Today Rasi Phalalu :ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు పెరగొచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో సఖ్యత చెడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఇతరుల జోక్యం లేకుండా చూసుకోవాలి. మరోవైపు వివాహిత జంటలు తమ జీవితంలో ఆనందం పొందాలంటే తగినంత సమయం కావాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ ఖర్చుల జాబితా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈరోజు మీరు రుణాలు కూడా తీసుకోవాల్సి రావొచ్చు. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు చదువుకునే సమయంలో పెద్దగా అనుభూతి చెందరు. ఈ నేపథ్యంలో మీరు ధ్యానం చేయాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు అవాహితులైతే, మీ ఇంట్లో వివాహం గురించి చర్చించొచ్చు. ఉద్యోగులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. అధిక పనిభారం కారణంగా మీరు చాలా అలసిపోతారు. వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు బలమైన అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీరు విదేశీ కంపెనీలకు సంబంధించిన పనులు చేస్తే, మీ వ్యాపారం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు సులభంగా పని చేయగలరు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మీరు మీ పనిపై ఎక్కువ ఫోకస్ పెడతారు. మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాస పరచేందుకు ప్రయత్నిస్తారు. కాలేయానికి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళన పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా మీకు నిద్రలేమి సమస్యలు కూడా ఉండొచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే మీ మనసును మీ ప్రియమైన వారితో బహిరంగంగా షేర్ చేసుకోండి. మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని కలలు కంటున్నట్లయితే, మరింత కష్టపడాలి. చిరు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు డబ్బు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొనేందుకు సిద్ధమవుతుంటే, మీరు వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. గ్రహాల స్థానం వల్ల మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు మంచి ఉపాధి అవకాశాలను పొందొచ్చు. మీ మార్గంలో ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే, ఈరోజు మీ సమస్యకు పరిష్కారం లభించొచ్చు. మీ బడ్జెట్ కు అనుగుణంగా ఖర్చు చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు నిరాశ చెందొచ్చు. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం రాకపోవచ్చు. దీంతో మీ విశ్వాసం కూడా క్షీణించొచ్చు. అయితే ఇలాంటి సమయంలో ఓపికగా వ్యవహరించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈరోజు మీ మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఈ సమయంలో ఉద్యోగం మానేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. మీ పనితీరును మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఇంట్లో ఒకరి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు డబ్బు గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సమస్య సకాలంలో పరిష్కరించబడుతుంది. ఉద్యోగులు బద్ధకాన్ని వదిలిపెట్టి, మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలి. మీరు ఎంత చురుగ్గా ఉంటే అంత మంచిది. వ్యాపారులు ఈరోజు ఏవైనా కొత్త ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు పిల్లల విషయంలో ఆనందంగా ఉంటుంది. వారు విద్యా రంగంలో మంచి విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందొచ్చు. అయితే ఇనుము వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు న్యాయపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి ఆహారం తీసుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. లేదంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల సూచనలను పట్టించుకోవాలి. మరోవైపు మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. ఆర్థిక పరంగా ఈరోజు ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే కాల్చిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పదోన్నతి పొందేందుకు ప్రయత్నించాలి. పైఅధికారులు మీకు ఏదైనా పని అప్పగిస్తే, దాన్ని సకాలంలో పూర్తి చేయాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో త్వరలో వివాహ కార్యక్రమం నిర్వహించొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి ఈరోజు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీరు పని చేయడంలో భిన్నమైన ఆనందాన్ని అనుభవిస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి పురోగతి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ వ్యాపారాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లాలి. ఈరోజు మీరు చేసే ప్రయాణం చాలా ఆనందకరంగా ఉంటుంది. మీరు ఏవైనా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో పెద్దలు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు మంచిగా ఉంటాయి. ముఖ్యంగా మీరు మీ జీవిత భాగస్వామి యొక్క ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కాకుండా, పిల్లలతో తగినంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. డబ్బుకు సంబంధించిన ఆందోళన మరింత పెరగొచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో ప్రతికూలంగా ఉంటుంది. కొందరు వ్యాపారుల పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Wednesday, May 4, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion