For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారి ముఖ్యమైన నిర్ణయాలకు పెద్దల మద్దతు లభిస్తుంది...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Surya Gochar 2022: వృషభంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం..!Surya Gochar 2022: వృషభంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం..!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ ఇంటి సభ్యులతో ఈరోజు సామరస్యం క్షీణించొచ్చు. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. గతంలో తీసుకున్న ఏదైనా సరైన నిర్ణయం వల్ల మంచి ఫలితాన్ని పొందొచ్చు. మరోవైపు ఉద్యోగులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. మీరు పురోగతి సాధించొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు రావొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులో వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలి. వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు నిలిచిపోయిన వ్యాపారాలను పునఃప్రారంభించొచ్చు. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఖరీదైన స్వభావం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :35

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి మీ ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. ఇది కాకుండా, మీ కష్టానికి మంచి ఫలితాలొచ్చే బలమైన అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందగలరు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

ఈ 5 రాశుల వారు ఎప్పుడూ భార్యకు లొంగిపోతారు... అయినా మంచి భర్తగా ఉంటారు!ఈ 5 రాశుల వారు ఎప్పుడూ భార్యకు లొంగిపోతారు... అయినా మంచి భర్తగా ఉంటారు!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కాకుండా ఈరోజు మీ భాగస్వామితో మీ అనుబంధం కూడా క్షీణించొచ్చు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో ఎక్కువ సమయం కేటాయించాలి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు ఈరోజు వైవాహిక జీవితంలో శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో మంచిగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీరు మీ భాగస్వామితో తగినంత సమయం గడుపుతారు. ఈరోజు మీకు మరపురాని రోజు అవుతుంది. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రెడిట్ లావాదేవీలు చేయకుండా ఉండాలి. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులైనా, వ్యాపారులైనా ఈరోజు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :19

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:20 నుండి ఉదయం 11 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే మీ చెడ్డ మాటలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. వ్యాపారులు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తప్పుడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఇంటి వాతావరణం మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ మరింతగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీరు వీలైనంత త్వరగా అప్పుల నుండి బయటపడాలి. వీలైనంత ఎక్కువగా పొదుపుపై ఫోకస్ పెట్టాలి. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా మరియు ఆలోచనాత్మకంగా చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు అజాగ్రత్తగా ఉండొద్దు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు గొప్ప పురోగతిని సాధించగలరు. మరోవైపు మీరు నిరుద్యోగులు మరియు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీ అన్వేషణ ఈరోజు ముగియవచ్చు. చిరు వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం మానుకోవాలి. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆకస్మికంగా కొంత ఎక్కువ సొమ్ము ఖర్చయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :38

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లయితే, మీరు ఏదైనా పత్రాల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. మీరు పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు చాలా మంచి అవకాశం వస్తుంది. బాస్ మీకు ఆఫీసులో కొన్ని పెద్ద బాధ్యతలు అప్పగించొచ్చు. మీరు మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడం మంచిది. మీ వైవాహిక జీవితంలో కొత్త మలుపు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : కుంకుమ పువ్వు

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు మరింత కష్టపడి పని చేయాలి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కష్టాలు పెరగొచ్చు. ప్రత్యేకించి మీ ఉద్యోగం తాత్కాలికమైనదైతే, ఈరోజు మీరు పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక పరిస్థితి క్షీణించొచ్చు. మీరు ఇటీవల ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే, ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈ సమయంలో ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, అందుకోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంటే, ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. మరోవైపు వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులతో సమయం గడిపేందుకు మీకు అవకాశం వస్తుంది. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, పెద్దల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, మీ బరువును అదుపులో ఉంచుకోవాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు బాగా ఆలోచిస్తే, మీకు మంచి జరుగుతుంది. పని విషయంలో ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను పొందకపోతే, మీరు ఓపికగా ఉండాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే కోపం మరియు ఒత్తిడికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :30

లక్కీ టైమ్ : ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. ఆఫీసులో ఏ చిన్న పనిని పెండింగులో పెట్టొద్దు. ఈరోజు బాస్ ఫోకస్ మీపైనే ఉంటుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందగలరు. స్టాక్ మార్కెట్లో పని చేసే వ్యక్తులు ఈరోజు ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -14 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Friday, May 13, 2022, 22:10 [IST]
Desktop Bottom Promotion