Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
Today Rasi Phalalu :ఓ రాశి వారు ఆస్తి ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు నిర్ణయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొస్తాయి. మీ పనితీరుతో బాస్ చాలా సంతోషిస్తారు. మీరు మీ పురోగతికి సంబంధించిన సంకేతాలను కూడా పొందొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో పెరుగుతున్న అపార్థాల కారణంగా ఈరోజు మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే అలవాటు మీ మధ్య మనస్పర్దలను పెంచుతుంది. అలాంటి సమయంలో మీరు సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మరోవైపు ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాపారులు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీరు సానుకూల భావాన్ని అనుభవిస్తారు. మీ అన్ని పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ :25
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు చేసే ప్రయాణం చాలా ముఖ్యమైనది. మీరు విదేశీ కంపెనీలో పని చేస్తుంటే, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులన్నీ కష్టపడి, అంకితభావంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. తల్లిదండ్రులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే పెద్దల మద్దతు లభిస్తుంది. ల్యాప్ టాప్స్ మరియు కంప్యూటర్లను ఎక్కువగా వాడుతుంటే, మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :34
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన పెరుగుతుంది. మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగులకు ఈరోజు పురోగతి గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇదంతా మీ కష్టానికి ఫలితమే. వ్యాపారులు తమ ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీ పరిస్థితి మెరుగుపడొచ్చు. మీరు తెలివిగా ఖర్చు చేస్తే, త్వరలో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:55 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అదనపు పనిని కేటాయించొచ్చు. అలాంటి సమయంలో మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఆందోళన ఉంటుంది. మీరు వాదనలకు దూరంగా ఉండాలి. లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా, మీ ఆరోగ్యం కూడా క్షీణించొచ్చు. కాబట్టి ఎక్కువగా చింతించకుండా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో నిరుద్యోగులు మంచి ఉద్యోగం ఎదురుచూస్తున్నట్లయితే, ఈరోజు మీ అన్వేషణ ముగిసే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ఉద్యోగం పొందే బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా సమస్యలన్నీ ఈరోజు తొలగిపోతాయి. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపాటును నివారించాలి. మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. వీలైతే, ఈరోజు వారితో ఎక్కువ సమయం గడపండి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. మీరు బాస్ యొక్క మద్దతు పొందుతారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈరోజు మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మంచిగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మానసిక మద్దతు పొందుతారు. మీ రొమాంటిక్ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. మీరు మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం వంటివి చేయొద్దు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండదు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :15
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి అవకాశం లభిస్తుంది. ప్రత్యేకించి మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, మంచి విజయాన్ని అందుకోవచ్చు. ఉద్యోగులు ఈరోజు కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఆకస్మికంగా డబ్బు పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు ఆస్తికి సంబంధించి ఏదైనా ఒప్పందాలు చేసుకునేటట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్ద ఇబ్బందుల్లో పడొచ్చు. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మరింత కష్టపడాలి. మీ కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో సకాలంలో పనులు పూర్తి చేయాలి. బాస్ మీ కష్టాన్ని గుర్తించగలరు. వ్యాపారులకు ఈరోజు సవాళ్లు ఎదురవుతాయి. మీ భాగస్వామితో సమన్వయం క్షీణించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. అలాంటి పరిస్థితిలో మీరు చాలా ఓపికగా పని చేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువ ఖర్చులు చేయొచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











