Latest Updates
-
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది!
Chanakya Niti: భార్యాభర్తలు చేసే ఈ తప్పులు సంబంధాన్ని నాశనం చేస్తాయి
చాణక్యుడు దాంపత్య బంధం గురించి చెబుతూ కొన్ని సూచనలు చేశాడు. భార్యాభర్తులు చేసే కొన్ని తప్పులు వారి సంబంధాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించాడు ఆచార్య చాణక్యుడు. చాణక్యుడు చెప్పిన ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప తత్వవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త, మార్గదర్శకుడు. మనిషి జీవితం సాఫీగా సాగడానికి, తలపెట్టిన పనిలో విజయవంతం కావడానికి, నలుగురికి ఆదర్శంగా నిలవడానికి చాణక్యుడు పలు సూచనలు చేశాడు. వాటిని తూచా తప్పకుండా పాటించే వారు తమ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు.

చాణక్యుడు దాంపత్య బంధం గురించి చెబుతూ కొన్ని సూచనలు చేశాడు. భార్యాభర్తులు చేసే కొన్ని తప్పులు వారి సంబంధాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించాడు ఆచార్య చాణక్యుడు. చాణక్యుడు చెప్పిన ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కమ్యూనికేషన్ లేకపోవడం:
చాలా మంది దంపతులు చేసే తప్పు.. తమ భాగస్వామితో తమ భావాలను, అభిప్రాయాలను స్పష్టంగా పంచుకోకపోవడం. మీరు మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయనప్పుడు, అది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఆ గ్యాప్ అపార్థాలకు దారి తీస్తుంది. దీని వల్ల మరింత దూరం పెరిగి అది చివరికి విడిపోయే వరకు వెళ్తుంది. అందుకే మీరేం అనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పాలని చాణక్యుడు చెప్పాడు.

గౌరవం ఇవ్వకపోవడం:
దంపతులు ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. ఒకరిని ఒకరు కించపరుచుకోవడం, అవమానించుకోవడం వల్ల అభిప్రాయం దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన సంబంధానికి గౌరవం పునాది వంటిది. ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనై ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని చాణక్యుడు చెప్పాడు.

తేలికగా తీసుకోవడం:
సంబంధంలో రోజులు గడిచే కొద్దీ భాగస్వామిని తేలికగా తీసుకుంటుంటారు. ఏదైనా మంచి పని చేసినా ప్రశంసించడం, పొగడటం లాంటి పనులు చేయరు. కృతజ్ఞత చెప్పరు, క్షమాపణ అడగరు. దీని వల్ల ఒకరు ఒకరిని నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపిస్తుంది. అది రోజులు గడిచే కొద్దీ పెరిగిపోతుంది. అందుకే సంబంధంలో భార్యాభర్తలను నిర్లక్ష్యం చేయకూడదని చాణక్యుడు చెప్పాడు.

సాన్నిహిత్యాన్ని విస్మరించడం:
సంబంధంలో సాన్నిహిత్యం చాలా కీలకం. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటం చాలా ముఖ్యం. చేసే ప్రతి పనిలో రొమాంటిక్ గా ఉండటం కూడా అవసరమే. దీని వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది, దాని వల్ల బంధం బలోపేతం అవుతుందని ఆచార్య చాణక్యుడు సూచించాడు. సమయం లేకనో, ఒత్తిడి వల్లో భాగస్వామికి దూరంగా ఉండటం వల్ల సంబంధం బీటలు వారుతుందని చెప్పాడు చాణక్యుడు.

పగ పెంచుకోవడం:
దాంపత్య బంధంలో తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనిషి అన్నతర్వాత తప్పులు చేయకుండా ఉండరు. తెలిసో, తెలియకో తప్పులు జరగడం సాధారణం. ఏదైనా తప్పు జరిగినప్పుడు రాజీ పడటం కీలకం. అడ్జస్ట్ కాకపోతే సమస్య పెద్దదవుతుంది. గొడవ జరిగినప్పుడు, కలహా అయినప్పుడు ఎవరో ఒకరు రాజీ పడటం చాలా కీలకం. అలా కాకుండా కోపం, పగ పెంచుకుంటే బంధం చీలిపోతుంది.
ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగించడానికి ఇద్దరి వైపు నుండి కొంత ప్రయత్నం అవసరం. కలిసి ఉండటానికి, సాన్నిహిత్యం పెంచుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. భావాలను, భావోద్వేగాలను స్పష్టంగా చెప్పాలి, ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, సాన్నిహిత్యాన్ని విస్మరించొద్దు, రాజీ పడాలి వీటి వల్ల సంబంధం బలోపేతం అవుతుంది.



Click it and Unblock the Notifications
