Latest Updates
-
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే..
Today Rasi Phalalu : ఓ రాశి ఉద్యోగులు సహోద్యోగులతో గాసిప్స్ మానుకోవాలి...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, కార్తీక మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. మీరు కొంత గొప్ప గౌరవాన్ని పొందొచ్చు. ఇదంతా మీ కష్టానికి ఫలితం. ఇలా కష్టపడి పని చేస్తూ ముందుకు సాగండి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. మీ వ్యాపార నిర్ణయాలను తొందరపాటుతో తీసుకోకండి. ప్రత్యేకించి మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో పెద్ద రుణం తీసుకోవడం మీకు ఇబ్బంది కలిగించొచ్చు. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీ కుటుంబ ఐక్యతకు భంగం కలగొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రత్యేకించి మీరు ఆఫీసులో పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లయితే, ఈ సమయం మీకు చాలా ముఖ్యం. మీ పనిపై శ్రద్ధ వహించండి. త్వరలో మీరు గొప్ప విజయాన్ని పొందొచ్చు. వ్యాపారస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కొన్ని మంచి వ్యూహాలను రూపొందించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా అదృష్టవంతులు. ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. మీరు త్వరలో డబ్బు పొందొచ్చు. మీ కుటుంబ సభ్యులతో మంచి సామరస్యం ఉంటుంది. ఈరోజు జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే, ఈరోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ ఒత్తిడిని తీసుకోవడం మానుకోండి. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల మార్గదర్శత్వం పొందుతారు. మీ ముఖ్యమైన పనిలో ఏదైనా అడ్డంకి ఉంటే, ఈరోజు వారి సహాయంతో మీరు ఈ సమస్యను ముగించొచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తులు తొందరపడొద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ పెద్దలను గౌరవించాలి. ముఖ్యంగా మీ తండ్రితో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగించాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఈరోజు పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళుతున్నట్లయితే, మీ సన్నాహకాలపై మరింత శ్రద్ధ వహించాలి. మీరు సానుకూలంగా ఉండండి. మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి అజాగ్రత్త వల్ల మీకు ఆర్థికంగా పెద్ద నష్టం వాటిల్లుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆకస్మిక సమస్యలు ఉండొచ్చు. మీ ఇంటి సభ్యులతో సఖ్యత చెడిపోయే అవకాశం ఉంది. కోపంలో తప్పుడు పదాలను ఉపయోగించడం మానుకోండి. లేకపోతే మీ సంబంధం దెబ్బతింటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ : 45
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లయితే, మీరు ఓపికగా ఉండాలి. మీరు తెలివిగా ప్రవర్తించకపోతే, మీ మధ్య విభజన కూడా సాధ్యమే. మరోవైపు రొమాంటిక్ లైఫ్‌లో కూడా కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామి యొక్క ఆవేశపూరిత స్వభావం మీకు సమస్యలను సృష్టిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీరు పొదుపుపై దృష్టి పెట్టగలరు. దీంతో పాటు, మీరు ఏదైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు. ఆఫీసులో బాస్‌తో ముఖ్యమైన మీటింగ్ ఉండొచ్చు. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. చిరు వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకమైన రోజు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు కొంతమంది పెద్ద కస్టమర్‌లతో కనెక్ట్ కావచ్చు. మీ వ్యాపారంలో త్వరలో సానుకూల మార్పుల సంకేతాలు ఉన్నాయి. ఈరోజు ఉద్యోగస్తులు తమ పనుల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈరోజు బాస్ దృష్టి మీపైనే ఉంటుంది. సహోద్యోగులతో గాసిప్ చేయడం లేదా ఎక్కువగా మాట్లాడటం మానుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఖర్చుల గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది. దీని కారణంగా మీరు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి బహుమతిని కూడా పొందొచ్చు. తొందరపాటు మరియు భయాందోళనలను నివారించండి. మీరు గాయపడే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు ఉదయం కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజు. మీరు చిక్కుకున్న డబ్బు నుండి ఉపశమనం పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో మీ కృషి ఎంతో ప్రశంసించబడుతుంది. ఉన్నతాధికారులతో పాటు మీ పనితీరుపై ఉన్నతాధికారులు కూడా సంతృప్తి చెందుతారు. ఇలా కష్టపడి పని చేస్తూ ఉండండి. త్వరలో మీ పురోగతి కల నెరవేరుతుంది. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఈరోజు పెద్ద ఒప్పందం కుదరొచ్చు. రాబోయే రోజుల్లో మీ వ్యాపారం రెండింతలు వేగంగా వృద్ధి చెందుతుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి. మీ ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందేందుకు బలమైన అవకాశం ఉంది. మీరు ఉన్నత పదవిని పొందొచ్చు. అలాగే మీ జీతంలో పెరుగుదల సంకేతాలు ఉన్నాయి. ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారిపై పని భారం ఎక్కువగా ఉంటుంది. చిల్లర వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, ఈరోజు వారి ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అందమైన మలుపు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి రోజు. ఈరోజు డబ్బుకు సంబంధించిన ఆందోళనలు తీరుతాయి. మీకు కాలేయ సమస్యలు ఉంటే, మీ ఆహారంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు పెద్ద నష్టం ఉండొచ్చు. ఈరోజు ఉద్యోగస్తులు సమయం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. మీ బాస్ ఇచ్చిన బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే, ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీరు మీ మనసును మీ ప్రియమైన వారితో స్వేచ్ఛగా పంచుకోవచ్చు. దీనివల్ల మీరు మానసికంగా చాలా మెరుగ్గా ఉంటారు. సాయంత్రం పూట పాత మిత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. మీరు పని చేయడంలో భిన్నమైన ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు కంపెనీ నుండి బోనస్ కూడా పొందొచ్చు. మీ ఈ పండుగ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఐక్యత ఉంటుంది. మీ ప్రియమైన వారి నుండి మీకు మానసిక మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు పిల్లల కోసం కొన్ని ముఖ్యమైన షాపింగ్ కూడా చేయొచ్చు. మీకు స్నేహితుడితో విభేదాలు ఉంటే, ఈరోజు అన్ని అపార్థాలు తొలగిపోతాయి. మరోసారి మీ సంబంధంలో మాధుర్యం ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, శారీరకంగా మీరు చాలా చురుకుదనంతో ఉంటారు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు నిరంతరం కూర్చొని పని చేయడం మానుకోండి, లేకుంటే ఈరోజు మీకు వెన్ను లేదా నడుముకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆఫీసులో పెండింగ్ పనుల భారం కాస్త పెరుగుతుంది. మీరు మీ పనులను ప్రశాంతమైన మనస్సుతో మరియు అవగాహనతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే, మీరు విజయం పొందొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి అజాగ్రత్తలకు దూరంగా ఉండాలి. వ్యాపారవేత్తలు పెద్ద కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు వారి ప్రసంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడొచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ఏకీభవించనట్లయితే, మీరు శాంతి మరియు ప్రేమతో మీ అభిప్రాయాన్ని వారికి వివరించడానికి ప్రయత్నించాలి. గొడవల వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా మంచి సంకేతాలను ఇస్తుంది. మీరు కోరుకున్న బదిలీని పొందొచ్చు. మరోవైపు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు పురోగతి సంకేతాలు ఉన్నాయి, ప్రత్యేకించి మీరు బ్యాంకింగ్ రంగానికి అనుబంధంగా ఉన్నట్లయితే, త్వరలో మీరు ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. పండ్లు, స్వీట్లు, అలంకారాలు మొదలైన వాటికి సంబంధించిన పని చేసే వారికి ఈరోజు చాలా ప్రయోజనకరమైన రోజు. ఇనుము వ్యాపారులు కూడా మంచి లాభాలు పొందగలరు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో జీవిస్తే ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత నెలకొంటాయి. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











