Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Today Rasi Phalalu :ఈ రాశుల ఉద్యోగుల విదేశీ కల సాకారం కాబోతోంది..!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా వ్యాపారుల ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. మీరు ఇటీవల ఏదైనా రుణం తీసుకున్నా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు ఈరోజు మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు కూడా రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకండి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :30
లక్కీ టైమ్ :సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు అనుకూలంగా మార్గాలు తెరచుకుంటాయి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, ప్రచారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు ఈరోజు బదిలీ గురించి కొన్ని శుభవార్తలు వినిపించొచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి తమ కల త్వరలో నెరవేరుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో సంబంధంలో సానుకూలత ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ :ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో పని చేసే వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. చెక్క పనికి సంబంధించిన వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఇతర వ్యక్తులకు ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న ఆదాయం రావొచ్చు. మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధం మంచిగా ఉంటుంది. అయితే మీరు వ్యవహారిక శైలిపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 6:45 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. అయితే మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది. పాత వ్యాధులు మిమ్మల్ని కలవరపెట్టొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ :16
లక్కీ టైమ్ :సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో ప్రేమలో ఉన్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుది. వివాహితులకు కూడా జీవిత భాగస్వామితో సంబంధంలో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు వివాహం కాని వారికి ఈరోజు పెళ్లి గురించి కొన్ని శుభవార్తలు వినిపించొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పని చేసే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. చిన్న వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :32
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు కొన్ని మంచి ప్రయోజనాలు రానున్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులకు ఎక్కువ లాభాలు రావొచ్చు. రోజు వారీ పని చేసుకునే వారికి కూడా ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో ఇతరులను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకొని, పొరపాట్లు చేయకండి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని అంటువ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.
లక్కీ కలర్ : లేత తెలుపు
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ :ఉదయం 8:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అదృష్టకరమైన రోజు. బాస్ మీ కష్టాన్ని గమనిస్తారు మరియు మీరు పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశాన్ని పొందుతారు. మీరు మీ బృందానికి నాయకత్వం వహించవచ్చు. మరోవైపు వ్యాపారస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభించకపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు కొన్ని పెద్ద బాధ్యతలను పొందొచ్చు. మీరు మీ పనిని శ్రద్ధగా మరియు తప్పులు చేయకుండా ఉంటే మంచిది. వ్యాపారులు ఎటువంటి చట్టవిరుద్ధమైన పనిని చేయకుండా ఉండాలి. లేకుంటే మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో ఉంటాయి. ఈరోజు మీకు ఇంటి సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. కోపంలో తప్పుడు పదాలు వాడకుండా ఉండటం మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి ఆహారంతో పాటు రోజూ తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :7
లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, దానికి సరైన సమయం. మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. త్వరలో మీరు మీ వ్యాపారంలో పెరుగుదలను చూస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలోని ఉన్నతాధికారుల సలహాలు పాటించాలి. అనవసరమైన అహంకారం మీకు మంచిది కాదు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీరు విద్యా రంగంలో కొంత గొప్ప విజయాన్ని పొందొచ్చు. ఆరోగ్యం విషయంలో బలహీనంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :16
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు జర్నీ చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు ప్రభుత్వ విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఉంటేనే మేలు. ఇది కాకుండా, మీరు టీమ్‌వర్క్‌పై కూడా దృష్టి పెట్టాలి. డబ్బు పరంగా ఈరోజు మీకు సాధారణం కంటే మెరుగైన రోజు అవుతుంది. అయితే, మీరు దుబారాకు దూరంగా ఉండాలి. తోబుట్టువులతో ఈరోజు చాలా సరదాగా ఉంటుంది. మీరు వారి మానసిక మద్దతు పొందుతారు. మీరు పిల్లల విద్యకు సంబంధించిన ఏవైనా పెద్ద ఆందోళనలను వదిలించుకోవచ్చు. మీకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఏదైనా ఉంటే అజాగ్రత్తగా ఉండకండి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో, సోమరితనాన్ని విడిచిపెట్టి, మీ ముఖ్యమైన పనులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మీ అజాగ్రత్త కారణంగా రాబోయే రోజుల్లో మీపై పని భారం పెరగవచ్చు. అదే సమయంలో, వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కొత్త వ్యూహాలను రూపొందించాలి. మీరు మార్పు కోసం ప్లాన్ చేస్తుంటే, మీరు మీ సన్నిహితుల నుండి సలహా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచి రోజు. ఇది కాకుండా, ఈరోజు మీరు ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు రావొచ్చు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ :ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రభావం కారణంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎవరితోనైనా గొడవ పడే అవకాశం ఉంది. మీ కోపం స్వభావం మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జరిగే రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు ఏదో కుట్రకు బలి కావొచ్చు. మరోవైపు, వ్యాపారులు ఈరోజు పెద్ద డీల్ చేయడానికి అవకాశం పొందొచ్చు. మార్కెట్లో మీ స్థానం బలంగా ఉంటుంది. మీ మంచి నిర్ణయాల ఫలితాలను మీరు చూస్తారు. మీ ఇంటి పెద్దలతో మీ సంబంధం చెడిపోవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉండదు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ :మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











