సింహరాశిలోకి సూర్యుడి సంచారం.. ఈ సమయంలో 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

ఆగస్టు 16వ తేదీన సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్న సందర్భంగా ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో చూడండి.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యభగవానుడిని నవగ్రహాలకు అధిపతిగా భావిస్తారు. ఈ సూర్యభగవానుడు ఆగస్టు 16వ తేదీన సాయంత్రం 6:56 గంటలకు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 6:52 గంటల వరకు ఉంటుంది.

Sun Transit in Leo on 16 August : Effects on Your Zodiac Signs

ఇలా ప్రవేశించడాన్ని సింహా సంక్రాంతి అని కూడా అంటారు. ఇలాంటి సమయంలో సూర్యుడు శక్తివంతంగా ఉంటే, దాని ప్రభావం రాశి చక్రాలపై గణనీయంగా పడుతుంది. దీని వల్ల మన జీవితంలో కచ్చితంగా ప్రభావం ఉంటుంది.

Sun Transit in Leo on 16 August : Effects on Your Zodiac Signs

సూర్యుడు ఈ రాశిలో ఉన్న సమయంలో కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరతాయి. మరికొన్ని రాశుల వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు చాలా మందికి వారి జీవితంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.

Sun Transit in Leo on 16 August : Effects on Your Zodiac Signs

ఈ సందర్భంగా ద్వాదశ రాశులలో ఏయే రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..

మేషరాశి..

సూర్యుడు మేష రాశిలోని ఐదో స్థానంలోకి వెళ్తాడు. ఇది ఇల్లు, సంతానం, ఆనందం, ప్రేమ మరియు రొమాన్స్ సంకేతం. అంతేకాదు ఈ స్థానం మీకు కీర్తిని సూచిస్తుంది. కాబట్టి సూర్యుని యొక్క ఈ మార్పు మీ జీవితంలో అపారమైన అదృష్టాన్ని తెస్తుంది. అయితే మీ ప్రేమ జీవితంలో మీరు అడ్డంకులను ఎదుర్కొంటారు. మీకు మీ జీవిత భాగస్వామితో కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ కాలం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు అయోమయంలో పడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

సూర్యుడు వృషభ రాశిలోని నాలుగో స్థానానికి వెళ్తాడు. ఇది ఇల్లు, ఆనందం, భూమి వంటి వాటికి సంకేతం. సూర్యుడి సంచారం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీరు మీ పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. అంతేకాదు, మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని చూస్తారు. మీ కుటుంబ వాతావరణం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు స్నేహితులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందుతారు.

మిధున రాశి..

మిధున రాశి..

సూర్యుడు మిధున రాశిలోని మూడో స్థానానికి వెళ్తాడు. ఇది ఇల్లు, తోబుట్టువులు, బంధువులు, రచన వంటి వాటిని సూచిస్తుంది. సూర్యుడి రవాణా వల్ల మిధున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సామాజిక స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా తోబుట్టువుల సహకారం ఉంటుంది. విద్యార్థులకు కొంచెం కష్టపడితే విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

సూర్యుడు కర్కాటక రాశిలోని రెండో ఇంట్లోకి వెళ్తాడు. ఇది మీ ఆస్తి, కుటుంబం, ఆహారం, ప్రసంగాలను సూచిస్తుంది. సింహ రాశిలోకి సూర్యుడి ప్రవేశం కారణంగా, మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు మీ ఇంట్లోని వారితో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా కూడా సానుకూల మార్పులు కనబడతాయి. మీ ప్రస్తుత వేతనంలో పెరుగుదల కనిపించొచ్చు.

సింహ రాశి..

సింహ రాశి..

సూర్యుడు ఈ రాశి చక్రంలోని ప్రవేశించబోతున్నాడు. దీన్ని మొదటి లేదా అధిరోహణ ఇంట్లో అని చెప్పొచ్చు. ఇది ఇల్లు, ఆరోగ్యం, తెలివి, పాత్ర, లక్కీ, వ్యక్తిత్వం వంటి వాటిని సూచిస్తుంది. సింహ రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీరు కోరుకున్న రంగంలో పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంది.

కన్య రాశి..

కన్య రాశి..

సూర్యుడు కన్యరాశిలోని పన్నెండో ఇంట్లో సంచారం చేస్తాడు. ఇది విదేశీ భూములు, ఖర్చులు, విరాళాలు తదితర వాటిని సూచిస్తుంది. సింహ రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు జంక్ ఫుడ్ ను తినడం మానేయాలి. ఎందుకంటే దీని వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. ఆరోగ్యంగా ఉండటానికి మీరు తేలికపాటి వ్యాయామం చేయాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ సమయంలో సూర్యుడు తులరాశిలోని పదకొండో స్థానంలో సంచరిస్తాడు. ఇది ఇల్లు, కోరికలు, తోబుట్టువులను సూచిస్తుంది. సింహ రాశిలోకి సూర్యుడి సంచారం సమయంలో తులరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పని చేసే రంగంలో కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి సానుకూల సంకేతాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం రావొచ్చు. మీ జీవితంలో కూడా నూతన వ్యక్తులు వచ్చే అవకాశముంది. ఫలితంగా భవిష్యత్తులో మీకు లాభం వస్తుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి యొక్క పదో స్థానంలో సూర్యుడు రవాణా జరుగుతుంది. ఇది వ్యాపారం, కార్యాలయం, అధికారం, గౌరవం మొదలైన వాటిని సూచిస్తుంది. సింహరాశిలోకి సూర్యుడి ప్రవేశం జరిగే సమయంలో వృశ్చికరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పని పట్ల అంకితభావంతో ఉంటారు. ఈ కారణంగా మీ సీనియర్లను ఆకట్టుకుంటారు. ఈ సమయంలో మీకు కొన్ని కొత్త బాధ్యతలు కూడా రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంబంధాలు మెరుగుపడతాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి యొక్క తొమ్మిదో స్థానంలో సూర్యుడి సంచారం జరుగుతుంది. ఇది మతం, లక్కీ, సుదూర ప్రయాణాలను సూచిస్తుంది. సింహరాశిలోకి సూర్యుడి ప్రవేశం జరిగే సమయంలో ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. విద్యార్థులు కొంచెం కష్టపడితే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికంగా మీ ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ జీవితంలో మంచి ఫలితాలకు దారి తీస్తుంది.

మకర రాశి..

మకర రాశి..

సింహరాశిలోకి సూర్యుడి ప్రవేశం సమయంలో, ఈ రాశి యొక్క ఎనిమిదో స్థానంలో సూర్యగ్రహం ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది ఇల్లు, దీర్ఘాయువును సూచిస్తుంది. అయితే ఈ సమయంలో మీకు ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. మీరు కోరుకోకపోయినప్పటికీ, ఇల్లు లేదా కార్యాలయాన్ని మీరు మార్చాల్సి ఉంటుంది. ఇది ప్రకంపనలను తెచ్చిపెడుతుంది. అయితే వివాహితులకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీరు పురోగతి చెందుతారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశిలోని ఏడో స్థానంలో సూర్యుడి రవాణా జరుగుతుంది. ఇది మీ జీవిత భాగస్వామి మరియు జీవితంలో భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీరు ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీకు కష్టాలు తప్పవు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశిలోని ఆరో స్థానంలో సూర్యుడి రవాణా జరుగుతుంది. ఇది మీ ఇల్లు, శత్రువు, వ్యాధులు, కుటుంబం, తల్లి తదితర వాటిని సూచిస్తుంది. సింహరాశిలోకి సూర్యుడి ప్రవేశం సమయంలో మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మీరు సమాజంలో మంచి కీర్తి, ప్రతిష్టలను పొందుతారు. కోర్టులో సమస్యలు కూడా తొలగిపోతాయి.

Desktop Bottom Promotion