Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
Sun Transit in Pisces:మీనంలోకి సూర్యుడి రవాణా.. ఈ 4 రాశులకు శుభ ఫలితాలు...!
సూర్యుడు మీన రాశిలోకి రవాణా చేసే సమయంలో కొన్ని రాశుల వారికి వచ్చే సానుకూల మరియు ప్రతికూల ఫలితాల గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో సూర్యుడిని అధిపతిగా భావిస్తారు. ఎంతో గొప్ప విశిష్టత ఉన్న సూర్యుడు మార్చి 15వ తేదీన అంటే మంగళవారం నాడు తన స్థానాన్ని మారనున్నాడు. ఈరోజున కుంభ రాశి నుండి మీన రాశిలోకి మధ్యాహ్నం 12:16 గంలకు ప్రవేశించనున్నాడు.

ఇదే రాశిలో ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 8:43 గంటల వరకు నివాసం ఉండనున్నాడు. అనంతరం మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా సూర్యుడు, గురుడు ఎప్పుడైతే ధనస్సు లేదా మీనరాశిలోకి ప్రవేశిస్తారో, అప్పుడు కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.

మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి. అయితే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి కొన్ని నివారణలు పాటించాలి. ఈ సందర్భంగా సూర్యుడు కుంభం నుండి మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట. ఆ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసుకోండి...

మిధున రాశి..
మీనంలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో పాటు మీరు ఖరీదైన వస్తువులను కొంటారు. మీరు ఏదైనా సాధించగలరు. మీ పట్ల ఇతరులకు గౌరవం మరియు ప్రేమ పెరుగుతుంది. ఈ కాలంలో మీకు ఉద్యోగ, వ్యాపారాలలో ముందుకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తాయి. మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీకు చాలా సందర్భాల్లో ప్రతికూల ప్రభావాలు ఎదురుకావొచ్చు. కాబట్టి మీరు డబ్బు ఖర్చు పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పనిలో చాలా అడ్డంకులు మరియు సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే, ఈ సమయం మంచిగా ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులు కొత్త వ్యూహాలను అమలు చేయడం వల్ల కొంత ఫలితం ఉండొచ్చు. మీ కుటుంబం మీకు మద్దతు ఇస్తుంది.

తులా రాశి..
ఈ రాశి వారు సూర్యుడి రవాణా సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుంటారు. వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.ఉద్యోగులకు ఈ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయి. మీ సామర్థ్యం చాలా విలువైనదని సహచరులు నమ్ముతారు. వ్యాపారులు ఈ కాలంలో చాలా కష్టపడి పని చేయాలి. చట్టపరమైన సమస్యల్లో ఉన్న వారికి అనుకూలమైన తీర్పు వస్తుంది. మొత్తానికి సూర్యుడి రవాణా వల్ల ఈ రాశి వారికి ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్యుడి రవాణా వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు లక్ష్యాలను సాధించడానికి మరియు సమర్థవంతమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఈ కాలంలో మంచి లాభాలు రావొచ్చు. మీకు ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఈ కాలంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కువగా పనిలో మునిగిపోతారు. విద్యార్థులకు ఈ సమయం మంచిగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో సూర్యుడిని అధిపతిగా భావిస్తారు. ఎంతో గొప్ప విశిష్టత ఉన్న సూర్యుడు మార్చి 15వ తేదీన అంటే మంగళవారం నాడు తన స్థానాన్ని మారనున్నాడు. ఈరోజున కుంభ రాశి నుండి మీన రాశిలోకి మధ్యాహ్నం 12:16 గంలకు ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 8:43 గంటల వరకు నివాసం ఉండనున్నాడు. అనంతరం మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు.



Click it and Unblock the Notifications