మకమా, లేదా అనేది ఇప్పటికీ తెలియదు. అయితే ఇవన్నీ పక్కనబెడితే గ్రహణం సమయంలో మాత్రం గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. గ్రహణం పట్టడానికి ముందే సుమారు 6 గంటల ముందు భోజనం ముగించాలి. గ్రహణం సమయంలో అస్సలు ఆహారం తీసుకోకూడదు. గర్భిణులు నదీ తీరాన, సముద్ర తీరాన, కాలువల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు. కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి.

పుట్టబోయే బిడ్డపై ప్రభావం..
ఒకవేళ సూర్యగ్రహణం సమయంలో గర్భిణులు ఆహారం తీసుకుంటే గనుక, అది పుట్టబోయే బిడ్డపై చాలా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. ఇది గర్భిణుల పిండంపై ప్రభావం చూపడం వల్ల పుట్టబోయే బిడ్డ ఏదైనా లోపంతో పుడతారని చాలా మంది నమ్మకం. అందుకే గ్రహణం సమయానికి ఆరు గంటలు ముందుగా భోజనాన్ని ముగించాలంట.

గర్భిణులు ఏమి చేయాలంటే..
గ్రహణం సమయంలో గర్భిణులు అటూ ఇటూ అస్సలు ఎక్కువగా కదలకూడదు. అంటే కడుపులో ఉండే పిల్లవాడికి ఇబ్బందికరంగా ఉండకుండా అన్నమాట. లేదంటే కుర్చీలో కూర్చొని ఏదైనా పుస్తకం చదవడం గానీ.. లేదంటే ఏదైనా తేలికపాటి పని చేయడం లేదా సంగీతం వినడం వంటివి చేయాలి. గురువులతో

సైన్స్ ఏమి చెబుతోందంటే..
అయితే సైన్స్ ప్రకారం గ్రహణం రోజున విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగి, బ్యాక్టీరియా అధికమవుతుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే, ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే గర్భిణులు గ్రహణం చూడరాదని, ఒక వేళ చూస్తే వారికి పుట్టే పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ఉపవాస దీక్ష..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ప్రభావం 12 రాశి చక్రాలపై కచ్చితంగా ఉంటుందట. అందుకే ఎవరైనా వారి రాశిచక్రం, నక్షత్రాన్ని బట్టి గ్రహణం సమయంలో విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గ్రహణం సమయంలో ఉపవాస దీక్షను కచ్చితంగా చేపట్టాలి. దీని వల్ల కచ్చితంగా ఫలితం ఉంటుంది.

ఇవి చేయకూడదు..
- గ్రహణ సమయంలో పంచాంగం అస్సలు చూడకూడదు.
- సంస్కృత శబ్దాలు చేయకూడదు.
- గర్భవతులు బాహ్యాస్నానాలు చేయకూడదు.
- మూడేళ్ల పిల్లలకు నదులు, సాగరతీరాన స్నానాలు చేయించరాదు.
- గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఇది కంటికి ప్రమాదకరం.
- గ్రహణం సమయంలో అందరూ ఇంట్లోనే ఉండటం మంచిది.
- ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
- తులసి ఆకులను నీటిపై ఉంచడం వల్ల గ్రహణ ప్రభావం తగ్గుతుంది.
- గ్రహణం తర్వాత కచ్చితంగా స్నానం చేయాలి.
- చాలా వస్తువులలో గరక వేసుకోవాలి.
- సూర్య మంత్రాన్ని జపించాలి.
- గర్భిణులు సంతాన జపం చేయాలి.




Click it and Unblock the Notifications











