For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకింగ్ కు గుడ్ బై చెప్పిన సౌత్ ఇండియన్ హీరోలెవరో తెలుసా..

విజయ దేవర కొండ ఈ హీరో అసలు పేరు కంటే అర్జున్ రెడ్డిగానే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు.

|

ప్రస్తుత జనరేషన్ లో సినిమా స్టార్లను చాలా మంది రోల్ మోడల్స్ గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత తమ అభిమాన హీరోల నటనను మరియు వారి స్టైల్ ను అనుసరిస్తుంటారు. వారి మాట, బాట ద్వారా కొన్ని కోట్లు, లక్షల మంది అభిమాలను సంపాదించుకున్నారు. ఇక వారు నటించే సినిమాల్లో చాలా సన్నివేశాల్లో సిగరెట్ తాగడం ట్రెండ్ గా మారింది. దానిని కూడా చాలా మంది యువత ఆ స్టైల్ ను అనుసరిస్తోంది. సినిమాల్లో సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని స్క్రోలింగులు వేస్తున్నా, ప్రకటనలు ఇస్తున్నా యువత అవేమీ పట్టించుకోవడం లేదు.

Quit Smoking

అయితే కొంతమంది నటులు సినిమాల్లో నటించే సమయంలోనే సిగరెట్లను పట్టుకుంటారనుకుంటే పొరపాటే. నిజ జీవితంలోనూ చాలా మంది సిగరెట్ వ్యసనానికి బానిసలవుతున్నారు. ఇలా చాలా మందే ప్రముఖ నటులు సిగరెట్ తాగడానికి బానిసలయ్యారు. కానీ వారు ప్రస్తుతం ఆ బానిస చర్య నుండి విజయవంతంగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మీరు అంతగా అభిమానించే నటులే సిగరేట్ ధూమపానం మానేసినప్పుడు, మీరు ఎందుకు ఆ చెడు అలవాటును విడిచిపెట్టకూడదు. అందుకే పొగ తాగకండి. పొగను తాగనీయకండి. ఇక ఈ పొగ తాగడం నుండి విజయవంతంగా బయటపడిన ప్రముఖ నటులెవరో తెలుసుకుందాం.

అర్జున్ రెడ్డి (విజయ దేవర కొండ)

విజయ దేవర కొండ ఈ హీరో అసలు పేరు కంటే అర్జున్ రెడ్డిగానే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ విజయ దేవరకొండ అంటే చాలా మందికి తెలియదు. కానీ అర్జున్ రెడ్డి అని చెబితే మాత్రం టక్కున గుర్తు పడుతున్నారు. పొగ తాగడం గురించి విజయ దేవర కొండ ఇలా చెప్పాడు. 'నేను ఎప్పుడూ పొగ తాగలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో కేవలం కొన్ని సన్నివేశాల కోసమే ధూమపానం ప్రారంభించాను. సినిమా షుటింగ్ తర్వాత, తాను ఈ అలవాటును వదిలేశాను' అని ఆ హీరో చెప్పాడు.

ప్రిన్స్ మహేష్ బాబు..

ప్రిన్స్ మహేష్ బాబు..

సూపర్ స్టార్ క్రిష్ణ కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు కొన్నేళ్ళ క్రితం చైన్ స్మోకర్. కానీ అంత మత్తులో నుండి మహేష్ విజయవంతంగా బయటపడ్డాడు. పొగ తాగడాన్ని మానేయడనాకి అనేక మార్గాలను అన్వేషించాడు. ఈ అలవాటును వదిలేయడానికి అలాన్ కార్ పుస్తకాన్ని చదవమని అతని స్నేహితుడు మహేష్ ను ఒప్పించాడట. అప్పుడు ఆ సిగరెట్ తాగే అలవాటును వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు అప్పటి నుండి ఒకట్రెండు సినిమాల్లో తప్ప చాలా వరకు సినిమాల్లో సిగరెట్ ఎక్కువగా వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

దగ్గుబాటి రాణా..

దగ్గుబాటి రాణా..

బాహుబలి సినిమాలో భళ్లాలదేవాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నదగ్గుబాటి రాణా ఓ సినిమా కోసం సిగరెట్ తాగడం ప్రారంభించాడు. అప్పటినుండి ఆ అలవాటును చాలా సంవత్సరాల పాటు కొనసాగించాడు. అలా అతను ఓ చిత్రం షూటింగుకు వెళ్లినప్పుడు ఆ సినిమాలో కొన్ని సీనల్లకు సరిగా డబ్బింగ్ చేయాలలేకపోయాడు. దీని గురించి డాక్టర్ ను సంప్రదించగా, అ వైద్యుడు పొగ తాగడం మానేయమని దగ్గుబాటి రాణాను సలహా ఇచ్చాడు. అప్పటి నుండి రాణా కష్టపడి ఈ చెడ్డ అలవాటును వదులుకున్నాడు.

తమిళ్ తలైవా..

తమిళ్ తలైవా..

తమిళనాడు తలైవాగా పిలుచుకునే రజనీకాంత్ ధూమాపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్ల రీత్యా అనారోగ్యానికి గురయ్యారట. ఆ సమయంలో సింగపూర్ ఆసుప్రతిలో చేరారు. అతను కోలుకున్నప్పుడు, అతను తన ఆరోగ్య సమస్యలకు కారణాలు తన యువకుడిగా ఉన్న సమయంలో అధికంగా మద్యం మరియు ధూమపానమే అని రజనీకాంత్ స్వయంగా చెప్పాడు. ఆ తర్వాత తాను అలవాట్లను పూర్తిగా మానేశాను అని చెప్పాడు. తన అభిమానులకు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ 2012 డిసెంబర్ 12వ తేదీన పుట్టిన రోజు సందర్భంగా ధూమపానం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లను మానుకోవాలని తన అభిమానులకు సైతం సూచించారు.

కమల్ హాసన్..

కమల్ హాసన్..

కమల్ హాసన్ తన 11 సంవత్సరాల వయసులో తన మొదటి సిగరెట్ తాగాడు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడుతూ సిగరెట్ అలవాటును విడిచిపెట్టానని, ఎందుకంటే చాలా చిత్రాలలో లిప్ కిస్ సన్నివేశాలను తీయాల్సి వచ్చింది అని చెప్పాడు. తన తల్లి ధూమపానం మానుకోమని సలహా ఇచ్చినప్పుడే, దీన్ని మానేందుకు చర్యలు ప్రారంభిస్తానని అతనికే తెలియదు అని చెప్పాడు. ఆ తర్వాత సిగరెట్ తాగడం మానేశానని చెప్పాడు.

మమ్ముట్టి..

మమ్ముట్టి..

యాత్ర సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేరళ నటుడు మమ్ముట్టి తనకు ధూమపానం అలవాటు ఉండేదని చెప్పాడు. ఎనిమిది సంవత్సరాల క్రితమే తాను సిగరెట్ తాగడం మానేశాడని చెప్పాడు. ఇప్పటివరకు సిగరెట్ ను మళ్లీ తాకలేదని చెప్పాడు.

వివేక్ ఒబెరాయ్..

వివేక్ ఒబెరాయ్..

బాలీవుడ్ నటుడు వివెక్ ఒబెరాయ్ తెలుగులో రక్తచరిత్ర 1, 2లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడు ఒకసారి ముంబైలోని క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులను సందర్శించేటప్పుడు తన సిగరెట్ తాగే అలవాటును మానుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు అప్పటి నుండి ధూమాపాన నిరోధక ప్రయత్నాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంతకం చేస్తూ నిర్ణయం బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగాడు.

జయసూర్య..

జయసూర్య..

ఈ తమిళ నటుడు ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీనికి ముందు రోజుకు పది సిగరెట్లు తాగేవాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉన్న రోజుల్లో, అతను తన స్నేహితులతో ధూమపానం చేయడం ప్రారంభించాడు. అతను మరియు అతని స్నేహితులు ధూమపానం చేయడం ద్వారా స్వరం మెరుగుపడుతుందని చెప్పడంతో సిగరెట్ తాగడం ఎక్కువ చేశాడట. అయితే ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి, అతను ఈ చెడు అలవాటును వదులుకున్నాడు.

సో మీకు కూడా సిగరెట్ తాగే అలవాటు ఉంటే ఇప్పటి నుండి వెంటనే మానేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంగా జీవించండి.

English summary

South Indian Actors Who Quit Smoking

In films, smoking is often considered as a 'cool' factor that adds to the stylish appeal of the actor. Indian films carry a disclaimer before every film, stating that 'Smoking causes cancer. Smoking Kills'. Our Tamil, Telugu and Malayalam movie actors have successfully bid adieu to cigarettes. Here's look at the actors who have done so.
Desktop Bottom Promotion