Latest Updates
-
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
Surya Rashi Parivartan 2021:ధనస్సులోకి సూర్యుడి రవాణా.. ఈ 4 రాశులకు అద్భుత ప్రయోజనాలు...!
2021 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు దక్కనున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు లేనిదే ఈ లోకానికే వెలుగు అనేదే ఉండదు. అందుకే సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. అందుకే సూర్యుని స్థానం ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటుందో.. అలాంటి వ్యక్తులు తమ పనికి సంబంధించిన ప్రయత్నాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. అదే విధంగా సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తులకు సమాజంలో గౌరవం దక్కుతుంది.

ఈ నేపథ్యంలో సూర్యుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన గురువారం నాడు తెల్లవారుజామున 3:28 గంటలకు ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో జనవరి 14వ తేదీ 2022 మధ్యాహ్నం 2:29 గంటల వరకు సంచారం చేయనున్నాడు.

ఈ సమయంలో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. అయితే ఈ సమయంలో నాలుగు రాశుల వారికి సూర్యుని సంచారం వల్ల శుభ ఫలితాలు కలగనున్నాయట. ముఖ్యంగా ఉద్యోగం, ఆదాయం, వ్యాపారం విషయంలో పురోగతి సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఇంతకీ ఆ నాలుగు రాశులేవీ.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా సొమ్మును ఆదా చేస్తారు. మరోవైపు మీకు సమాజంలో గౌరవం మరియు ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీరు ఈ కాలంలో తీర్థయాత్రలను ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా మతపరమైన పనిలో నిమగ్నమై ఉంటారు. మీ పిల్లలు మీతో కొన్ని శుభవార్తలను పంచుకుంటారు. వ్యాపారులు కొత్త వెంచర్లు మరియు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టొచ్చు. మీ వ్యక్తిగత సంబంధాలు మంచిగా ఉంటాయి. మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
పరిహారం : మీరు ప్రతిరోజూ ఆవుకు బెల్లం మరియు గోధుమ రొట్టెలు తినిపిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మిధున రాశి..
ధనస్సు రాశిలోకి సూర్యుని సంచారం కారణంగా, ఈ రాశిలోని నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశం లభిస్తుంది. ఈ కాలంలో మీరు చాలా శుభవార్తలు వింటారు. మరోవైపు మీరు ఈ కాలంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు చాలా శక్తితో నిండి ఉంటారు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో గొప్ప బంధాన్ని ఏర్పరచుకుంటారు. పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు కొత్త పనులు కూడా ప్రారంభించొచ్చు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసుకుంటారు. అయితే మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ రాగి పాత్రలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే శుభఫలితాలొస్తాయి.

కర్కాటక రాశి..
ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి ఉద్యోగులకు, వ్యాపారులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు శత్రువులను కూడా ఓడిస్తారు. అంతేకాదు ప్రత్యర్థులపైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మరోవైపు ఈ కాలంలో ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం మంచిగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలొస్తాయి.

సింహ రాశి..
ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం కారణంగా, ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో వ్యాపారులు ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో విద్యార్థులకు శుభఫలితాలు రానున్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు. ఈ సమయంలో వారు తమ ఆశయాలపై పని చేస్తారు. ఉద్యోగులు కూడా ఈ కాలంలో విజయం సాధిస్తారు.
పరిహారం : ప్రతిరోజూ సూర్యభగవానుడిని పూజిస్తే, శుభ ఫలితాలొస్తాయి.
సూర్యుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన గురువారం నాడు తెల్లవారుజామున 3:28 గంటలకు ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో జనవరి 14వ తేదీ 2022 మధ్యాహ్నం 2:29 గంటల వరకు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో 4 రాశుల వారికి ధన లాభం ఉంటుందట.



Click it and Unblock the Notifications
