For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈ రాశుల ఉద్యోగస్తులకు పురోగతికి అవకాశాలు పెరుగుతాయి..!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, ఆషాఢ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Shukra Rashi Parivartan 2022:వృషభంలోకి శుక్రుడి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే, ఈరోజు మీ పని వేగవంతం అవుతుంది. మీరు మీ నిర్ణయాల యొక్క సరైన ఫలితాలను కూడా పొందొచ్చు. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో సోమరితనాన్ని విడిచిపెట్టి తమ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు శుభవార్త అందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:55 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఉద్యోగానికి సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో మీరు సరైన ఫలితాన్ని పొందే బలమైన అవకాశం ఉంది. మీరు వ్యాపారవేత్త అయితే, మీ ఇరుక్కుపోయిన ఒప్పందం పూర్తవుతుంది. మరోవైపు, మీరు కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్రణాళిక ముందుకు సాగొచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు కష్టపడాల్సి రావొచ్చు. అతి త్వరలో మీరు పెద్ద పురోగతిని సాధించగలరు. ఆర్థిక పరిస్థితి ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా పెద్ద పని చేయబోతున్నట్లయితే, కచ్చితంగా మీ సన్నిహితుల నుండి సలహా తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. మీ ప్రేమ కూడా పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ :ఉదయం 4 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. తల్లిదండ్రులతో మీ సంబంధం బాగుంటుంది. ఈరోజు మీరు మీ మనసును మీ పెద్దలతో కూడా పంచుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో బాస్ అదనపు బాధ్యతలు ఇవ్వొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి అనవసరమైన ఖర్చులు కారణం కావొచ్చు. మరోవైపు, వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు పని కోసం ప్రయాణం చేయబోతున్నట్లయితే, మీ ముఖ్యమైన పత్రాలను మీ వద్ద ఉంచుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ఈ 5 రాశుల వారు రహస్యాలను ఎప్పటీకీ వేరే వాళ్ళతో చెప్పరు..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మీ చదువుకు ఆటంకం ఏర్పడితే, ఈ రోజు మీ సమస్యను అధిగమించొచ్చు. ఇప్పుడు మీరు శ్రద్ధగా చదువుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. ఈరోజు మీరు చిన్న తోబుట్టువులతో చాలా సరదాగా గడుపుతారు. మీరు వారి నుండి గొప్ప ఆశ్చర్యాన్ని కూడా పొందొచ్చు. మీలో ఒకరితో ఒకరికి మానసిక అనుబంధం కూడా పెరుగుతుంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని చర్మ సంబంధిత సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 9:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు కోరుకున్న బదిలీని పొందొచ్చు లేదా మీరు పదోన్నతి పొందొచ్చు. ఇదంతా మీ కష్టానికి ఫలితం. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు కూడా ఈరోజు మంచి అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో సానుకూల మార్పులు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తే, మీరు విపరీతమైన లాభం పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీరు వారి ఆనందాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో మంచిగా ఉంటుంది. మీ సంబంధం బలపడుతుంది. మీ ప్రేమ మరింతగా పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వివాహితులకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మీ వైవాహిక జీవితంలో కొత్త మరియు అందమైన మలుపు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనుల జాబితా పెరగడంతో మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. పై అధికారుల వైఖరి కూడా మీ పట్ల మంచిది కాదు. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ :ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

Surya Gochar 2022 :మిధునంలోకి సూర్యుని రవాణాతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో సేల్స్ మరియు మార్కెటింగ్‌కు సంబంధించి పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా సవాళ్లు ఎదురవుతాయి. మీ ముఖ్యమైన పనిలో అడ్డంకులు ఉండొచ్చు. మీకు ఈరోజు చాలా అలసిపోయినట్లు మరియు భారంగా అనిపించవచ్చు. చిరు వ్యాపారులకు ఈరోజు మంచి సంకేతాలు ఇవ్వడం లేదు. మీ అజాగ్రత్త కారణంగా మీరు బాధపడొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. మీరు త్వరలో సానుకూల ఫలితాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఏదైనా ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకపోవడమే మంచిది. లేకుంటే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అదృష్టవంతమైన రోజు. ఈరోజు మీరు కొత్త ఆదాయ వనరులను పొందడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరతాయి. మీరు చిన్న పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇంటి సభ్యునితో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. మీరు వారి మాటలపై శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించబోతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీరు కష్టాల్లో అవగాహన చూపించాలి. ఇంట్లో లేదా కార్యాలయంలో అయినా, ఈరోజు మీరు దీన్ని గుర్తుంచుకోవాలి. ఆఫీసులో మీ సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు జట్టుకృషిపై దృష్టి పెట్టాలి. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే, మీ పెద్దల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోండి. తొందరపాటు మీకు హాని కలిగిస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులు కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే, వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో ఎక్కువగా మాట్లాడొద్దు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో చిన్న ట్రిప్‌కి వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడి పని చేయాలి. మీ ప్రత్యర్థులు మీకు గట్టి పోటీని ఇవ్వగలరు. మీరు ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే, జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మీ నిర్ణయం తీసుకోండి. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. మీరు చాలా సానుకూలంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఇది మీ పనిపై కూడా ప్రభావం చూపుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ డబ్బు చాలా కాలంగా ఎక్కడో నిలిచిపోయి ఉంటే, అది రాకపోవడం వల్ల మీ ఒత్తిడి చాలా పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఇంటి సభ్యుల నుండి మానసిక మద్దతు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ :ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు భూమి, ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. ఈరోజు మీకు కొన్ని శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కోరుకున్న ప్రయోజనాలను పొందొచ్చు. ఉద్యోగస్తులకు కూడా పురోభివృద్ధికి అవకాశం ఉంది. మీరు ఉన్నత పదవిని పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ భాగస్వామితో మీరు ప్రేమతో వివరించాలి. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -01 July 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published: Friday, July 1, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion