Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వృశ్చికరాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఏ రాశుల వారికి అనుకూలమంటే...! ఏయే పరిహారాలు పాటించాలి..
వృశ్చికరాశిలోకి సూర్యుడి సంచారం వల్ల ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.
జ్యోతిష్యశాస్త్రం గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు నవంబర్ 16న తులరాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అని అంటారు.

ఇలాంటి సమయంలో సూర్యుడు బలంగా ఉంటే.. ఆ ప్రభావమంతా ద్వాదశ రాశులపై కచ్చితంగా పడుతుంది. దీని వల్ల మన జీవితంలో ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అంతటి శక్తివంతమైన ఈ సూర్య గ్రహం నవంబర్ 16వ తేదీ ఉదయం 6:40కు వృశ్చికరాశిలోకి అడుగుపెట్టి.. 2020 డిసెంబర్ 15 వరకు ఇదే రాశిలో నివాసం ఉంటాడు.

ఆ తర్వాత ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉండబోతోంది. సూర్యుడి సంచారం సమయంలో 12 రాశిచక్రాల వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..
సూర్యుడు వృశ్చిక రాశిలోకి అడుగు పెట్టే సమయంలో మేషరాశి నుండి ఎనిమిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉద్యోగులు ఏదైనా వివాదంలో చిక్కుకోవచ్చు. ఇలాంటప్పుడు మీరు ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. ఈ ఇబ్బందికరమైన దశను సులభంగా దాటేందుకు ఇది సహాయపడుతుంది. మీ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులు తమ అధ్యయనాలపై శ్రద్ధ చూపలేకపోతారు. ఇది మీ విద్యపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేయడం వల్ల శుభప్రయోజనాలు కలుగుతాయి.

వృషభ రాశి..
వృశ్చికరాశిలోకి సూర్యుడు సంచరించే సమయంలో ఈ రాశి నుండి ఏడో స్థానంలో ఉంటారు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు మాత్రం సీనియర్లు మరియు సహోద్యోగుల నుండి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య పరంగా అంతా సానుకూలంగా ఉంటుంది.
పరిహారం : సూర్యరశ్మి సమయంలో సూర్యుడికి నీటిని అర్పించండి.

మిధున రాశి..
సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశికి ఆరో స్థానంలో ఉంటాడు. ఈ సందర్భంగా ఆరోగ్య పరంగా మిధున రాశి వారికి మంచి ప్రయోజనాలు కలగొచ్చు. ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, సవాళ్లను సులభంగా అధిగమిస్తారు. మరోవైపు మీ శత్రువులపై కదలికలను అంచనా వేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా వెంచర్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది చాలా పవిత్రమైన సమయం.
పరిహారం : సూర్యోదయం సమయంలో ప్రతిరోజూ ‘ఆదిత్య హ్రుదయ' స్తోత్ర పారాయాణం చేయండి.

కర్కాటక రాశి..
వృశ్చికరాశిలోకి సూర్యుడు వెళ్లే సమయంలో ఈ రాశి నుండి ఐదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మీరు చాలా పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు మాత్రం కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఒత్తిడిని అధిగమించి పని చేస్తే, ఫలితం వస్తుంది. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
పరిహారం : ఆదివారం రోజున రాగిని దానం చేయాలి.

సింహ రాశి..
వృశ్చికరాశిలోకి సూర్యుడి సంచారం సమయంలో ఈ రాశి నుండి నాలుగో స్థానంలో ఉంటారు. ఈ సందర్భంగా సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కొంత నాణ్యమైన సమయాన్ని గడుపుతార. విహారయాత్రలు మరియు ఇంట్లో సభ్యులతో కలవడం వల్ల మీ బంధం మరింత బలోపేతమవుతుంది. ఏదేమైనా మీ తల్లి ఆరోగ్యం బలహీనంగా ఉండటంతో, మీకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు.
పరిహారం : ఆదివారం రోజున మీ ఉంగరపు వేలికి రూబీ రత్నాన్ని ధరిస్తు ప్రయోజనం ఉంటుంది.

కన్య రాశి..
సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించే సమయంలో కన్య రాశి నుండి మూడో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా బలం వస్తుంది. ఉద్యోగులు నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. ఆర్థిక పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. సూర్యుడి సంచారం సమయంలో మీరు చేపట్టే పనులన్నీ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాన్ని విద్యార్థులు మంచిగా ఉపయోగించుకుంటారు. విద్యావేత్తలు మంచి పనితీరును కనబరుస్తారు. వ్యాపారులకు మంచిగా ఉంటుంది.
పరిహారం : సూర్యోదయం సమయంలో ప్రతిరోజూ విష్ణు స్తోత్రం పఠించాలి.

తుల రాశి..
సూర్యుడు వృశ్చికరాశిలోకి అడుగు పెట్టే సమయంలో తులరాశి నుండి రెండో స్థానంలో ఉంటాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యులతో అనేక సమస్యలు ఏర్పడతాయి. అయితే ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ప్రయత్నించండి.
పరిహారం : ఆదివారం రోజున బెల్లం దానం చేయండి.

వృశ్చిక రాశి..
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈ రాశిలోకి అడుగుపెడుతుండటంతో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పెండింగ్ పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుని యొక్క ద్రుష్టి అంతా మీపై ఉంటుంది. ఈ ప్రభావంతో ఉద్యోగులు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. మీరు నమ్మకంగా, ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.
పరిహారం : ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు తండ్రి ఆశీర్వాదం తీసుకుంటే, శుభ ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..
సూర్యుడు వృశ్చికరాశిలోకి అడుగు పెట్టే సమయంలో ధనస్సు రాశి నుండి 12వ స్థానంలో ఉంటాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు, ఖర్చులు పెరగొచ్చు. అయితే దీంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఒంటరిగా గడిపితే మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులు ఈ సమయంలో కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ టార్గెట్లను సాధించాలంటే అనేక అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. వ్యాపారులు తమ లాభాలలో క్షీణతను చూడొచ్చు. ఈ టైమ్ లో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేయండి.

మకర రాశి..
సూర్యుడు ఈ రాశి నుండి 11వ స్థానంలో ఉన్నప్పుడు మకర రాశి వారికి చాలా పవిత్రమైన సమయం. ఈ కారణంగా మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న లాభాలను మరియు విజయాన్ని పొందే అవకాశం ఉంది. మరోవైపు మీకు ప్రభుత్వం లేదా సీనియర్ అధికారుల నుండి కొన్ని ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, ఆస్తి మరియు భూమికి సంబంధించిన వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఆరోగ్య పరంగా ఈ సమయం మెరుగ్గా ఉంటుంది.
పరిహారం : ఏదైనా ముఖ్యమైన పనికి బయలుదేరే ముందు మీ తండ్రి ఆశీర్వాదం తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి.

కుంభ రాశి..
వృశ్చికరాశిలోకి సూర్యుడు అడుగుపెట్టే సమయంలో కుంభ రాశి నుండి 10వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో నిరుద్యోగులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మంచి స్థానం కోసం ఎదురుచూస్తుంటే, అందుకు అవకాశాలను పొందొచ్చు. మీ సహోద్యోగులు కూడా ఆఫీసులో మీకు మద్దతు ఇస్తారు. వ్యాపారులు ఈ సమయంలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేస్తారు. వ్యక్తిగతంగా కుటుంబాలతో మంచి సమయం ఉంటుంది. ఈ కాలంలో మీ స్నేహితులు మరియు సహచరులు మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు మంచిగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో ‘రామ రక్ష స్తోత్రం' పఠించండి.

మీన రాశి..
సూర్యుడు ఈ రాశి నుండి తొమ్మిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీన రాశి వారు ఆధ్యాత్మికతకు సంబంధించి సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మీకు మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా విద్యలో రాణిస్తారు. విద్యార్థులు ప్రభుత్వ లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఫలితం అనుకూలంగా రావచ్చు. మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మరోవైపు ఈ సమయంలో మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈ కాలంలో ప్రయోజనం పొందడమే కాదు.. కష్టపడి పని చేస్తారు. వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో ‘సూర్య అష్టకం' పఠించండి.



Click it and Unblock the Notifications











