Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Sun Transit in Cancer:కర్కాటకంలో సూర్యుడి రవాణా.. ఈ రాశులకు ప్రత్యేక ఫలితాలు.. మీ రాశి ఉందేమో చూడండి...
2021లో జులై 16న సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అద్భుత ప్రయోజనాలంట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అధిపతిగా పరిగణించే సూర్యుడు తన స్థానాన్ని మారబోతున్నాడు. జులై 16వ తేదీన, అంటే శుక్రవారం నాడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ఆగమనం చెందనున్నాడు.

ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. జులై 16వ తేదీ సాయంత్రం 4:41 గంటల సమయంలో మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

సుమారు నెలరోజుల పాటు అంటే ఆగస్టు 17వ తేదీన ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు. అనంతరం తన సొంత రాశి అయినా సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు మిధున రాశి నుండి కర్కాటకరాశిలోకి ప్రవేశించేటప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి సూర్యుడి వల్ల అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. సానుకూల ఫలితాలు రానున్నాయి. అందులో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.

వృషభ రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు ఈ రాశి నుండి మూడో స్థానం గుండా సంచరించనున్నాడు. ఈ సమయంలో వృషభరాశి వారి శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగులు మీకు అద్భుతంగా సహకరిస్తారు. విద్యార్థులకు కూడా ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. మీరు చదువుతో పాటు ఆటల్లోనూ అద్భుతంగా రాణిస్తారు. ప్రతిరోజూ ఆవుకు బెల్లం తినిపించడం వల్ల మీకు మరిన్ని ప్రత్యేక ఫలితాలొస్తాయి.

మిధున రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో పాదం గుండా ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు తాము పెట్టిన పెట్టుబడుల్లో గణనీయమైన లాభాలను ఆర్జించొచ్చు. ఈ సమయంలో మీరు సోదరులు, సోదరీమణుల నుండి ఆశించిన ఆర్థిక సహాయం పొందుతారు. అయితే మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి. ఈ సమయంలో మీరు ఎవ్వరితోనూ తగాదాలు పెట్టుకోవద్దు. మీరు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. ప్రతిరోజూ మీరు సూర్యభగవానుడికి నైవేద్యం అర్పిస్తే మంచి ఫలితాలొస్తాయి.

కన్య రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంలో కన్య రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు పై అధికారులతో సత్సంబంధాలను పెంచుకోవాలి. సమాజంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది. దీంతో పాటు మీరు ఓ రకమైన ఆందోళనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

తుల రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానం నుండి కర్కాటకంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు పని చేసే రంగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు.

మీన రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ సమయం అన్ని రంగాల వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగో విద్యార్థులకు, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కచ్చితంగా విజయం లభిస్తుంది. అయితే ప్రేమికులకు ఈ సమయం కొంత నిరాశగా ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. అంతేకాదు మీరు మీ భాగస్వామితో గొడవపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు కొన్ని డబ్బుకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొంటారు.



Click it and Unblock the Notifications