Today Rasi Phalalu: ఈ రోజు ఆ రాశుల వారి వ్యాపారాలు లాభాల బాట పడతాయి

మంచి, చెడు ఎలా వస్తాయనేది తెలుసుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. ప్రతి మనిషిలోనూ కుతూహలం ఉంటుంది. ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం. ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Today Rasi Phalalu: తమ జీవితంలో ఏం జరుగుతుంది.. ఏం జరగబోతోంది అని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తమ అదృష్టం, దురదృష్టం గురించి చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటారు. రాశులను బట్టి, జన్మ నక్షత్రాలను బట్టి తమ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి.. వాటి ఫలితం జీవితంపై ఎలా ఉంటుంది.. మంచి, చెడు ఎలా వస్తాయనేది తెలుసుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. ప్రతి మనిషిలోనూ కుతూహలం ఉంటుంది.

Today rasi phalalu 05 september 2022 daily horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? విద్యార్థులు చదువుల్లో రాణిస్తారా? ప్రయాణాలు అనుకూలిస్తాయా? వ్యాపారంలో లాభ నష్టాల సంగతి ఏమిటి? న్యాయపరమైన సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుందా? అదృష్ట రంగు, సంఖ్య విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి.

మేషం(Aries)(మార్చి 20 - ఏప్రిల్ 18):

మేషం(Aries)(మార్చి 20 - ఏప్రిల్ 18):

ఈ రోజు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహం మెండుగా ఉండటం వల్ల వ్యాపారాలు మంచి లాభాల బాటలో నడుస్తాయి. సంతానం, విద్యా ఇతర విషయాల్లో మంచి వార్తలు వింటారు. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాతను పూజించాలి. ఐశ్వర్య కాళీ అమ్మ వారిని ప్రత్యేకంగా పూజించాలి. ఎర్రని పూలతో అమ్మ వారికి సమర్పించాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

వృషభం(Taurus)(ఏప్రిల్ 19 - మే 19):

వృషభం(Taurus)(ఏప్రిల్ 19 - మే 19):

వృషభ రాశి వారికి ఈ రోజు వాహన ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. చిన్న నాటి మిత్రులతో మాట పట్టింపులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రాకపోవచ్చు. సోదరులతో ఆస్తి వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. వృత్తిలో, వ్యాపారంలో నిరాశజనక ప్రయోజనాలు వస్తాయి. సమయం, సందర్భం అనుకూలించాలంటే విష్ణు సహస్ర నామాలు పఠించాలి. పశు, పక్ష్యాదులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి.

లక్కీ కలర్ : నలుపు

లక్కీ నంబర్ : 22

మిథునం(Gemini)(మే 20 - జూన్ 20 ):

మిథునం(Gemini)(మే 20 - జూన్ 20 ):

మిథునం రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ వహించాలి. వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను ఆచి తూచి తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అవి భవిష్యత్తులో బాధించే అవకాశాలు ఉంటాయి. కొన్ని చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి పై అధికారుల నుండి సమస్యలు తప్పవు.

లక్కీ కలర్ : గులాబీ

లక్కీ నంబర్ : 7

కర్కాటకం(Cancer)( జూన్ 21 - జులై 21):

కర్కాటకం(Cancer)( జూన్ 21 - జులై 21):

కర్కాటక రాశి వారికి ఈ రోజు అన్ని పనులు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో లాభ పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులన్నీ మంచి ఫలితాన్ని ఇస్తారు. వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా మారతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. బంధు మిత్రలు నుండి శుభవార్తలు వింటారు. అనకూలమైన శుభ ఫలితాల కోసం గోమాతను పూచించాలి.

లక్కీ కలర్ : గోధుమ

లక్కీ నంబర్ : 15

సింహం(Leo)( జులై 22 - ఆగస్టు 21 ):

సింహం(Leo)( జులై 22 - ఆగస్టు 21 ):

సింహ రాశి వారికి ఈ రోజు ఎంతో ఆనందదాయకంగా ఉండనుంది. చాలా సంతోషంగా గడపనున్నారు. మంచి మాట తీరు కలిసి వస్తుంది. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంతానానికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిగతా రోజుల కంటే కూడా ఈ రోజు వ్యాపారం ఎంతో లాభదాయకంగా ఉండనుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.

లక్కీ కలర్ : డార్క్ వయోలెట్

లక్కీ నంబర్ : 22

కన్య(Virgo)( ఆగస్టు 22 - సెప్టెంబర్ 21 ):

కన్య(Virgo)( ఆగస్టు 22 - సెప్టెంబర్ 21 ):

ముందుగా తలపెట్టిన దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న రుణ ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కాస్తంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉంటుంది. ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు ఐదు రూపాయలు ఉంటుంద.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 11

తుల(Libra)( సెప్టెంబర్ 22 - అక్టోబర్ 22):

తుల(Libra)( సెప్టెంబర్ 22 - అక్టోబర్ 22):

తుల రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో అంతగా కలిసి రావు. ఉద్యోగంలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధు మిత్రులతో మాటా పట్టింపులు కలుగుతాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 3

వృశ్చికం(Scorpio)( అక్టోబర్ 23 - నవంబర్ 20 ):

వృశ్చికం(Scorpio)( అక్టోబర్ 23 - నవంబర్ 20 ):

వృశ్చికం రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రణాళికలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఒక వ్యవహారంలో దూర ప్రాంతంలో ఉన్న బంధు మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. గోమాతకు గ్రాసం పెడితే శుభం కలుగుతుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 9

ధనస్సు(Sagittarius)( నవంబర్ 21 - డిసెంబర్ 20):

ధనస్సు(Sagittarius)( నవంబర్ 21 - డిసెంబర్ 20):

ఈ రోజు ధనస్సు రాశి వారు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కాబట్టీ అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని గ్రహించాలి. కొన్ని విషయాల్లో నిరాశ పెరుగుతుంది. వాటిని చక్కగా నిర్వహించాలి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

లక్కీ కలర్ : సీ గ్రీన్

లక్కీ నంబర్ : 5

మకరం(Capricon)( డిసెంబర్ 21 - జనవరి 19 ):

మకరం(Capricon)( డిసెంబర్ 21 - జనవరి 19 ):

ఈ రోజు మకర రాశి వారు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మకర రాశి వారి సంతానం పోటీ పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. రావి చెట్టుకు పూజించడం వల్ల శుభం కలుగుతుంది. వాసుదేవాయ మంత్రాన్ని పఠించాలి.

లక్కీ కలర్ : గులాబీ

లక్కీ నంబర్ : 15

కుంభం(Aquarius)( జనవరి 20 - ఫిబ్రవరి 18 ):

కుంభం(Aquarius)( జనవరి 20 - ఫిబ్రవరి 18 ):

కుంభ రాశి వారికి ఆస్తి తగాదాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు కుంభ రాశి వారు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటే మంచిదని. వృత్తి ఉద్యోగాలు సాధారణంగానే ఉంటాయి. వ్యాపార విస్తరణ పనులు కొంత మందగించే అవకాశం ఉంటుంది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : నలుపు

లక్కీ నంబర్ : 22

మీనం(Pisces)( ఫిబ్రవరి 19 - మార్చి 19 ):

మీనం(Pisces)( ఫిబ్రవరి 19 - మార్చి 19 ):

ఈరాశి వారు ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుండి ప్రశంసలు, హోదాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

లక్కీ కలర్ : గులాబీ

లక్కీ నంబర్ : 1

Desktop Bottom Promotion