For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వస్తువులు మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు..!

మీ ఇల్లు లేదా కార్యాలయం వెలుపల రాళ్లు ఉంటే వాటిని కూడా వెంటనే వేరే చోటుకు తరలించండి. మీ ఇంట్లోని వారు లేదా ఇతరులు ఎవరైనా సరే రాళ్లు సేకరించకుండా చూసుకోండి.

|

మన దేశంలో ఇప్పటికీ వాస్తు శాస్రం కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని శతాబ్దాల కాలం నాటి నుండే వాస్తు శాస్త్రం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇది పురాతన కాలం నాటిదే అయినా నేటికీ దీని ప్రాధాన్యత ఏ మాత్రం చెక్కు చెదరలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇల్లు లేదా ఆఫీసు లేదా హోటల్, రెస్టారెంట్ వంటి వాటితో పాటు ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ముందుగా సంప్రదించేది వాస్తు శాస్త్రాన్నే. ఇప్పటికీ ఇళ్లలో నివసించే ఆడవారు పూజారులను, పండితులను, లేదా టెలివిజన్లలో వచ్చే వాస్తు వివరాలను ఫాలో అవుతూనే ఉంటారు.

These Things In Your Home

ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారు ఆ శాస్త్రంలో ఏది ఉంటే అది తూచ తప్పకుండా పాటిస్తారు. ఇది మనం నివసించే ఇంటి నుండి స్కూలు, కాలేజీ, ఆఫీసు వరకు ఏయే వస్తువులను ఎక్కడ ఉంచాలి, ఏయే వస్తువులను ఎక్కడ ఉంచాలో సరిగ్గా చూపుతుందని చాలా మంది నమ్ముతారు. మీరు ఏ దిక్కున తలుపులు పెట్టుకోవాలి. ఏ దిశలో కిటికీలు ఉంచాలి. మీ ఇంట్లో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు వంటి వాటినన్నింటిని తెలియజేస్తుంది. ఇక విషయానికొస్తే ఇదే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో గానీ లేదా ఆఫీసులో కింది వస్తువులుంటే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరని, మిమ్మల్ని ఎప్పటికీ పేదవారిగానే చేస్తుందని చెబుతుంది. ఈ వివరాలు తెలియాలంటే కిందికి స్క్రోల్ చేయండి.

మురికి నీరు..

మురికి నీరు..

మీ ఇంట్లో లేదా మీ ఇంటి చుట్టూ మురికి నీరు లేకుండా చూసుకోండి. ఒక వేళ మీ ఇంటి దగ్గర మురికి నీరు నిల్వ ఉంటే అది మీకు కీడు కలిగిస్తుంది. మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తికి దారి తీస్తుంది. దీని వల్ల మీకు తీవ్ర నష్టం వాటిల్లొచ్చు.

ముళ్లు..

ముళ్లు..

మీ ఇల్లు లేదా కార్యాలయంలో ముళ్లు ఉండే మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదని వాస్తు శాస్త్రంలో నిర్వచించబడింది. ఒకవేళ ఇలాంటివి ఉంటే వెంటనే వాటిని తొలగించండి. ఎందుకంటే ఇవి మీ దగ్గర ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు కలుగుతాయంట. అంతేకాకుండా మీ ఇంట్లో వివాదాలకు కూడా కారణమవుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

రాళ్లు..

రాళ్లు..

మీ ఇల్లు లేదా కార్యాలయం వెలుపల రాళ్లు ఉంటే వాటిని కూడా వెంటనే వేరే చోటుకు తరలించండి. మీ ఇంట్లోని వారు లేదా ఇతరులు ఎవరైనా సరే రాళ్లు సేకరించకుండా చూసుకోండి. ఒకవేళ మీ ఇంటి బయట రాళ్లు ఉంటే అది సమస్యలకు దారి తీస్తుందట. అంతేకాదు మీ కుటుంబ పురోగతికి సైతం ఆటంకం కలిగిస్తుంది.

ఇంటి వెలుపల చెత్త..

ఇంటి వెలుపల చెత్త..

మన దేశంలో చాలా మందికి చెత్తను ఇంటి బయట ఉంచే అలవాటు ఉంది. ఎందుకంటే ఇంట్లోని చెత్తను అంతా శుభ్రపరిచి వారు దానిని ఇంటిబయట ఒక మూలన పడేస్తారు. అలా ఆ చెత్తను బయటపెట్టడం వల్ల చెడు జరుగుతుందట. అంతేకాదండోయ్ ఈ చెత్త వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వస్తాయట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రుణ మొత్తాన్ని కూడా ఇది పెంచుతుందట. సో తస్మాత్ జాగ్రత్త.

ఎలక్ట్రికల్ వస్తువులు..

ఎలక్ట్రికల్ వస్తువులు..

మీ ఇంటి దగ్గరలో విద్యుత్ పరికరాలు కలిగి ఉండటం మీరు సాధారణంగా భావిస్తే పొరబడినట్లే. ఇది ప్రమాదకరమైనది కాదు అని అనుకుంటే మీరు తప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే వైరింగులోని వైర్ మాదిరిగానే, మీ ఇంటి ముందు వైరింగ్ మీ జీవితాన్ని క్లిష్టతరం చేస్తుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తుంది. అందుకనే దాని పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త వహించండి.

పెద్ద పెద్ద చెట్లు..

పెద్ద పెద్ద చెట్లు..

సాధారణంగా పెద్ద పెద్ద చెట్లు మన ఇంటి వెలుపల ఉండటం మంచిదే. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా దురదృష్టకరంగా ఉంటుందట. ఎందుకంటే ఈ చెట్లు మన ఇంటికి సూర్యరశ్మి రాకుండా చేస్తాయట. ఇది మీ ఇంటికి వచ్చే సానుకూల శక్తిని కూడా నిరోధిస్తుంది. అందుకే పెద్ద చెట్లు లేకుండా జాగ్రత్త వహించండి..

మీ డోర్ ఎప్పుడూ ఒకేస్థాయిలో ఉండాలి..

మీ డోర్ ఎప్పుడూ ఒకేస్థాయిలో ఉండాలి..

మీ డోర్ ఎప్పుడూ ఒకేస్థాయిలో కలిగి ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. లేదా ప్రధాన రహదారి కంటే తక్కువగా ఉండాలని చెబుతోంది. ఒకవేళ అలా లేకపోతే మీ ఇంట్లో మరియు మీ జీవితంలో చాలా ఇబ్బందులను, ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఒకవేళ మీ తలుపు అలాగే నిర్మించబడి ఉంటే దాన్ని సరిచేసుకోండి.

English summary

These Things In Your Home or Office That Making You Poor

According to Vastu these things in in your home or office that are making your poor.
Story first published:Thursday, September 26, 2019, 19:06 [IST]
Desktop Bottom Promotion