Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Sun Transit in Taurus: వృషభంలోకి సూర్యుడి ఎంట్రీ.. ఈ 4 రాశులకు ప్రత్యేకం... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!
సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు మే 14వ తేదీన, అంటే శుక్రవారం నాడు మేషరాశి నుండి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు.

మే 14వ తేదీ ఉదయం 11:15 గంటల సమయంలో మేష రాశి నుండి నిష్క్రమించి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. సుమారు నెలరోజుల పాటు సంచారం అంటే జూన్ 15వ తేదీ ఉదయం 5:49 గంటల వరకు ఇక్కడే ఉండనున్నాడు.

అనంతరం మిధున రాశిలోకి రవాణా చేయనున్నాడు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సూర్యుడు మేషరాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయట. అందులోనూ నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందట. ఇంతకీ ఆ రాశులేవీ.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

వృషభ రాశి..
సూర్యుడు మేష రాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం మీకు సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రభావం వల్ల, మీరు ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నత స్థానం లభిస్తుంది. మరోవైపు మీ ప్రేమ వ్యవహారం గురించి ఓ శుభవార్త వింటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు లేదా షాపింగ్ చేయొచ్చు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

సింహ రాశి..
ఈ రాశి నుండి సూర్యుడి రవాణా పదో పాదం గుండా జరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ రంగంలో గొప్ప ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో కోరుకున్న ప్రమోషన్ గురించి ఓ శుభవార్త వినిపిస్తుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. మీరు కొత్త కారు కొనేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కూడా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. మొత్తం మీద ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి సూర్యుడు వృషభరాశిలోకి ఆరో స్థానం నుండి రవాణా చేయడం వల్ల ధనస్సు రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. అలాగే ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలుంటే.. మీకు వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు ఈ కాలంలో మీరు అనేక అప్పులను తిరిగి చెల్లిస్తారు. వివాహితులు ఈ సమయం కొన్ని శుభవార్తలు వింటారు. మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని గురించి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగం మార్చడానికి ఇది చాలా ఉత్తమ సమయం.

మీన రాశి..
ఈ రాశి నుండి సూర్యుడి రవాణా మూడో స్థానం నుండి జరుగుతుంది. ఈ కారణంగా మీన రాశి వారికి ధైర్యం మరియు శక్తి రెండూ పెరుగుతాయి. ఈ కాలంలో మీరు పనులన్నీ మంచి ప్రణాళికతో పూర్తి చేస్తారు. దీంతో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మరోవైపు మీరు తల్లిదండ్రుల సహకారంతో కూడా పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ సమయంలో విపరీతమైన లాభాలు రావొచ్చు. వివాహం కోసం ప్రయత్నించే వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. మీరు బంగారం మరియు వెండి గురించి షాపింగ్ చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో గొప్పగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయంలో ఊహించిన మార్పులు వస్తాయి. మీరు కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశం రావొచ్చు. లేదా మీరు ప్రమోషన్ పొందొచ్చు.



Click it and Unblock the Notifications
