For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగు వెలుగును పెంచిన గిడుగు రామ్మూర్తి..

గిడుగు పూర్తి పేరు గిడుగు వెంకట రామమూర్తి. ఈయన 1863లో శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేట గ్రామంలో వీరరాజు, వెంకయమ్మలకు జన్మించారు. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకున్నారు.

|

వాడుక భాష కోసం వేశాడు గిడుగు తొలి అడుగు..
తర్వాత పట్టాడు తెలుగుకు గొడుగు..
వ్యావహారిక భాష కోసం వేశాడు పిడుగు..
అచ్చ తెలుగుకోసం చిత్తశుద్ధితో కృషి చేసిన చిచ్చర పిడుగు..
ఆ మధ్యలోనే ''అభినవ వాగమశాసనుడి''గా బిరుదు పొందాడు ..
అధికార, పరిపాలన భాషకు గిడుగే మూలకారకుడు..
ఆధునిక ప్రమాణ భాషకు మార్గదర్శకుడు..

Telugu Language Day

తెలుగు భాషా దినోత్సవం అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు పిడుగు లాంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి పేరు. నలభై ఏళ్లకు పైగా గ్రాంథికవాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టిన మహనీయుడు తెలుగు సాహిత్యం అందరికీ అందుబాటులోకి రావాలంటే మాట్లాడుకునే భాషలోనే రచనలు సాగించాలన్నది ఆయన వాదన. అంతే కాదు బోధన భాషగా కూడా వ్యావహారిక భాషగా ఉండాలన్నది ఆయన ఆశ. అందుకోసమే ఆయన తన జీవితాన్ని సైతం త్యాగం చేశారు. అలాంటి గొప్పనేత పుట్టినరోజును ప్రతిరోజూ ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటారు. ఆయన జన్మదినాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. అలాంటి మహనీయుడు గురించి.. ఆయన తెలుగు భాషా కోసం చేసిన ఉద్యమం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గిడుగు వారి చరిత్ర..

గిడుగు పూర్తి పేరు గిడుగు వెంకట రామమూర్తి. ఈయన 1863లో శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేట గ్రామంలో వీరరాజు, వెంకయమ్మలకు జన్మించారు. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకున్నారు. ఈయన తండ్రి చనిపోయిన కారణంగానే మెట్రిక్యులేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ ఉద్యోగంలో చేరారు. వివాహం పూర్తయి ఉద్యోగం చేస్తున్నా కూడా ప్రైవేటుగా చదువుకుని ఇంటర్మీడియట్ పాసయ్యారు. 1890లో బిఏ హిస్టరీలో ఉత్తీర్ణత సాధించడంతో లెక్చరర్ గా మారారు. ఆయన మూఢనమ్మకాలను, దూరాచాలను అసలు ప్రోత్సహించే వారు కాదు. హరిజన వాడలకు స్వయంగా వెళ్లి మరీ పాఠాలు చెప్పడమే కాకుండా గిరిజన సాహిత్యాన్ని సేకరించిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచన రచనలకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్య జనానికి అర్థం కాదనీ ఆనాడే కరాఖండిగా చెప్పిన తొలి వ్యక్తి. సామాన్య జనానికి తెలుగు అర్థం కావాలంటే సమకాలనీ ''శిష్ట వ్యావహారికంలో ఉండాలని పండితులతో హోరాహోరీగా పోరాడిన మహోన్నతుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అలా వారితో పోరాడి విజయం సాధించి ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడయ్యాడు.

గిడుగు వారి విజయాలు..

ఈయన భాష ఉద్యమం చేయడం వల్ల తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కింది. రచనా వైవిధ్యం, వైశిష్ట్యంతో నేటికీ విశ్వవిద్యాలయాల్లో వాడుక భాష సగర్వంగా రాజ్యమేలుతోంది. పత్రికలు సైతం పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. తెలుగు భాష అధికార భాష, పరిపాలన భాషగా కీర్తి కెక్కింది. వీటన్నింటిని మూలకారకుడు మన గిడుగు రామ్మూర్తే. 1913లోనూ ప్రభుత్వం రావు సాహెబ్ అనే బిరుదు ఇచ్చింది. ఈయన రచనలు, ఉద్యమాలకు మెచ్చిన ప్రభుత్వం 1934లో కైజర్ ఎ హింద్ అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. తర్వాత 1938లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు ''కళాప్రపూర్ణతో'' గౌరవించింది. అనంతరం 1940 జనవరి 22న గిడుగు రామ్మూర్తి తుదిశ్వాస విడిచారు.

తెలుగంటే అమ్మదనం..
తెలుగంటే తియ్యదనం..
తెలుగంటే కమ్మదనం..
తెలుగంటే మూలధనం..
తెలుగంటే పెరుగన్నం..
తెలుగంటే గోంగూర..
తెలుగంటే గోదారి..
తెలుంగంటే గొబ్బిళ్లు..
తెలుగంటే గుత్తి వంకాయ..
తెలుగంటే కొత్త ఆవకాయ..
తెలుగు జాతి ప్రేమ, జాలి, అభిమానం..
తెలుగంటే యమకారం..
తెలుగంటే మమకారం..
తెలుగంటే సంస్కారం..
తెలుగంటే కొంచెం వెటకారం..
ఇవేకాక ఇంకా ఎన్నింటి గురించో
గొప్పగా తెలిపేదే తెలుగు జాతి గొప్పదనం..

ఈ పదాలు వింటుంటే ఈ పాటికే ఇవి ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదూ. ఇవి ప్రముఖ సినీ గేయ రచయితలు సృష్టించిన పదాలు..ఈ పదాలు వింటుంటే ఒల్లు పులకరిస్తుంది. ఇలాంటి వాటికోసమే పోరాడిన వ్యక్తి పిడుగు లాంటి వ్యక్తి గిడుగు..

English summary

Telugu Language Day 2019: Date, History and Significance

Telugu Language Day is the name of the thunderbolt-like umbrella rammoorthy lines that give us a touch. He has argued that for more than forty years, Mahanayudu, who has fought with the pantheists and has adopted a colloquial language, should make Telugu literature accessible to all in the spoken language. He also hopes that the language of instruction should also be pragmatic. That is why he sacrificed his life. Such a great birthday is celebrated every day on the 29th of August.
Desktop Bottom Promotion