Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఎస్పీబీ అస్తమయం : గంధర్వ లోకానికి గాన గంధర్వుడు...సంగీత ప్రపంచంలో చీకటిరోజు...
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


తను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎల్లలు దాటని యోగిలా.. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోహన శక్తి బాలు గళానికే కాదు, అతని వ్యక్తిత్వానికీ ఉంది. తను ఎవరికి పాడినా సరే.. ఆ నటుడి హావభావాలు, నటనాశైలి, వ్యవహార ధోరణికి తగ్గట్టుగా పాడటం ఆ నటుడే స్వయంగా పాడుతున్నాడేమో అనేంతలా తన స్వరాన్ని సవరించుకుని పాడటం బాలు ప్రదర్శించిన అరుదైన ఫీట్.

అదే గొంతు తనను ఉన్నత శిఖరాలకు చేర్చింది. శాస్త్రీయ సంగీతంలో పెద్దగా అనుభవం లేకున్నా.. ఆ గాయకులకు సైతం ధీటుగా పాడిన ప్రతిభ కేవలం బాలుకి మాత్రమే సాధ్యం.

సుమారు 40 వేల పాటలు పాడిన ఈ పద్మభూషణుడికి వచ్చిన అవార్డులు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. తను చదివిందేమో ఇంజనీరింగ్.. కానీ తన ప్రస్థానం మాత్రం గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా.. నిర్మాతగా, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సినీ సంగీత కార్యక్రమాల నిర్వహకుడిగా సాగింది. అంతటి మహనీయుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఈరోజు (సెప్టెంబర్ 25వ తేదీన) మధ్యాహ్నం 1:04 గంటలకు అస్తమయం అయినట్లు తన కుమారుడు చెప్పడంతో.. తనని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలెన్నో. ఈ వార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

బాలు సొంతూరిలో..

బాలు విద్యాభ్యాసం..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాథమిక విద్యను నగరిలో మేనమామ ఇంట్లో చదువుకున్నారు. పాఠశాల ఫైనల్ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పుడు బాలు చదువులోనే కాదు.. ఆటల్లోనూ అద్భుతంగా రాణించేవాడు. అక్కడే బాలుతో ‘చెంచు లక్ష్మీ' సినిమాలో సుశీల ఆలపించిన ‘పాలకడలిపై శేషతల్పమున' అనే పాటను పాడించి రికార్డు చేశారు. బాలుకు అదొక మధురానుభూతి.

ఎస్వీ కాలేజీలో..
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో పి.యు.సి. చదువుతుండగానే మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఓ నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. తరువాత విజయవాడ ఆకాశవాణిలో తను స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఒక లలిత గీతానికి బహుమతి కూడా లభించింది. పి.యు.సి పరీక్షలు రాసి నెల్లూరు చేరుకొన్న ఆయన ఒక ఆర్కెస్ట్రా టీమ్ ను తయారు చేశారు. స్నేహితులతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు.

40 వేల పాటలు..
తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మళయం, కొంకణి, మరాఠీ, ఇంగ్లీష్ తో సహా భారతదేశంలోని సుమారు 16 భాషల్లో తన గానంతో అలరించారు.. ఈ గాన గంధర్వుడు 74 ఏళ్ల కాలంలో సుమారు 40 వేల వరకు పాటలు పాడటమే కాదు.. ఇతర భాషల్లోని మాధుర్యాన్ని ఆవాహన చేసుకుని మరీ పాడేవావరు. ఇలాంటి స్వరం మళ్లీ పుడుతుందా? ఇలాంటి ఫీట్ మరెవరికీ సాధ్యం కాదేమో?

తొలి అవార్డు..
తన నాన్న గారి కోరిక మేరకు.. ఇంజనీరింగ్ చదువు కోసం మద్రాసు వెళ్లిన ఆయన.. 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వవారు నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న ‘బాలు'కి ప్రథమ బహుమతి లభించింది.

తొలి ప్రయత్నంలోనే..
ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం తొలి అవార్డు అందుకున్న కొద్దిరోజుల్లోనే నిష్ణాతుల మధ్యలో పాటను పాడే అద్భుతమైన అవకాశం దక్కించుకున్నారు. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రంలో తొలిసారి పాటను పాడారు. అప్పుడు తనను అందరూ మెచ్చుకున్నారు.

ఉత్తమ గాయకుడిగా..
ఈ గాన గంధర్వుడు ఉత్తమ గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులను అందుకున్నారు. అవి శంకరాభరణం(1979), ఏక్ దూజే కే లియే(1981), సాగరసంగమం(1983), రుద్రవవీణ(1988), సంగీతసాగర గానయోగి పంచాక్షర గవాయ్(1995-కన్నడ), మిన్సార కణవు(1996-తమిళం). జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ గాయకునిగా ‘మైనే ప్యార్ కియా' చిత్రానికి ఫిలింఫేర్ అవార్డును సైతం అందుకున్నారు.

దక్షిణ భారతంలో..
దక్షిణ భారత సినిమాల్లో ఉత్తమ గాయకుడిని ఇచ్చే ఫిలింఫేర్ బహుమతులు బాలుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడుసార్లు వరించాయి. అంతేకాదు.. ఉత్తమ గాయకునిగా 18 నంది అవార్డులు కూడా వచ్చాయి. ‘మయూరి' సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డును సైతం అందుకున్నారు. ‘మిథునం' సినిమాలో తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా లభించింది. తమిళంలోనూ నాలుగుసార్లు, కన్నడలో పాడిన పాటలకు మూడుసార్లు ఉత్తమ గాయకునిగా బహుమతులు దక్కాయి.

పద్మశ్రీ, పద్మభూషణ్..
ఈ గాన గంధర్వునికి కేవలం సినిమాకు సంబంధించిన అవార్డులే కాదు.. ప్రభుత్వం తరపున అత్యుత్తమ పురస్కారాలు సైతం దక్కాయి. అందులో 2001లో పద్మశ్రీ అవార్డు దక్కగా.. 2011లో పద్మభూషణ్ అవార్డును బాలు అందుకున్నారు. బాలు తనయుడు చరణ్ కూడా మంచి గాయకుడిగా, సినీ నిర్మాత స్థిరపడ్డారు.



Click it and Unblock the Notifications