Latest Updates
-
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
Today Rasi Phalalu : ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ఖర్చులు పెరగొచ్చు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, కార్తీక మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పనికి సంబంధించిన కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో ఉద్యోగుల శ్రమను ఉన్నతాధికారులు గమనించగలరు. దీంతో మీరు త్వరలో ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారస్తులు పాత చట్టపరమైన సమస్య నుండి బయటపడగలరు. మీ పెండింగ్ పనులు త్వరలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. మీ తెలివితేటలతో, మీరు అదనపు డబ్బు సంపాదించగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. మీ నిర్ణయాలను ఇతరులపై రుద్దడం మానుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో, వారు మీ ముఖ్యమైన పనిలో దేనినైనా అడ్డుకోవచ్చు లేదా మీకు హాని కలిగించొచ్చు. పని విషయంలో సహోద్యోగుల నుండి ఎక్కువగా ఆశించొద్దు. మీ ముఖ్యమైన పనులను స్వంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. చిరు వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు పండ్లు, పువ్వులు, కిరాణా మొదలైన వాటికి సంబంధించిన పనులు చేస్తే, ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేకపోతే, వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రుణాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో పనితో పాటు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానుకోండి. లేకుంటే మీకే ఇబ్బంది ఏర్పడొచ్చు. పెద్ద వ్యాపారవేత్తలు తమ ఉద్యోగులతో వాదనలు లేదా విభేదాలను నివారించాలి. లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. ఇంట్లోని యువకులతో మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి బాగా ఉండదు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి రాత్రి 8:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల సలహా మేరకు నడుచుకోవాలి. దీంతో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా చురుకుగా ఉండాలి. మీకు కొంచెం ఎక్కువ పని భారం ఉండొచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు సానుకూలంగా ఉండాలి. కష్టపడి పని చేస్తూ ఉండండి, త్వరలో మీ కృషి విజయవంతమవుతుంది. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఇంటి ఖర్చుల జాబితా పెరగనివ్వవద్దు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే, విషయం చాలా దూరం వెళ్ళొచ్చు. పిల్లల చదువు విషయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులకు చాలా మంచిగా ఉంటుంది. మీ వ్యాపారం పెరుగుతుంది. ఈరోజు మీరు కొంతమంది కొత్త కస్టమర్‌లతో కూడా కనెక్ట్ కావొచ్చు. అదే సమయంలో, ఉద్యోగస్తుల పనిభారం కొంచెం తక్కువగా ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణమైనదిగా కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీరు ఇంటి పెద్దలతో కొన్ని ముఖ్యమైన చర్చలు కూడా చేయొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీరు కొంచెం మెరుగ్గా ఉండొచ్చు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పిల్లల వైపు నుండి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు వారి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మరోవైపు, వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పనులు చేస్తుంటే, ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీరు వారి ఆతిథ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం విషయానికొస్తే, ఈ రోజు మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు పెరుగుతున్న ఖర్చుల జాబితా వల్ల కొంత ఆందోళన పెరుగుతుంది. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతూకం ఉంచుకుంటే మంచిది. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం మర్చిపోవద్దు. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో వాగ్వాదానికి గురవుతారు. కోపంలో తప్పుడు పదాలను ఉపయోగించడం మానుకోండి. వ్యాపారస్తులు షార్ట్‌కట్ రూట్‌లో వెళ్లకుండా ఉండాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు బద్ధకం మరియు సోమరితనం అనుభూతి చెందుతారు. దీని కారణంగా మీరు మీ పనిపై సరైన శ్రద్ధ చూపలేరు. వీలైతే, ఈరోజు పనిని పక్కన పెట్టండి. ఈరోజు మీరు విశ్రాంతిపై దృష్టి పెట్టండి. మీకు ఇష్టమైన ప్రదేశానికి స్నేహితులతో షికారు చేయండి. దీనివల్ల మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు. వ్యాపారస్తులు ఈరోజు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీ ప్రయాణం చాలా ముఖ్యమైనది. మీరు ప్రియమైనవారితో అహంకారం మరియు వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు వివాహం చేసుకుంటే, మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారవేత్త అయితే మరియు పెద్ద పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే, మీరు సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ అడుగు ముందుకు వేయాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు మంచి రోజు కాదు. మీ వ్యాపారం క్షీణించొచ్చు. అదే సమయంలో ఉద్యోగస్తులకు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల మీ ప్రమోషన్ చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే, ఈరోజు మీరు శుభవార్త పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రశాంతమైన మనస్సుతో మీ పనిని పూర్తి చేయడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకండి. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు కాదు. మీ ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీరు మీ ప్రియమైనవారి నుండి పూర్తి మద్దతు పొందొచ్చు. ఈరోజు, మీ జీవిత భాగస్వామి యొక్క అవగాహనతో, ఏదైనా పెద్ద సమస్య ముగుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, త్వరలో మీ ఆర్థిక సమస్యలను అధిగమించొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు అసౌకర్యాన్ని అనుభవించొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు భగవంతుడిని ధ్యానించాలి. మీరు నిరుద్యోగులు మరియు చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఎలాంటి కష్టమైన పనినైనా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలను సంపాదించడానికి ఈరోజు కష్టపపడాల్సి ఉంటుంది. కానీ మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలలో మంచి సమన్వయం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామికి ఆశ్చర్యం కలిగించాలని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు దానికి అనుకూలమైన రోజు. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఆఫీసు వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. మీకు సవాలుతో కూడిన పని అప్పగించబడిచ్చు. మీరు కలిసి పని చేయాలా. అనవసరమైన ఘర్షణ లేదా అహంకారాన్ని నివారించండి. మరోవైపు, వ్యాపారవేత్తలు చట్టపరమైన విషయాలలో చాలా అజాగ్రత్తగా ఉండకూడదు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనట్లు కనిపిస్తున్నాయి. మీ ఇంటి సభ్యులతో ప్రేమ, మాధుర్యం పెరుగుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. చాలా కాలం తర్వాత మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











