For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ugadi 2020 panchangam : తెలుగు నూతన సంవత్సరంలో మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి...!

|

ముందుగా తెలుగు ప్రజలందరికీ శార్వరి నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మార్చి 25వ తేదీ నుండి తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ పండుగ సందర్భంగా హిందువులందరూ ఉగాది పచ్చడిని తయారు చేస్తుంటారు. అందులో షడ్రుచులను కచ్చితంగా కలుపుతారు.

ఉగాది అంటేనే సంవత్సరం యొక్క ప్రారంభ రోజు కాబట్టి ఆరోజే చాలా మంది జ్యోతిష్య పండితులు పంచాంగ శ్రవణం చేస్తుంటారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరమంతా మీ గ్రహాలు అనుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా, ఏయే నెలలు అనుకూలంగా ఉంటాయి? ఏయే నెలలు ప్రతికూలంగా ఉంటాయి అనే విషయాలతో పాటు అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను కొందరు జ్యోతిష్య పండితులు ఇలా వివరిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఉగాది పండుగ పర్వదినం రాబోతుంది కాబట్టి మీ నక్షత్రాల ప్రభావం ఎంత మేరకు పని చేస్తుందో ఈ రాశిని బట్టి తెలుసుకోండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొదటి మూడు నెలలో పనిలో చాలా కష్టాలు ఎదురవుతాయి. మీరు కొన్నింటిపై ఆసక్తిని కోల్పోతారు. మీరు ఆశించిన రాబడి ఉండకపోవచ్చు. అయితే వ్యాపారులకు ఆనందంగా ఉంటుంది. కానీ మీరు ఆర్థిక పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ పనులు చేయడానికి మీరు ప్రేరణ పొందే అవకాశం ఉంది. రైతులకు కొంత పురోగతి కనిపిస్తోంది. అయితే మీకు సంవత్సరం చివరిలోపు సమస్యలు తగ్గిపోతాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరంలో మంచి మరియు చెడు వంటి వాటిని సమానంగా పొందే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంట్లో భక్తి మరియు మంచి పనులు ఉంటాయి. మీరు ప్రయత్నాలు చేయడంలో కొంత విజయం సాధించబోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు నెమ్మదిగా ఉంటారు. అయితే కుటుంబంలో కుటుంబ సంరక్షకులకు, ముఖ్యంగా తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. దీని వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు.

మిధున రాశి

మిధున రాశి

ఈ రాశి వారు ఈ సంవత్సరం కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. ఉద్యోగులు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ లావాదేవీలు చేసే వారికి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు. అయితే జూన్ మాసం తర్వాత కొంతవరకు పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తిస్థాయిలో మాత్రం మార్పు రాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలోని మూడు నెలలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు బదిలీలు వంటివి పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అయితే అలాంటి ఖర్చులు ఎలాంటి ఫలితాల్ని ఇవ్వవు. ప్రభుత్వ సంబంధిత పనులు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే మీరు మీ బాధ్యతలను నిర్ణీత గడువులోపు నెరవేర్చాలి.

సింహ రాశి

సింహ రాశి

ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణం, దుస్తులు, ఇల్లు కొనడం వంటివి ఏవైనా చేయొచ్చు. వ్యాపారులకు వ్యాపార విస్తరణకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి పనులు చేయడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అయితే సంవత్సరం చివరి నాటికి మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామిని మరియు పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అలా చేయలేని వారు పసుపు దుస్తులలో బ్రాహ్మణులకు దానం చేయాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో మీ పిల్లల ప్రతిభను చూసి మీరు గర్వపడతారు. అదే సమయంలో, అనారోగ్యం మరియు అవమానం కూడా ఎదురవుతాయి. జీర్ణ సమస్యలు, డయాబెటిస్, మూత్ర పిండాల సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది. అయితే మీరు వీటిని అధిగమించేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలను ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆస్తికి సంబంధించి సోదరులు మరియు సోదరీమణులతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు అప్పగించిన ఏ పని అయినా బాధ్యతగా పూర్తి చేయండి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు ఈ కాలంలో పెట్టుబడి పెట్టకపోతేనే మంచిది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. అయితే తర్వాత మీరు ఆదాయ వనరులను పొందే అవకాశం ఎక్కువగా ఉంది. భూమి మరియు ఇంటి అమ్మకాల ద్వారా మీరు ఎక్కువ లాభాలను పొందుతారు. వారసత్వ ఆస్తికి సంబంధించి ఏదైనా సమస్యలుంటే, మీరు వాటిని పరిష్కరిస్తారు. కారు లేదా బైక్ కొనడానికి ఈ సమయం సరైనది. మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీరు కాస్త కష్టపడి ఆదాయాన్ని పెంచుకోవాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరం మానసికంగా కొంత విచారంగా ఉంటారు. అయితే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం చివరిలో మీకు బకాయిలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు దీని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయంలో ప్రయత్నించవద్దు. ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరం స్నేహితులు, బంధువుల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా అనారోగ్యంతో పాటు మరికొన్ని సమస్యలు మిమ్మల్ని కోలుకోనీయకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ఉపాధి మార్పుకు అవకాశం ఉంది. కొందరు తమ ఉద్యోగాలను విడిచిపెట్టవలసి ఉంటుంది లేదా వారి ప్రస్తుత స్థితి కంటే తక్కువగా మారవచ్చు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రారంభంలో సానుకూల ఫలితాలను పొందుతారు. అయితే మీరు అదనపు పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు పరిశ్రమ పరంగా కొంత లాభం ఉంటుంది. అయితే సంవత్సరం ప్రారంభం మూడు నెలల తర్వాత మరియు నవంబర్ తర్వాత మీరు కొన్ని భారీ నష్టాలను చూడాల్సి ఉంటుంది. మీ ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. జూదం, ఇతర వ్యాపార లావాదేవీలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యర్థుల ఆధిపత్యం పెరగొచ్చు. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకపోతేనే మంచిది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి, శని రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు మీ ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా బాగుంటుంది. మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయ వనరులు కూడా బాగా పెరగనున్నాయి. ఉద్యోగ మార్పులకు ఈ ఏడాది మంచి సమయం.

English summary

Sri Sarvari Nama Samvatsara Uagdi Rashi Phalalu Predictions 2020-21

Here we talking about ugadi 2020 : ugadi horoscope. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more