Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మీ రాశిని బట్టి వీటిని మీరు బాగా ఇష్టపడతారట...!
మీ రాశిని బట్టి మీకెలాంటి అలవాట్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో ప్రతి ఒక్కరికీ చిన్నప్పటి నుండి ఏవో కొన్ని అలవాట్లు అనేవి ఉంటాయి. కొందరికి చదవడమంటే ఇష్టం.. మరికొందరు బాగా నిద్రపోవడాన్ని ఇష్టపడతారు.

ఇంకొందరికి ఆడటమంటే ఇష్టం.. మరికొందరికి ఎప్పుడూ రిస్క్ చేయడం బాగా అలవాటుగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికీ కొన్ని విభిన్నమైన అలవాట్లు, అభిరుచులు ఉంటాయి.

అయితే ఎవరెవరికి ఎలాంటి పనులంటే బాగా ఇష్టపడతారో తెలుసుకోవడం కొంచెం కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల ఆధారంగా, మీ రాశిచక్రాలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని, అలవాట్లు, అభిరుచుల గురించి తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా 12 రాశుల వారికి ఏయే అలవాట్లు, అభిరుచులు మంచిగా ఉంటాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడాలని కోరుకుంటారు. వీరు ఎక్కువగా ఆటలపై శ్రద్ధ చూపుతారు. అదే సమయంలో బైక్ రైడింగ్, లాంగ్ డ్రైవ్ వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రతి పనిని ప్రణాళిక ప్రకారం చేస్తంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారికి చాలా ప్రతిభ ఉంటుంది. వీరు ఎక్కువగా నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వీరు అందరికంటే విభిన్నంగా ఆలోచిస్తారు. వీరికి సంగీతం వినడం, డ్రాయింగ్ వేయడం వంటి పనులు వీరికి బాగా నచ్చుతాయి.

మిధున రాశి..
ఈ రాశి వారు అనునిత్యం నూతన విషయాలను తెలుసుకునేందుకు ఇష్టపడతారు. వీరు తమ జీవితంలో జీవిత భాగస్వామి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వీరికి కూడా ఆటలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు కొత్త లాంగ్వేజ్, కొత్త విషయాలను నేర్చుకోవడమంటే ఇష్టం.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి ఇంటి పనులు చేయడమంటే బాగా ఇష్టం. ఇంటి పనితో పాటు వ్యవసాయం చేయడం వంటి పనులు బాగా నచ్చుతాయి. సెలవు దినాల్లో లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం, టూర్లకు వెళ్లడమంటే బాగా ఇష్టపడతారు. ఫ్రీ టైమ్ లో ఎక్కువ ఎక్సర్ సైజ్ చేస్తుంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు ఎల్లప్పుడూ అందరి కంటే డిఫరెంట్ గా ఉండేందుకు ఇష్టపడతారు. అంతేకాదు, ఎక్కువగా ఎదుటివారిని ఇష్టపడతారు. అందరితో హ్యాపీగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. అంతేకాదు వీరు డ్యాన్స్ చేయడం, డ్రాయింగ్ వేయడంతో పాటు డెకరేషన్ చేయడం వంటి పనులు వీరికి బాగా నచ్చుతుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి వ్యవసాయం చేయడం అంటే బాగా ఇష్టం. వీరు ఎల్లప్పుడూ చెట్లను పెంచడం వంటి పనులు చేస్తుంటారు. వీరికి యానిమేషన్, గ్రాఫిక్స్ వంటి వాటిని బాగా ఇష్టపడతారు.

తుల రాశి..
ఈ రాశి వారు ఈవెంట్ షోలు చేయాలని.. అందరినీ తమ ప్రదర్శనతో అలరించాలని భావిస్తారు. అందుకు తగ్గట్టే వీరు సిద్ధమవుతుంటారు. డ్రాయింగ్ వేయడం అంటే వీరికి బాగా ఇష్టం.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు అందరికంటే విభిన్నంగా ఆలోచిస్తారు. వీరికి వ్యాపారం చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు అందరి కంటే డిఫరెంట్ గా పనులు చేయాలని ఆలోచిస్తుంటారు. వీరికి ఆటలాడటం, రత్నాలు సేకరించడం, మ్యూజిక్ వినడం వంటి పనులు వీరికి బాగా నచ్చుతాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి జర్నీ చేయడం అంటే బాగా ఇష్టం. ట్రావెల్ చేసే సమయంలో పుస్తకాలు చదవడం హాబీగా పెట్టుకుంటారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలని తహతహలాడుతూ ఉంటారు.

మకర రాశి..
ఈ రాశి వారికి సైలెంట్ గా ఉండటం అంటే చాలా ఇష్టం. మీ ఇళ్లు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. మీరు విలువైన వస్తువులు సేకరిస్తూ ఉంటారు. వీరికి జర్నీ చేయడం అంటే బాగా ఇష్టం.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఎప్పుడూ చదువుకోవడానికి ఇష్టపడతారు. వీరు పజిల్స్ పూర్తి చేయడం వంటి వాటిని చేస్తుంటారు. మంచి కథలు రాయడం, చెప్పడం లేదా చదవడం వంటివి ప్రతి రాత్రి పూర్తి చేస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారికి పుస్తకాలను చదవడం.. పాటలకు డ్యాన్స్ వేయడం.. సినిమాలు చూడటం.. వంట చేయడం.. వంటి పనులను బాగా ఇష్టపడుతుంటారు. వీటితో పాటు లాంగ్ జర్నీ చేయడం, మొక్కలు పెంచడం అంటే బాగా ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications
