For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ లైఫ్ లో బ్యాడ్ లక్ కు కారణం ఈ దురదృష్టకర సంకేతాలు

|

మనమందరం జీవితంలో అదృష్టవంతులుగా ఉండాలని కోరుకుంటాము. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో మంచి విషయాలు జరగాలి మరియు చెడు విషయాలు జరగకూడదు అని భావించే వ్యక్తులున్నారు. ఇటువంటి ఆలోచనలు కొన్ని నమ్మకాల ద్వారా కూడా బలపడుతుంది.

జీవితం దురదృష్టకరం. కొంతమంది బద్దకస్తులు, బుద్దిహీనులు, అసమర్థులైనా అదృష్టవంతులు అవుతారు. కొంత మందికి ఎన్ని తెలివితేటలున్నా..ఎంత సామర్థ్యం కలిగి ఉన్నా కాని దురదృష్టవంతులుగా ఉంటారు.

జీవితంలో కొన్ని విషయాలు దురదృష్టకర సంకేతాలుగా మనం చూస్తాము. ఇందులో కొన్ని శకునాలు, కొన్ని విషయాలు, కొన్ని నమ్మకాలు ఉన్నాయి. జీవితంలో దురదృష్టకర విషయం గురించి తెలుసుకోండి.

నల్ల పిల్లి

నల్ల పిల్లి

నల్ల పిల్లి దురదృష్టకరం అని చాలా మంది సాధారణంగా నమ్ముతారు. ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మంచి శకునం చూస్తుంటారు. తీరా బయలుదేరిన తర్వాత నల్ల పిల్లి దారికి అడ్డం వస్తే దురదృష్టకరమని సాధారణంగా నమ్ముతారు. ఈ నమ్మకంతోనే ప్రయాణించేటప్పుడు లేదా యాత్ర చేసేటప్పుడు ప్రమాదం ఉందనే నమ్మకం వల్ల ఆరోజు ప్రయాణాన్ని వాయిదే వేసుకుంటుంటారు. ఇటువంటి శకునాలు చూడటం పూర్వకాలం నుండే మన భారతీయుల్లో ఉంది.

13 శుక్రవారం

13 శుక్రవారం

తేదీ 13 అదీ శుక్రవారం వస్తే ఈరోజును దురదృష్టకరమైనది భావిస్తారు. నేడు శుక్రవారం 13 వ తేది. అయితే ఏంటి దీని ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా? మంచి పనులను మొదలు పెట్టడానికి ఈ రోజు సరైనది కాదు అని చాలా మంది నమ్ముతారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్కృతులు లేదా ఆచారాల ప్రకారం, శుక్రవారం అనగా 13 వ తేదీని ప్రయాణాలను చేయడానికి దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు

ఉప్పు, కారం, ఆవాలు

ఉప్పు, కారం, ఆవాలు

ఉప్పు, కారం, ఆవాలు కూడా మంచివి కావు కాదు. ఇది ఇంటి వివాదాలకు దారితీస్తుందని సాధారణంగా నమ్ముతారు. వీటిని వేరొకరికి ఇవ్వడం కానీ, లేదా నేలపై పడేయడం కానీ జరిగితే ప్రతిఒక్కరూ వివాదాలు మరియు తగాదాలకు లోనయ్యే అవకాశం ఉంది. కత్తి లేదా కత్తెర వీటిని మనిషికి ఎదురుగా పెట్టి ఇవ్వడం వల్ల ఈ రకమైన తగాదాలకు కారణమవుతుందని చాలా నమ్మకాలు ఉన్నాయి.

కత్తెర

కత్తెర

కత్తెర అనేది ఏదో కత్తిరించడానికి ఉపయోగపడే వస్తువు అనుకుంటాం. కానీ మీరు ఏదైనా కత్తిరించకపోయినా లేదా దానిని వాడకపోయిన బ్యాడ్ లక్ కు సంకేతాలను ఆహ్వానించినట్లై అవుతుంది.

జుట్టు కత్తిరించడం కూడాదురదృష్టానికి సంకేతం

జుట్టు కత్తిరించడం కూడాదురదృష్టానికి సంకేతం

కత్తెరను అడకత్తెరగా అంటే ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఇంట్లో అపార్థాలకు మరియు అనుమానాలకు దారితీస్తుందని నమ్ముతారు. ఇది దురదృష్టకరం. అలాగే సాయంత్ర సమయంలో జుట్టు కత్తిరించడం కూడాదురదృష్టానికి సంకేతం

సాయంత్రంలో గోర్లు కత్తిరించడం

సాయంత్రంలో గోర్లు కత్తిరించడం

సాయంత్రం గోర్లు కత్తిరించరాదని నిపుణులు అంటున్నారు. సాయంత్రం చీకటి పడ్డాక గోళ్ళు కత్తిరించడం వల్ల అనేక దురదృష్టాలు చోటు చేసుకుంటాయి. ఇటువంటి పనుల వల్ల దుష్ట శక్తులను ఆకర్షిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం నుండి గోళ్లు వేరుచేసినప్పుడు ఇది సంభవిస్తుందని అంటారు.

 దురదృష్టమైన శనివారం:

దురదృష్టమైన శనివారం:

చాలా మంది శనివారంను శనిదేవునికి ఇష్టమైన దినంగా నమ్ముతారు. శనివారం ప్రయాణం చేయడం అనుకూలమైనది కాదు భావిస్తారు. అలాగే ఏ పవిత్రమైన వేడకైన శనివారం జరుపుకోవడానికి ఇష్టపడరు. ఏ శుభకార్యాన్ని నిర్వహించరు.

English summary

Some Of the Unlucky Signs That Brings Bad Luck

Some Of the Unlucky Signs That Brings Bad Luck, read more to know about
Story first published:Thursday, September 19, 2019, 17:21 [IST]
Desktop Bottom Promotion