For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జోతిష్యం ప్రకారం పార్టీలలో ఏ ఏ రాశుల వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీకు తెలుసా?

|

ఒక పార్టీలో మొత్తం మీరే అయి నడిపించడానికి ఇష్టపడుతారా ? లేక డాన్స్ లేదా డ్రింక్ స్కిప్ చేసి, ముభావంగా ఉంటూ తప్పించుకుని తిరుగుతూ ఉంటారా ?. మన నిజ స్వరూపాలు మరియు మన వ్యక్తిత్వాలు ఏవిధంగా ఉన్నాయో వెల్లడించేటప్పుడు జ్యోతిష శాస్త్రం ఒక గొప్ప సాధనంవలె పనిచేస్తుందని చెప్పబడుతుంది. మీ రాశి చక్రం దృష్ట్యా అవసరమైన జాతక సమాచారాన్ని పొందడంతోపాటుగా, పార్టీలో మీరు ఏవిధంగా ఉన్నారో తెలుసుకోండి. ప్రతి నక్షత్రం గుర్తుపై మా విశ్లేషణ ఎంత ఖచ్చితత్వాన్ని కూడుకుని ఉంటుందో చూసి ఆశ్చర్యపోకతప్పదు!

పార్టీలో ప్రతి రాశిచక్రం ఎలా ఉంటుంది?

ఇక్కడ ఈ 12 రాశి చక్రాలకు 'పార్టీ’ అనే పదం విభజించబడి వివరించబడింది. కొన్ని జాతక చిహ్నాలు పని వేళలతో కూడుకుని ఉన్న కఠినమైన వారం తర్వాత వారంతంలో పార్టీలు, లేదా ఇష్టమైన కార్యకలాపాలలో నిమగ్నమవడానికి పూనుకుంటూ ఉంటాయి. మీరు వారిలో ఒకరిగా ఉన్నారా? లేక ఇటువంటి పార్టీలకు, డాన్సులకు దూరంగా విశ్రాంతి కోసం సమయం కేటాయించే వారిలా ఉన్నారా ?. పార్టీలు అనుసరించడం కొంతమందికి మానసిక సంతోషానికి వెసులుబాటుగా ఉన్న మార్గం. అయితే అది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పార్టీలు ఒక చెత్త పీడకలగా ఉండొచ్చు.

This Is How Your Zodiac Sign Acts At A Party

ప్రతి రాశిచక్రం పార్టీలో ఎలా పనిచేస్తుంది ?

మీరు క్లబ్‌కి వెళ్లడాన్ని ఇష్టపడుతున్నారా లేదా మీ రాశిచక్రం దృష్ట్యా మీకు ఇష్టమైన స్ట్రీమింగ్ సర్వీసులలో(నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ మొదలైనవి) సిరీస్‌ను చూస్తూ మంచం మీదనే ఉండేందుకు ఇష్టపడుతున్నారా? ప్రతి రాశి చక్రం యొక్క భిన్న వ్యక్తిత్వ విధానాలకు ధన్యవాదాలు తెలుపుకొనక తప్పదు. మీరు తదుపరి పార్టీకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏ జాతక చిహ్నానికి చెందినవారో మీరు సులభంగా గుర్తించగలరు. పార్టీ మూడ్‌లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే పార్టీలో మీ రాశిచక్రం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

పార్టీలలో ప్రతి రాశి చక్రానికి సంబంధించిన వ్యక్తులు ప్రవర్తించే విధానం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి.

మేష రాశి (మార్చి 21 - ఏప్రిల్ 19)

మేష రాశి (మార్చి 21 - ఏప్రిల్ 19)

ఆలస్యంగా ఇంటికి రావడం, స్నేహితులతో కలిసి డ్రింక్ చేయడం వంటి చర్యలతో పార్టీ అంతటా మీరే అన్నట్లు ఉంటారు. ఫోటో షాట్లు తీయడం, స్నేహితులతో కలిసి నృత్యం చేయడం మరియు మీకన్నా ఎక్కువగా కనపడాలని ప్రయత్నించే మీమాజీతో పోటీపడడం మొదలైన ఎన్నో అంశాలను మీరు పార్టీలో కనుగొంటారు. క్రమంగా ఇది బోరింగ్ రాత్రి అని మీరు చెప్పలేరు.

వృషభ రాశి (ఏప్రిల్ 20 - మే 20) :

వృషభ రాశి (ఏప్రిల్ 20 - మే 20) :

వృషభం, మీరు ఇంకా సరసాలాడని వారు మొత్తం గదిలో ఎవరైనా ఉన్నారా? మీరు నడుచుకుంటూ, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, ప్రతి ఒక్కరినీ నవ్విస్తూ పార్టీలో జోష్ నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

మిధున రాశి (మే 21 - జూన్ 20) :

మిధున రాశి (మే 21 - జూన్ 20) :

మీరు ఈ రాత్రి పార్టీకి జీవం పోసే వ్యక్తిగా ఉంటారు. గదిలో ఎవరూ మిమ్మల్ని చూడకుండా ఉండలేరు - లేదా గదిలో ప్రతి ఒక్కరూ మీగురించి మాట్లాడకుండా ఉండలేరు. మీ వస్త్రధారణ నుండి, మీ నృత్యం వరకు ప్రతిదీ మీ శైలిని, శ్రద్ధను కనపరచేవిగా ఉంటాయి. పార్టీ మీకోసమే అన్నట్లుగా మీ వ్యవహార శైలి ఉంటుంది.

కర్కాటక రాశి (జూన్ 21 - జూలై 22)

కర్కాటక రాశి (జూన్ 21 - జూలై 22)

కర్కాటక రాశి, మీ కోసం మాకు కొంత బ్యాకప్ అవసరం. మీకు డ్రింక్ అలవాటు ఉంటే, ఎక్కువగా డ్రింక్ చేసి, ఎక్కడైనా కూర్చుని, ప్రాపంచిక లేదా ఇతరత్రా విషయాల గురించిన చర్చలు జరపడం, కొన్ని విషయాలను తలచుకుని బాధ పడడం పరిపాటిగా ఉంటుంది. అయితే ఇటువంటి చర్యల ద్వారా కూడా మీరు మంచి అనుభూతిని పొందగలరు. క్రమంగా వారాన్ని తాజాగా ప్రారంభించడానికి సన్నద్దులై ఉంటారు.

సింహ రాశి (జూలై 23 - ఆగస్టు 22) :

సింహ రాశి (జూలై 23 - ఆగస్టు 22) :

ఈ రాత్రి పార్టీలో మీకన్నా ఎవరూ తెలివిగా ఉండరు! ఉండలేరు. కనీసం, మీ చుట్టుపక్కల కూడా ఉండరు. మీరు తలుపులు గుండా నడుస్తున్న ప్రతి ఒక్కరితో మీరు చిట్ చాట్ చేస్తుంటారు. మీ చాటింగ్ మరియు మాటలకు ఒక అదుపంటూ ఉండదు.

కన్యా రాశి (ఆగస్టు 23 - సెప్టెంబర్ 22) :

కన్యా రాశి (ఆగస్టు 23 - సెప్టెంబర్ 22) :

కన్యా రాశికి చెందిన వ్యక్తి ఎన్నడూ తెలివిగానే ఉంటాడు. వారికి తాగడం ఇష్టం లేకపోతే, వారి చేత తాగించడం కష్టం. ఒకవేళ తప్పనిసరి అయితే, అతి తక్కువగా లేదా, విషతుల్య రసాయనాలు తక్కువగా ఉండే మందునే ఎంచుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఎవరినీ అంత తేలికగా నమ్మకపోవడమే. కనీసం ఇంటివద్ద తనను నమ్మకంగా చేరుస్తాడు అని ఒక స్నేహితుని కూడా పూర్తిస్థాయిలో నమ్మలేరు.

తులా రాశి (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) :

తులా రాశి (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) :

మీరు నిక్కచ్చిగా కొన్నిటికి కట్టుబడి ఉన్నా కూడా, పార్టీకి హోస్ట్ గా వ్యవహరించడానికి వ్యతిరేకించలేరు - అది మీ ఇల్లు కాకపోయినా. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు, ఖాళీ సీసాలను సేకరించడం మీ అలవాటుగా ఉంటుంది. అంతేకాకుండా, తోటి ప్రజలకు దిశా నిర్దేశాలు చేయడం, వీలైనంతగా మద్యం కారణంగా ఇబ్బంది పడుతున్నవారికి, బేబీ సిటింగ్ చేయడం వంటివి మీ చర్యలుగా ఉంటాయి.

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 - నవంబర్ 21):

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 - నవంబర్ 21):

వంట గదిలో మీరే మాస్టర్ అయినట్లు వ్యవహరిస్తుంటారు. మీరే షాట్లు తయారు చేస్తుంటారు. మరియు ఈ రాత్రి మీ కన్నా కొంచెం ఎక్కువగా ఆకర్షించబడుతున్న లియో మరియు మిధున రాశిలను తప్పించవచ్చు. పార్టీ వద్దు, నేను రాను అన్న మీరే, పార్టీకి వచ్చిన వారిలో మొదటి స్థానంలో కనిపించినప్పుడు ఆశ్చర్యపోవడం వారి వంతు అవుతుంది. పార్టీతో సంబంధం లేదని వ్యవహరించిన మీరే, పార్టీలో అందరికి వారి వారి అభిరుచులకు తగినట్లుగా షాట్స్ చేసివ్వడం, మీ కళా నైపుణ్యాన్ని ప్రస్పుటించేలా చేస్తుంది. మీకు ఉన్న కళ, అందరికీ ఉపయోగపడాలని, అందరూ సంతోషంగా వారి వారి ఇళ్ళకు చేరాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. క్రమంగా వారి ఆరోగ్యస్తాయిల అంచనా ప్రకారం షాట్స్ తయారు చేస్తుంటారు.

 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) :

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) :

మాకు మీ అవసరం ఉంటే, మిమ్మల్ని బీర్ పాంగ్ టేబుల్ వద్ద కలుసుకుంటాము. మమ్మల్ని సవాలు చేయడానికి ధైర్యంచేసే వారిని ఎలాగైనా ఓడిస్తాము. మేము డ్రింకింగ్ ఆధారిత ఆటలు ఆడుతున్నట్లయితే, మీరు నా బృందంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్నట్లుగా మీ వ్యవహార శైలి ఉంటుంది. మీరు చాలెంజింగ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు, క్రమంగా మీతో స్నేహం కొంచం ఆసక్తికరంగా సాగుతుంటుంది.

మకర రాశి : (డిసెంబర్ 22 - జనవరి 19) :

మకర రాశి : (డిసెంబర్ 22 - జనవరి 19) :

మీరు పార్టీ రూమ్ తలుపు గుండా నడుస్తారు, చుట్టూ తిరగడానికి మరియు బయటికి వెళ్లడానికి మాత్రమే. పార్టీలు అందరూ సరదాగా గడిపేందుకు ఉంటారు. కాని మీరు కొంత ముభావంగా ఉంటారు. మీ సన్నిహితులను చుట్టుముట్టడానికి మరియు మీ స్నేహితులతో రౌండ్ బీర్ కోసం సమీప బార్‌కి వెళ్ళే సమయాన్ని వదులుకోకండి. పార్టీలు అవసరమే, మీకంటూ మీ ఆలోచనా విధానం ఉంటుంది. అది మిమ్మల్ని కాపాడుతుంది. అలవాటు లేనప్పుడు, సున్నితంగా తిరస్కరించండి.

కుంభ రాశి : (జనవరి 20 - ఫిబ్రవరి 18) :

కుంభ రాశి : (జనవరి 20 - ఫిబ్రవరి 18) :

మీరు పార్టీలో తాగితే మీలో ఒక తత్వవేత్త జన్మిస్తాడు. మీకు చిన్న చర్చలపై ఆసక్తి ఉండదు. - మీ తాజా సిద్ధాంతాన్ని చర్చించడానికి లేదా విశ్వం గురించి మాట్లాడటానికి మీరు తగినంత మద్యం సేవించడానికి ఇష్టపడుతుంటారు. ప్రతి పార్టీలో, మీ చుట్టూతా జనాలు చేరి మీ మాటలు వింటూ ఉండడం గమనించవచ్చు. ఎటువంటి అంశాల గురించైనా అనర్గళంగా మాట్లాడడం మీ ప్రత్యేకతగా ఉంటుంది.

 మీన రాశి (ఫిబ్రవరి 19 - మార్చి 20) :

మీన రాశి (ఫిబ్రవరి 19 - మార్చి 20) :

మీరు పార్టీని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసేందుకు సుముఖంగా ఉంటారు. అందరితో చర్చించడం, డాన్సు, హోస్టింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వంటి అన్ని విషయాల్లో మీ చేయి ఉంటుంది. అందరి దృష్టి మీమీదే ఉండేలా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ కళా నైపుణ్యాల గురించిన చర్చ ఎక్కువగా పార్టీలో జరుగుతుంది. మీకు ప్రతి పార్టీలోనూ కొత్త స్నేహితులు పుడుతూనే ఉంటారు. కానీ, మీరు అందరితో కలుపుగోలుగా ఉన్నా కూడా, మీ మనసులో ప్రత్యెక స్థానం మాత్రం కొందరికే ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

This Is How Your Zodiac Sign Acts At A Party

Are you a total party animal who loves getting wild or do you prefer to skip the dancing? Astrology is a great tool when it comes to revealing who we really are and what our personalities a really like. Get more essential horoscope information on your zodiac sign and discover what you are like at a party. You’ll be surprised at how accurate our analysis of each star sign is! What is each zodiac like at a party?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more