Latest Updates
-
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
మేషంలోకి సూర్యుడి సంచారంతో 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన, అంటే బుధవారం నాడు మీన రాశి నుండి మేషరాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.

ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో మేష సంక్రాంతి సంభవించనుంది. ఇదే రాశిలో సూర్యుడు సుమారు ఓ నెల రోజుల పాటు నివాసం ఉండనున్నాడు.

ఈ కారణంగా మేష సంక్రాంతి వేళ పవిత్రనదుల్లో కుంభమేళా సందర్భంగా భక్తులు స్నానాలు చేస్తారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో అంతా అనుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మీ తల్లి నుండి ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి.

వృషభరాశి..
సూర్యుడి రవాణా వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి రావొచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల నుండి కొంత చెడు సమాచారం వింటారు. మరోవైపు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. కోర్టుకు సంబంధించిన మీ సమస్యలు పరిష్కారమవుతాయి.

మిధున రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి పరివర్తనం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లి సెటిల్ కావాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఈ కాలంలో ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు దక్కుతాయి. మీరు చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఇదే సమయంలో ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు పెట్టుకుంటారు. ఇది మీ ఆదాయాన్ని పెంచే అవకాశాలను కూడా పెంచుతుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి సూర్యుని రవాణా చాలా ప్రభావంతంగా ఉంటుంది. ఈ సమయంలో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే, మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. మీరు పిల్లలకు సంబంధించిన సమస్య నుండి ఉపశమనం పొందుతారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి వల్ల మీ ఆలోచనల్లో మంచి మార్పులొస్తాయి. భవిష్యత్తులో మీరు భారీ లాభాలను పొందుతారు. మీకు తోబుట్టువుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. వారి సహకారంతో మీరు వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబంలో అంతా మంచిగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఈ కాలంలో ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, సమయానికి మందులు వేసుకోవాలి. మరోవైపు మీరు పోరాటాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల అనేక శుభఫలితాలొస్తాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి పెళ్లి సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు. మీరు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అవకాశాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుత ప్రయోజనాలు రావొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు కోర్టుకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మరోవైపు ఈ కాలంలో ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎవ్వరికీ డబ్బు ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు ఈ కాలంలో ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపిస్తాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల ప్రత్యేక ఫలితాలు దక్కనున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీ గౌరవం పెరుగుతుంది. మరోవైపు మీరు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంటుందిద. వివాహం కాని వారు ఈ కాలంలో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు.

మకర రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఊహించని ఫలితాలను ఎదుర్కొంటారు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి కొన్ని ప్రతికూల సమాచారాన్ని వింటారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి పరివర్తనం వల్ల శుభ ప్రదంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రవాణా వల్ల ప్రత్యేక ఫలితాలు దక్కనున్నాయి. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మీ పని పట్ల చాలా ఆనందంగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని గొడవలు రావొచ్చు. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీరు ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. అయితే మీరు ఎవ్వరికీ రుణాలు ఇవ్వకండి. ఎందుకంటే అది మీకు తిరిగి సకాలంలో లభించదు. ఆరోగ్య పరమైన సమస్యల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి.



Click it and Unblock the Notifications